day night matches
-
పోటీలో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే!
మెకాయ్: ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సి స్థితిలో మిథాలీ రాజ్ సారథ్యంలోని టీమిండియా నేడు జరిగే రెండో వన్డే (డే–నైట్)లో బరిలోకి దిగనుంది. చేతి బొటన వేలి గాయంతో రెండో వన్డేకు కూడా వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దూరమైంది. కొంతకాలంగా టీమ్ బ్యాటింగ్ భారాన్ని కెప్టెన్ మిథాలీ రాజ్ మాత్రమే మోస్తోంది. ఇకనైనా ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన తమ పేలవ ఫామ్‌కు ఫుల్స్టాప్ పెట్టి పరుగులు సాధించాల్సి ఉంది. ఇక బౌలింగ్‌లో మరోసారి జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్‌లు కీలకం కానున్నారు. 2018 నుంచి వన్డేల్లో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాను ఓడించాలంటే భారత్ అంచనాలకు మించి ఆడాల్సి ఉంది. కాగా తొలి వన్డేలో ఆసీస్ 9 వికెట్ల తేడాతో మిథాలీ సేనపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: T20 World Cup 2021: అలా జరిగితే అఫ్గాన్ జట్టును బహిష్కరిస్తాం.. ఐసీసీ వార్నింగ్ -
18 ఏళ్ల క్రితమే భారత్‌లో డేనైట్ మ్యాచ్
న్యూఢిల్లీ: ప్రస్తుతం టెస్టు క్రికెట్లో డే నైట్ మ్యాచ్‌లు ఓ హాట్ టాపిక్. ఆటతో కాస్త పరిచయం ఉన్న వాళ్లలో ఎవర్ని కదిలించినా దీని గురించి కాస్త వింతగానో, ఆశ్చర్యంగానో మాట్లాడుకుంటున్నారు. అయితే 138 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి డే నైట్ టెస్టుకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ (27న)తో రంగం సిద్ధమైతే... 18 ఏళ్ల కిందటే భారత్‌లో డే నైట్ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ జరిగిందని చాలా మందికి తెలియకపోవచ్చు. 1997 ఏప్రిల్‌లో ముంబై, ఢిల్లీ మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్‌ను డే నైట్‌గా నిర్వహించారు. గ్వాలియర్‌లోని రూప్సింగ్ స్టేడియం ఇందుకు వేదికైంది. అయితే ఆ మ్యాచ్‌లో తెల్లబంతిని వాడారు. కానీ ఆసీస్, కివీస్ టెస్టుకు పింక్ బంతిని ఉపయోగిస్తుండటం ఒక్కటే తేడా. మామూలుగా టెస్టు మ్యాచ్‌లో లంచ్‌తో తొలి విరామం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది రివర్స్ అయ్యింది. లంచ్ తర్వాత ఆట మొదలై టీకి 20 నిమిషాల పాటు తొలి బ్రేక్ ఇస్తారు. స్థానిక కాలమానం ప్రకారం ఇది 4 గంటలకు ఉంటుంది. డిన్నర్ బ్రేక్‌గా పిలవబడే ‘సూపర్ బ్రేక్’ గం.6.20 మొదలై 40 నిమిషాల పాటు ఉంటుంది. ఇక 7 గంటలకు మొదలయ్యే చివరి సెషన్ పూర్తిగా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో 9 గంటల వరకు కొనసాగుతుంది. -
గులాబీ రంగు బంతులతో ప్రయోగం
డే-నైట్ టెస్టుల దిశగా ఆసీస్ అడుగులు మెల్బోర్న్: టెస్టు మ్యాచ్‌ల్ని డే-నైట్ మ్యాచ్‌లుగా నిర్వహించాలనే ఆలోచనను అమలుపరిచే దిశగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం తమ దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌ల్లో గులాబీ రంగు బంతుల్ని ఉపయోగించాలని నిర్ణయించింది. ప్లడ్‌లైట్ల వెలుతురులో జరగనున్న ఈ ప్రయోగాత్మక మ్యాచ్‌లు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీలో గులాబీ బంతుల ప్రయోగం విజయవంతమైతే 2015-16లో న్యూజిలాండ్‌తో సిరీస్‌ను డే-నైట్ సిరీస్‌గా నిర్వహించే అవకాశం ఉంటుందని ఆసీస్ భావిస్తోంది. అదే జరిగితే రానున్న కాలంలో అన్ని బోర్డులు డే-నైట్ టెస్టుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.