Ind W vs NZ W: ప్రపంచ కప్‌ సన్నాహకాలు.. కివీస్‌తో ఐదు వన్డేలు | India Women Tour Of New Zealand 2022 ODI Series Schedule Details | Sakshi
Sakshi News home page

Ind W vs NZ W: ప్రపంచ కప్‌ సన్నాహకాలు.. కివీస్‌తో ఐదు వన్డేలు

Published Fri, Feb 11 2022 11:21 AM | Last Updated on Fri, Feb 11 2022 11:32 AM

India Women Tour Of New Zealand 2022 ODI Series Schedule Details - Sakshi

Ind W vs NZ W ODI Series: మిథాలీరాజ్‌ సారథ్యంలోని భారత మహిళల క్రికెట్‌ జట్టు ప్రపంచ కప్‌ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్‌ మహిళలతో ఐదు వన్డేల సిరీస్‌లో తలపడుతోంది. క్వీన్స్‌టౌన్‌లో ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ ‘అమెజాన్‌ ప్రైమ్‌’లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. బుధవారం జరిగిన ఏకైక టి20లో కివీస్‌ 18 పరుగులతో భారత్‌ను ఓడించింది.    

న్యూజిలాండ్‌తో తలపడనున్న భారత మహిళా జట్టు- షెడ్యూల్‌:
మ్యాచ్‌లన్నీ క్వీన్‌టౌన్స్‌లోని జాన్‌ డెవిస్‌ ఓవల్‌ మైదానంలో జరుగనున్నాయి.
►మొదటి వన్డే: ఫిబ్రవరి 12- శనివారం
►రెండో వన్డే: ఫిబ్రవరి 15- మంగళవారం
►మూడో వన్డే: ఫిబ్రవరి 18- శుక్రవారం
►నాలుగో వన్డే: ఫిబ్రవరి 22- మంగళవారం
►ఐదో వన్డే: ఫిబ్రవరి 24- గురువారం

చదవండి: IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 మెగా వేలం.. పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement