మెకాయ్: ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సి స్థితిలో మిథాలీ రాజ్ సారథ్యంలోని టీమిండియా నేడు జరిగే రెండో వన్డే (డే–నైట్)లో బరిలోకి దిగనుంది. చేతి బొటన వేలి గాయంతో రెండో వన్డేకు కూడా వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దూరమైంది. కొంతకాలంగా టీమ్ బ్యాటింగ్ భారాన్ని కెప్టెన్ మిథాలీ రాజ్ మాత్రమే మోస్తోంది. ఇకనైనా ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన తమ పేలవ ఫామ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి పరుగులు సాధించాల్సి ఉంది.
ఇక బౌలింగ్‌లో మరోసారి జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్‌లు కీలకం కానున్నారు. 2018 నుంచి వన్డేల్లో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాను ఓడించాలంటే భారత్ అంచనాలకు మించి ఆడాల్సి ఉంది. కాగా తొలి వన్డేలో ఆసీస్ 9 వికెట్ల తేడాతో మిథాలీ సేనపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
చదవండి: T20 World Cup 2021: అలా జరిగితే అఫ్గాన్ జట్టును బహిష్కరిస్తాం.. ఐసీసీ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment