అగ్రహీరోతో కలిసి ఉంటే కలదు సుఖం... | making movie with top hero is good : dil raju | Sakshi
Sakshi News home page

అగ్రహీరోతో కలిసి ఉంటే కలదు సుఖం...

Published Wed, Dec 11 2013 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM

అగ్రహీరోతో కలిసి ఉంటే కలదు సుఖం...

అగ్రహీరోతో కలిసి ఉంటే కలదు సుఖం...

ఒకప్పుడు ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ సినిమా ‘కలిసి ఉంటే కలదు సుఖం’. చాలా మంచి కథ. దానికి మించి మంచి టైటిల్. ఇప్పుడా టైటిల్‌తో ఓ సినిమా రూపొందనుంది. 2014లో ఆ టైటిల్‌తో ‘దిల్’ రాజు ఓ భారీ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకు ముందు ఈ సంస్థలో సిద్దార్థ్ హీరోగా ‘ఓ మై ఫ్రెండ్’ చేసిన వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. రెండేళ్లు శ్రమించి వేణు శ్రీరామ్ ఈ కథను తయారు చేసుకున్నారు. ఓ అగ్రహీరోతో ఈ చిత్రం ఉండనుందని సమాచారం. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement