నాని చేతికి మాస్ మహారాజ్ మూవీ | Nani replaces Mass Maharaja in dilraju film | Sakshi
Sakshi News home page

నాని చేతికి మాస్ మహారాజ్ మూవీ

Published Fri, Oct 28 2016 2:08 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

నాని చేతికి మాస్ మహారాజ్ మూవీ

నాని చేతికి మాస్ మహారాజ్ మూవీ

బెంగాల్ టైగర్ సినిమాతో మంచి విజయం సాధించిన రవితేజ. ఇంత వరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను మొదలు పెట్టలేదు. ఒకటి రెండు సినిమాలు సెట్స్ మీదకు వచ్చినట్టుగానే అనిపించినా చివరి నిమిషంలో ఆగిపోయాయి. ముఖ్యంగా దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఎవడో ఒకడు సినిమా ఎనౌన్స్మెంట్ కూడా అయ్యాక ఆగిపోయింది. కారణం ఏంటన్నది బయటికి రాకపోయినా ఈ ప్రాజెక్ట్ రవితేజతో కాకుండా వేరే హీరోతో చేయాలని ఫిక్స్ అయ్యాడు దిల్ రాజు.

రవితేజ తరువాత ఈ కథను సీనియర్ హీరో నాగార్జునకు వినిపించాడు. కథ బాగుందన్న కింగ్ తనకు సూట్ అవ్వదేమో అన్న ఆలోచనతో పక్కన పెట్టేశాడు. దీంతో మరోసారి హీరో కోసం వేట కొనసాగిస్తున్నాడు దిల్ రాజు. ప్రస్తుతం నాని హీరోగా నేను లోకల్ సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు, అదే హీరోతో ఎవడో ఒకడు సినిమాను చేయాలని భావిస్తున్నాడట. అయితే ఈ సినిమా తరువాత మరో మూడు సినిమాలను లైన్లో పెట్టిన నాని, ఎవడో ఒకడు సినిమా చేయాలంటే మరో ఏడాది సమయం పడుతుంది. మరి అప్పటి వరకు దిల్ రాజు వెయిట్ చేస్తాడా..? లేక వేరే హీరోతో పట్టాలెక్కిస్తాడా చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement