
భారీ స్కోరు చేసినా భారత్‌కు తప్పని ఓటమి
NZ W Vs Ind W 3rd ODI: - క్వీన్స్‌టౌన్: మళ్లీ భారీ స్కోరు చేసినా... భారత మహిళల జట్టు న్యూజిలాండ్ చేతిలో వరుసగా మూడో వన్డేలోనూ ఓటమి చవిచూసి మరో రెండు వన్డేలుండగానే సిరీస్‌ను 0–3తో కోల్పోయింది. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో మొదట మిథాలీ రాజ్ బృందం 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (41 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), షఫాలీ వర్మ (57 బంతుల్లో 51; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 100 పరుగులు జోడించారు.
మిడిలార్డర్‌లో దీప్తి శర్మ (69 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధసెంచరీ సాధించింది. 280 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 49.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. మహిళల వన్డే క్రికెట్‌లో ఇది రెండో అత్యుత్తమ ఛేజింగ్. అమెలియా కెర్ (67; 8 ఫోర్లు), అమి సాటెర్త్‌వైట్ (59; 6 ఫోర్లు), లారెన్ డౌన్ (52 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేటీ మారి్టన్ (37 బంతుల్లో 35) మెరిపించి కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. జులన్ గోస్వామికి మూడు వికెట్లు దక్కాయి.
చదవండి: Ind Vs Wi 2nd T20: ఆఖరి 2 బంతుల్లోనూ సిక్స్‌లు కొట్టాలి.. హర్షల్ ఆ అవకాశం ఇవ్వలేదుగా.. మనదే సిరీస్