మళ్లీ ట్రెండింగ్‌లోకి ‘మున్నా’.. 13 ఏళ్లైంది కదా! | Prabhas Munna Telugu Movie Completes 13 Years | Sakshi
Sakshi News home page

మళ్లీ ట్రెండింగ్‌లోకి ‘మున్నా’.. 13 ఏళ్లైంది కదా!

Published Sat, May 2 2020 3:15 PM | Last Updated on Sat, May 2 2020 4:04 PM

Prabhas Munna Telugu Movie Completes 13 Years - Sakshi

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, గోవా బ్యూటీ ఇలియానా జంటగా వచ్చిన చిత్రం ‘మున్నా’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజ్‌ నిర్మించారు. హారిస్‌ జయరాజ్‌ అందించిన పాటలు సూపర్‌డూపర్‌ హిట్‌ సాధించడం, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లలో ప్రభాస్‌ లుక్‌ కొత్తగా డిఫరెంట్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. అయితే అభిమానుల అంచనాలను ‘మున్నా’ అందుకోలేకపోయాడు. ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్‌ స్టైలీష్‌ లుక్‌ను, ఇలియానా అందచందాలను ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్‌ చేశారు. ఈ చిత్రం విడుదలై నేటికి పదమూడేళ్లయింది. అప్పటితో పోలిస్తే ప్రభాస్‌ క్రేజ్‌ వెయ్యింతలు అయింది. దీంతో మరోసారి ఆ సినిమా ముచ్చట్లు సోషల్‌మీడియాలో మారుమోగిపోతున్నాయి. దీంతో ప్రస్తుతం ట్విటర్‌లో ‘#13yearsformunna’ హ్యాష్‌ ట్యాగ్‌ తెగ ట్రెండ్‌ అవుతోంది. 




చదవండి:
‘ప్రభాస్‌-అమీర్‌లతో మల్టీస్టారర్‌ చిత్రం చేయాలి’
ట్రెండింగ్‌ టిక్‌టాక్‌లో శృతిహాసన్‌, అక్షర‌ హాసన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement