Ind Vs NZ: తొలి వన్డేలో నిరాశే... ప్చ్‌... మన మేఘన కూడా... | Ind W Vs NZ W 1st ODI: New Zealand Beat India By 62 Runs | Sakshi
Sakshi News home page

Ind W Vs NZ W 1st ODI: తొలి వన్డేలో నిరాశే... ప్చ్‌... మన మేఘన కూడా...

Published Sun, Feb 13 2022 7:41 AM | Last Updated on Sun, Feb 13 2022 7:49 AM

Ind W Vs NZ W 1st ODI: New Zealand Beat India By 62 Runs - Sakshi

Ind W Vs NZ W 1st ODI - క్వీన్స్‌టౌన్‌: వన్డే సిరీస్‌నూ భారత మహిళల జట్టు పరాజయంతోనే ప్రారంభించింది. తొలి వన్డేలో భారత్‌ 62 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ చేతిలో ఓడింది. కెపె్టన్‌ మిథాలీ రాజ్‌ (73 బంతుల్లో 59; 6 ఫోర్లు) రాణించినా పరాజయం తప్పలేదు. శనివారం జరిగిన ఈ పోరులో మొదట న్యూజిలాండ్‌  48.1 ఓవర్లలో 275 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ సుజీ బేట్స్‌ (111 బంతుల్లో 106; 10 ఫోర్లు) శతక్కొట్టింది.

భారత బౌలర్లలో జులన్‌ గోస్వామి, పూజా వ్రస్తాకర్, రాజేశ్వరి, దీప్తి శర్మ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్‌ 49.4 ఓవర్లలో 213 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి అంతర్జాతీయ వన్డే ఆడుతున్న ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి సబ్బినేని మేఘన (4) నిరాశపరిచింది. యస్తిక (41; 4 ఫోర్లు), మిథాలీ మూడో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. వీళ్లిద్దరు ఔటయ్యాక మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోవడంతో భారత్‌ లక్ష్యానికి దూరమైంది.  

చదవండి: IPL Mega Auction 2022: రూ.15.25 కోట్లు.. ఇషాన్‌ కిషన్‌ సరికొత్త రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement