తాప్సీకి ఎవరూ ప్రపోజ్ చేయలేదా? | nobody dared to propose me, says tapsi pannu | Sakshi
Sakshi News home page

తాప్సీకి ఎవరూ ప్రపోజ్ చేయలేదా?

Published Tue, Sep 23 2014 1:52 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

తాప్సీకి ఎవరూ ప్రపోజ్ చేయలేదా? - Sakshi

తాప్సీకి ఎవరూ ప్రపోజ్ చేయలేదా?

తాను ముందునుంచి అబ్బాయిలాగే పెరిగానని, కాలేజిలో కూడా టామ్ బాయ్లా ఉండేదాన్నని హీరోయిన్ తాప్సీ చెబుతోంది. తన దగ్గరకు వచ్చి మాట్లాడాలంటేనే అబ్బాయిలు భయపడేవారని తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఐ లవ్యూ అని చెబితే వాళ్లను చితక్కొట్టేస్తానని భయపడ్డారేమో గానీ.. ఏ ఒక్కరూ తనకు ప్రపోజ్ చేయనేలేదని చెప్పింది. ప్రస్తుతం తెలుగులో 'ముని-3', తమిళంలో 'వెయ్ రాజా వెయ్', హిందీలో 'రన్నింగ్ షాదీ డాట్ కామ్', 'బేబీ' లాంటి సినిమాల్లో ఆమె నటిస్తోంది.

చదువుకునే రోజుల్లో తాను ఇంత అందంగా లేనో, లేక భయపడ్డారో గానీ ఎవరూ తనకు ప్రపోజ్ చేయలేదని ఓ కార్యక్రమంలో ఆమె చెప్పింది. ప్రేమికుల రోజున అందరూ జంటలు జంటలుగా వెళ్తుంటే తనకు చాలా డల్గా అనిపించేదని, ఎవరూ గిఫ్టులు ఇవ్వనందుకే ఆ ఆ బాధ అని తెలిపింది. తీరా ఇప్పుడు చూస్తే.. సెలబ్రిటీనని ఎవరూ తనకు ప్రపోజ్ చేసేందుకు ధైర్యం చేయట్లేదంది. అయినా.. ఒంటరి జీవితం చాలా ఆనందంగా ఉందని, తన స్వేచ్ఛ తనకు ఉందని చెప్పుకొచ్చింది.

లెక్కలు చేయడమంటే భలే ఇష్టమంటున్న తాప్సీ.. కష్టమైన సమస్యలను సులభంగా చేయగలిగినప్పుడు కలిగే ఆనందం ముందు ఇవన్నీ ఎందుకూ పనికిరావని తెలిపింది. అయితే.. లెక్కలంటే ఎంత ఇష్టం ఉన్నా, 10-5 ఉద్యోగం చేయడం అంటే ఇష్టంలేకనే ఆ రంగం వైపు వెళ్లలేదని తాప్సీ వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement