రెండో వన్డేలోనూ టీమిండియా మహిళా జట్టు ఓటమి | New Zeland Women Beats India By 3 Wickets 2nd ODI | Sakshi
Sakshi News home page

INDW vs NZW: రెండో వన్డేలోనూ టీమిండియా వుమెన్‌ టీమ్‌ ఓటమి

Published Tue, Feb 15 2022 12:36 PM | Last Updated on Tue, Feb 15 2022 2:25 PM

New Zeland Women Beats India By 3 Wickets 2nd ODI - Sakshi

న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా వుమెన్స్‌ జట్టు రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. న్యూజిలాండ్‌ బ్యాటర్‌ అమిలియా కెర్‌ అద్భుత సెంచరీతో భారత మహిళల జట్టుకు ఓటమి తప్పలేదు. కాగా ఐదు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా వుమెన్స్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. కెప్టెన్‌ మిథాలీరాజ్‌(81 బంతుల్లో 66 నాటౌట్‌, 3 ఫోర్లు), రిచా ఘోష్‌(64 బంతుల్లో 65, 6 ఫోర్లు, ఒక సిక్స్‌)తో రాణించారు. ఓపెనర్‌ సబ్బినేని మేఘన 49 పరుగులతో ఆకట్టుకుంది. న్యూజిలాండ్‌ బౌలర్లలో డివైన్‌ 2 వికెట్లు తీయగా.. అమిలా కెర్‌, ఫ్రాన్‌ జోనస్‌, రోస్‌మేరీ మెయిర్‌, జెస్‌ కెర్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. 

అనంతరం బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ వుమెన్స్‌ 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. అమిలియా కెర్‌(135 బంతుల్లో 119 నాటౌట్‌, 7 ఫోర్లు) అద్బుత సెంచరీతో కడదాకా నిలిచి జట్టుకు విజయాన్ని అందించింది. మిగతావారిలో మ్యాడీ గ్రీన్‌(61 బంతుల్లో 52,5 ఫోర్లు), సోఫి డివైన్‌ 33 పరుగులతో రాణించారు. టీమిండియా వుమెన్స్‌ బౌలర్లలో దీప్తి శర్మ 4, పూనమ్‌ యాదవ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, రాజేశ్వరి గైక్వాడ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement