తమిళసినిమా: డిమాండ్ అండ్ సప్లై అనేది ఎక్కడైనా అప్లై అవుతుంది. ఇక చిత్ర పరిశ్రమ గురించి చెప్పాలా.. మొదట్లో ఒక్కచాన్స్ ప్లీజ్ అంటూ ప్రాధేయపడడం, ఆ ఒక్క అవకాశం వచ్చినా తరువాత విజయం కోసం ఆరాటపడడం, అదృష్టం కలిసొచ్చి ఆమెకు ఒక హిట్ వచ్చేస్తే, ఆ తరువాత పారితోషికం పెంచేయడం ఇలా చైన్‌లా జరిగిపోతాయి. ఇది ఇక్కడ ఏ ఒక్కరి గురించి కాదు. అంతా ఇంతే. ఇందుకు అనుపమ పరమేశ్వరన్ అతీతం కాదు. ఆమె కూడా అంతే. ఇప్పటివరకు ఈమె కెరియర్లో ఓ మోస్తరు విజయాలనే చూసింది. మధ్యలో అవకాశాలు కూడా వెన్ను చూపాయి. అలాంటిది తెలుగులో నిఖిల్ సరసన నటించిన కార్తికేయ–2 చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది.
ఇక రీసెంట్‌గా అదే హీరోతో జతకట్టిన 18 పేజెస్ చిత్రం కూడా హిట్ టాక్‌ను కొట్టేసింది. ఇంతకంటే ఏం కావాలి మంచి తరుణం మించి పోకూడదనుకుందేమో. తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిందని సినీ వర్గాల టాక్. ఎంత అంటే ఇప్పటివరకు రూ.60 లక్షలు పుచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు దానికి రెట్టింపు అంటే రూ.1.20 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయినా అనుపమ కావాలంటున్నారు నిర్మాతలు. ఇది వారికి కిక్కు అనుపమకు లక్కు అని చెప్పక తప్పదు. అయితే ఈ అమ్మడికి తమిళంలో మాత్రం ఇంకా అలాంటి లక్కు రాలేదనే చెప్పాలి.
మొదట్లో ఎక్కువగా ధనుష్ సరసన నటింన కోడి చిత్రం పరవాలేదు అనిపించిన ఆ క్రెడిట్‌ను నటుడు ధనుష్, నటి త్రిష కొట్టుకు పోయారు. ఈమధ్య నటుడు అధర్వతో రొవన్స్ చేసిన తల్లి పోగాదే చిత్రం తెరపైకి వచ్చి పోయింది. అంతే దీంతో ప్రస్తుతం జయంరవి సరసన రెండవ హీరోయిన్‌గా నటిస్తున్న సైరన్ చిత్రంపైనే అనుపమ పరమేశ్వరన్ ఆశలు పెట్టుకుంది. మరి తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమెకు లక్కు వర్కౌట్ అవుతుందా లేదా వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment