టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి అరుదైన గౌరవం లభించింది. ఆయనను ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. గ్రామీణ స్థాయి పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ సంస్థ పనిచేస్తోంది. వారిలోని ప్రతిభను ప్రోత్సహించేందుకు మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. టాలీవుడ్ సినిమాను ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా.. ఆస్కార్ ఘనత పొందిన రాజమౌళికి ఈ అవకాశం రావడం పట్ల సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.
(ఇది చదవండి: డిప్రెషన్ బారిన పడ్డా.. ఆ విషయం బయటపెట్టిన కాజల్!)
ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్(ISBC)
గ్రామీణ ప్రాంతాల్లో వసతుల్లేక చాలామంది ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు పొందలేకపోతున్నారు. అలాంటి వారికోసమే దిలీప్ వెంగ్ సర్కార్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గ్రామీణ యువతలోని ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సాహం అందిస్తున్నారు. ఛైర్మన్ పదవితో రాజమౌళికి మరింత బాధ్యతను పెంచింది.
మహేశ్ బాబుతో సినిమా
కాగా.. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రస్తుతం రాజమౌళి.. ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఎస్ఎస్‌ఎంబీ29 పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డ్ తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే దర్శకధీరుడు ఇప్పటికే ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.
(ఇది చదవండి: సంక్రాంతి రేసులోకి 'హనుమాన్'.. వర్కౌట్ అవుతుందా?)
Maverick Director @SSRajamouli is honored with another remarkable post as he is appointed as the Hon. Chairman of the Indian Schools Board for Cricket. 🏏#SSRajamouli #ISBC #SSMB29 #TeluguFilmNagar pic.twitter.com/STiunIzeEp
— Telugu FilmNagar (@telugufilmnagar) July 1, 2023
Comments
Please login to add a commentAdd a comment