నాని సినిమాలో సీనియర్ హీరోయిన్ | Senior Heroine Bhumika in Nani MCA | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 8 2017 3:28 PM | Last Updated on Fri, Dec 8 2017 4:30 PM

Senior Heroine Bhumika in Nani MCA - Sakshi

వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న యువ కథానాయకుడు నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఎమ్ సీ ఏ'. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. చాలా రోజుల కిందటే సీనియర్ హీరోయిన్ భూమిక రీ ఎంట్రీపై టాలీవుడ్ లో వార్తలు వినిపించాయి. అయితే నాని సినిమాతో భూమిక మరోసారి టాలీవుడ్ లో అధృష్టాన్ని పరీక్షించుకోనుందట.

ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న భూమిక, పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటోంది. పూర్తిగా నటించటం మానేయకపోయినా.. చాలా తక్కువగా సినిమాల్లో నటిస్తోంది. ఖుషి, ఒక్కడు లాంటి కమర్షియల్ సినిమాలతో పాటు మిస్సమ్మ, అనసూయ లాంటి లేడి ఓరియంటెడ్ చిత్రాల్లోనూ అలరించింది భూమిక. చివరగా టాలీవుడ్లో లడ్డుబాబు సినిమాలో నటించిన ఈ భామ త్వరలో మరో తెలుగు సినిమా చేసేందుకు అంగీకరించింది. నాచ్యురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సినిమాలో భూమిక కీలక పాత్రలో కనిపించనుందట. అయితే ఈ సినిమాలో భూమికది వదిన క్యారెక్టర్ అన్న టాక్ వినిపిస్తోంది. హీరోయిన్గా గ్లామర్ రోల్స్తో పాటు, లేడి ఓరియంటెండ్ సినిమాల్లోనూ అలరించిన భూమిక, ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ఆకట్టుకుంటుందోమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement