అది బోనస్‌ మాత్రమే! | Taapsee Pannu is Kritika Agarwal in Mission Mangal | Sakshi
Sakshi News home page

అది బోనస్‌ మాత్రమే!

Nov 29 2018 3:09 AM | Updated on Nov 29 2018 3:09 AM

Taapsee Pannu is Kritika Agarwal in Mission Mangal - Sakshi

తాప్సీ

చేతి నిండా అవకాశాలతో తాప్సీ డైరీ ఫుల్‌గా ఉంది. నార్త్‌లో మంచి జోరు మీదున్న తాప్సీ సౌత్‌లోనూ అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్, తాప్సీ కలిసి నటించిన ‘పింక్‌’ సినిమా సూపర్‌హిట్‌ కావడం వల్లే బీ టౌన్‌లో తాప్సీ క్రేజ్‌ పెరిగిందని కొందరి మాట. ఈ విషయం గురించి ఆమెను అడిగితే..‘‘ప్రస్తుతం హిందీలో నాకు అవకాశాలు పెరిగాయి. కానీ ‘పింక్‌’ సినిమా సక్సెస్‌ నా లైఫ్‌లో పెద్దగా మార్పు తీసుకురాలేదు. నా కెరీర్‌ తొలినాళ్లో నేను నటించిన ‘ఆడుకాలమ్‌’ సినిమా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.

అంతకన్నా ఇంకేం కావాలి. బాలీవుడ్‌కి రావడానికి ముందు నా కెరీర్‌లో బాక్సాఫీస్‌ సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను చూశాను. ‘పింక్‌’ సినిమా సక్సెస్‌ ఒక బోనస్‌ మాత్రమే. గెలుపోటములను నేను అంత సీరియస్‌గా తీసుకోను. అలా జరిగిపోతుంటాయంతే. కానీ, నన్ను నేను సీరియస్‌గా తీసుకుంటాను’’ అని పేర్కొన్నారామె. ప్రస్తుతం ‘మిషన్‌ మంగళ్‌’ అనే హిందీ చిత్రంతోపాటు, సౌత్‌లో ‘గేమ్‌ ఓవర్‌’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు తాప్సీ. ‘పింక్‌’ సినిమా తర్వాత అమితాబ్, తాప్సీ కలిసి నటించిన ‘బద్లా’ సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement