గులాబీ రంగు బంతులతో ప్రయోగం
డే-నైట్ టెస్టుల దిశగా ఆసీస్ అడుగులు
మెల్‌బోర్న్: టెస్టు మ్యాచ్‌ల్ని డే-నైట్ మ్యాచ్‌లుగా నిర్వహించాలనే ఆలోచనను అమలుపరిచే దిశగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం తమ దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌ల్లో గులాబీ రంగు బంతుల్ని ఉపయోగించాలని నిర్ణయించింది.
ప్లడ్‌లైట్ల వెలుతురులో జరగనున్న ఈ ప్రయోగాత్మక మ్యాచ్‌లు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీలో గులాబీ బంతుల ప్రయోగం విజయవంతమైతే 2015-16లో న్యూజిలాండ్‌తో సిరీస్‌ను డే-నైట్ సిరీస్‌గా నిర్వహించే అవకాశం ఉంటుందని ఆసీస్ భావిస్తోంది. అదే జరిగితే రానున్న కాలంలో అన్ని బోర్డులు డే-నైట్ టెస్టుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.