బాహుబలి, సాహో చిత్రాలతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ హాలీవుడ్ స్థాయికి చేరింది. దీంతో అతడితో భారీ చిత్రాలను తెరకెక్కించాలని దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘జిల్’ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. వింటేజ్ స్టైల్లో ఓ లవ్ స్టోరీని బలమైన స్క్రిప్ట్‌తో తెరపై చూపించేందుకు దర్శకుడు ప్రయత్నిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ చిత్రం తర్వాత ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో భారీ చిత్రానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కే ఈ భారీ బడ్జెట్ చిత్రానిన్న అశ్వినీ దత్ నిర్మిస్తున్నాడు. నాగ్ అశ్విన్ చిత్రం తర్వాత ప్రభాస్‌తో తప్పక ఓ చిత్రం చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడని ఇండస్ట్రీ టాక్.
అయితే ఈ చిత్రం తర్వాత ప్రభాస్‌తో ఓ భారీ ప్యాన్ ఇండియా సినిమాను నిర్మించాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భావిస్తున్నాడని ఫిలింనగర్‌లో ప్రస్తుతం వినిపిస్తున్న హాట్ న్యూస్. ఈ భారీ బడ్జెట్ చిత్ర దర్శకత్వ బాధ్యతలను వేణు శ్రీరామ్‌కు అప్పగించినట్లు సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రం కోసం బలమైన స్కి‍్రప్ట్‌ను సిద్దం చేసే పనిలో ఈ యువ దర్శకుడు ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం పింక్ రిమేక్ ‘వకీల్ సాబ్’ చిత్రం కోసం దిల్ రాజు, వేణుశ్రీరామ్‌లు కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రం తర్వాతనే ప్రభాస్ సినిమాను లైన్లో పెట్టాలని వీరిద్దరు అనుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ‘వకీల్ సాబ్’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉన్న లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక దిల్ రాజు బ్యానర్‌లో ప్రభాస్ ‘మిస్టర్ ఫరెఫెక్ట్’ చిత్రాన్ని చేసిన విషయం తెలిసిందే.
చదవండి:
పదిహేనేళ్లవుతున్నా.. జనాల గుండెల్లో ‘భద్ర’oగా
దేవిశ్రీ ఫిక్స్.. ప్రకటించిన క్రేజీ డైరెక్టర్
దిల్ వాకిట్లో తేజస్విని
ప్రభాస్‌తో రాజు భారీ చిత్రం.. డైరెక్టర్ అతడేనా?
Published Tue, May 12 2020 2:05 PM | Last Updated on Tue, May 12 2020 2:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment