
సాక్షి, హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్‌న్యూస్. పవర్‌స్టార్ మళ్లీ తెరపై సందడి చేయనున్నారు. సరికొత్త కాంబినేషన్‌లో పవన్ కొత్త సినిమా తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది. హిందీలో హిట్ అయిన పింక్ సినిమా రీమేక్‌లో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. నాని హీరోగా ‘ఎంసీఏ’ సినిమా తీసిన వేణు శ్రీరామ్‌కు దర్శకత్వం బాధ్యతలు అప్పగించినట్టు ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
అమితాబ్ బచ్చన్, తాప్పీ పొన్ను ప్రధాన పాత్రల్లో నటించిన ‘పింక్’ సినిమా 2016లో హిందీలో మంచి విజయాన్ని అందుకుంది. 23 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు రూ. 85 కోట్లు వసూలు చేసింది. సామాజిక సందేశంతో క్రైమ్ డ్రామా జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాను తమిళంలో ‘నేర్కొండ పార్వై’ పేరుతో రీమేక్ చేశారు. స్టార్ హీరో అజిత్ ప్రధానపాత్ర పోషించిన ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించారు. తమిళంలోనూ విజయం సాధించడంతో తెలుగులోనూ రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ‘పింక్’ రీమేక్‌లో పవన్ నటిస్తున్నాడని తెలియడంతో సోషల్ మీడియాలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment