cricket board
-
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. ఇకపై
West Indies Commit To...: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. లింగ వివక్షకు తావు లేకుండా పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు కూడా ఫీజులు చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు క్రికెట్ వెస్టిండీస్(సీడబ్ల్యూఐ), వెస్టిండీస్ ప్లేయర్స్ అసోసియేషన్(డబ్ల్యూఐపీఏ) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఎంఓయూ అక్టోబరు 1, 2023 నుంచి సెప్టెంబరు 30, 2027 వరకు అమల్లో ఉంటుందని విండీస్ బోర్డు తెలిపింది. ఎంఓయూ ముఖ్య ఉద్దేశం అదే ‘‘అంతర్జాతీయ, ప్రాంతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్ ఫీజులలో వ్యత్యాసం లేకుండా చూడటమే ఈ ఎంఓయూ ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ జట్టు కెప్టెన్ల అలవెన్సులు, అంతర్జాతీయ జట్టు ప్రైజ్‌మనీ, ప్రాంతీయ స్థాయిలో వ్యక్తిగతంగా చెల్లించే ప్రైజ్‌మనీ అందరు వెస్టిండీస్ క్రికెటర్లకు సమాన స్థాయిలో అక్టోబరు 1, 2027 నాటికి అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’’ అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ ప్రకటనలో తెలిపింది. బీసీసీఐ సైతం.. కాగా ఇప్పటికే న్యూజిలాండ్, భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ తదితర దేశాల క్రికెట్ బోర్డులు లింగ వివక్షకు తావులేకుండా మ్యాచ్ ఫీజులు చెల్లించేందుకు సిద్ధపడిన విషయం తెలిసిందే. తాజాగా వెస్టిండీస్ కూడా అదే బాటలో నడవడానికి సమాయత్తమైంది. ఐసీసీ హర్షం ఈ విషయంపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి హర్షం వ్యక్తం చేసింది. గతేడాది తాము ఐసీసీ టోర్నమెంట్లలో పురుష, మహిళా జట్లకు సమాన స్థాయిలో ప్రైజ్ మనీ అందజేస్తామని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. చదవండి: AUS Vs WI 2nd Test: వారెవ్వా.. క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్! వీడియో వైరల్ -
దర్శకధీరుడికి అరుదైన గౌరవం.. ఇక నుంచి వారి కోసం!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి అరుదైన గౌరవం లభించింది. ఆయనను ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. గ్రామీణ స్థాయి పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ సంస్థ పనిచేస్తోంది. వారిలోని ప్రతిభను ప్రోత్సహించేందుకు మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. టాలీవుడ్ సినిమాను ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా.. ఆస్కార్ ఘనత పొందిన రాజమౌళికి ఈ అవకాశం రావడం పట్ల సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. (ఇది చదవండి: డిప్రెషన్ బారిన పడ్డా.. ఆ విషయం బయటపెట్టిన కాజల్!) ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్(ISBC) గ్రామీణ ప్రాంతాల్లో వసతుల్లేక చాలామంది ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు పొందలేకపోతున్నారు. అలాంటి వారికోసమే దిలీప్ వెంగ్ సర్కార్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గ్రామీణ యువతలోని ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సాహం అందిస్తున్నారు. ఛైర్మన్ పదవితో రాజమౌళికి మరింత బాధ్యతను పెంచింది. మహేశ్ బాబుతో సినిమా కాగా.. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రస్తుతం రాజమౌళి.. ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ29 పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డ్ తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే దర్శకధీరుడు ఇప్పటికే ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: సంక్రాంతి రేసులోకి 'హనుమాన్'.. వర్కౌట్ అవుతుందా?) Maverick Director @SSRajamouli is honored with another remarkable post as he is appointed as the Hon. Chairman of the Indian Schools Board for Cricket. 🏏#SSRajamouli #ISBC #SSMB29 #TeluguFilmNagar pic.twitter.com/STiunIzeEp — Telugu FilmNagar (@telugufilmnagar) July 1, 2023 -
క్రికెట్లో అలజడి.. స్కాట్లాండ్ బోర్డు మూకుమ్మడి రాజీనామా
ఐసీసీ(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్)లో అసోసియేట్ దేశంగా ఉన్న స్కాట్లాండ్ క్రికెట్లో ఆదివారం అలజడి రేగింది. స్కాట్లాండ్ క్రికెట్ బోర్డుకు ఒకేసారి ఆరుగురు మూకుమ్మడి రాజీనామా సమర్పించారు. క్రికెటర్లపై జాత్యంహకార వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు రావడంతో బోర్డు సభ్యులు క్రికెట్ స్కాట్లాండ్ బోర్డుకు ఆదివారం రాజీనామా సమర్పించారు. విషయంలోకి వెళితే.. ఇటీవలే స్కాట్లాండ్ లీడింగ్ ఆల్‌టైమ్ లీడింగ్ క్రికెటర్ మజిద్ హక్ స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్కాట్లాండ్ బోర్డు తమపై చూపిన వివక్ష గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు 'సంస్థాగతంగా జాత్యహంకారంగా' ముద్రపడిందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. మజిద్‌తో పాటు తాను కూడా జాత్యహంకారానికి గురయ్యానని మరో క్రికెటర్ ఖాసిం షేక్ కూడా ఇంటర్య్వూలొ పేర్కొన్నాడు. మా శరీరం రంగు వేరు కావడంతో జట్టు మొత్తంలో మమ్మల్ని వేరుగా చూసేవారని తెలిపాడు. క్రికెటర్లు చేసిన సంచలన ఆరోపణలపై స్కాట్లాండ్ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. వారి నివేదికలో ఆటగాళ్లు చేసిన ఆరోపణలు నిజమేనని తేలింది. కాగా కమిటీ అందించిన నివేదిక పూర్తి సారాంశాన్ని సోమవారం బహిర్గతం చేయనుంది. అయితే ఈలోగాతాము చేసిన తప్పుకు చింతిస్తున్నామని.. బోర్డులో ఉన్న సభ్యులందరం రాజీనామా చేస్తున్నట్లు బోర్డుకు సంబంధించిన ఒక అధికారి తెలిపారు. ఈ మేరకు బోర్డు డైరెక్టర్లు ఆదివారం ఉదయం తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారికి రాజీనామా లేఖను పంపారు. "బోర్డు ఆఫ్ క్రికెట్ స్కాట్లాండ్ రాజీనామా చేసింది. మేము తక్షణమే అమలులోకి వచ్చేలా చూస్తాం. ఇకపై @sportscotland భాగస్వామ్యంతో పని చేస్తాము. రాబోయే రోజుల్లో క్రీడకు తగిన పాలన, నాయకత్వం, మద్దతు ఉండేలా చూస్తాము. స్కాట్లాండ్ క్రికెట్ చిన్నదే కావొచ్చు.కానీ జాత్యంహంకార వ్యాఖ్యలకు పాల్పడితే మా దగ్గర కఠిన శిక్షలు ఉంటాయి. తమ తప్పు తెలుసుకొని బోర్డు సభ్యులు ముందే రాజీనామా చేశారు. ఇది అందరికి ఒక గుణపాఠం. ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం.'' అని క్రికెట్ స్కాట్లాండ్ ఆదివారం ట్వీట్ చేసింది. NEWS UPDATE | The Board of Cricket Scotland has resigned. We will work in partnership with @sportscotland with immediate effect to ensure appropriate governance, leadership & support is in place for sport in the days ahead. Find out more ➡️ https://t.co/S6AF7EyE4A pic.twitter.com/qa2Y0ybcNP — Cricket Scotland (@CricketScotland) July 24, 2022 చదవండి: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఇకపై విదేశీ లీగ్‌లలో భారత క్రికెటర్లు..? -
తాలిబన్ల రాజ్యంలో తొలి నియామకం.. అఫ్గాన్ క్రికెట్ చీఫ్‌గా ఫజ్లీ
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత తాలిబన్లు మొట్టమొదటి అధికారిక నియామకాన్ని చేపట్టారు. అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) చైర్మన్‌గా అజీజుల్లా ఫజ్లీకి పట్టం కట్టారు. కొద్ది రోజుల కిందట అఫ్గాన్ క్రికెట్ బోర్డు అధికారులతో సమావేశమైన తాలిబన్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అఫ్గాన్‌లో తాలిబన్ల రాజ్యం ఏర్పడ్డాక చోటు చేసుకున్న అతిపెద్ద నియామకం ఇదే కావడం విశేషం. ఫజ్లీ 2018-19లో ఏసీబీ చీఫ్‌గా వ్యవహరించాడు. అయితే 2019 వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్ దారుణ ప్రదర్శన(చివరి స్థానంలో నిలవడంతో) కారణంగా అతడు పదవి నుంచి వైదొలిగాడు. ఫజ్లీ హాయంలో అఫ్గాన్ క్రికెట్ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుందని తాలిబన్లు ఆశాభావం వ్యక్తం చేశారు. Former ACB Chairman @AzizullahFazli has been re-appointed as ACB's acting Chairman. He will oversee ACB's leadership and course of action for the upcoming competitions. pic.twitter.com/IRqekHq7Jt— Afghanistan Cricket Board (@ACBofficials) August 22, 2021 ఇదిలా ఉంటే, అఫ్గానిస్తాన్ జట్టు వచ్చేనెలలో పాక్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడాల్సి ఉండింది. అయితే కారణాలు ప్రకటించకుండా ఈ సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించింది. ఓవైపు క్రికెట్‌కు మద్దతిస్తామని.. క్రికెటర్లు భయపడాల్సిన అవసరం లేదని.. స్వేచ్చగా క్రికెట్ ఆడుకోవచ్చని ప్రకటించిన తాలిబన్లు.. ఒక్కరోజు వ్యవధిలోనే కారణాలు వెల్లడించకుండా సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వాస్తవంగా ఈ సిరీస్ శ్రీలంకలో జరగాల్సి ఉండింది. అయితే, కాబూల్ నుంచి వాణిజ్య విమానాల రాకపోకలను రద్దు చేయడం, కరోనా కేసులు బాగా పెరగడంతో శ్రీలంకలో 10 రోజుల లాక్డౌన్ విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సిరీస్‌ను పాక్‌లో జరపాలని ఏసీబీ తొలుత నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం ఈ సిరీస్ వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కావాల్సి ఉండింది. చదవండి: అరుదైన రికార్డుకు చేరువలో టీమిండియా పేసు గుర్రం.. -
మీకు మేమున్నాం, చెలరేగి ఆడండి.. అఫ్గాన్ క్రికెటర్లకు తాలిబన్ల భరోసా
కాబుల్: అఫ్గానిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లడంతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఈ క్రమంలో ఆ దేశ భవిష్యత్తుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిన చాలా అంశాల్లో అఫ్గనిస్తాన్ క్రికెట్ ముందువరుసలో ఉంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా తాలిబన్లు అఫ్గానిస్తాన్ క్రికెట్‌కు మద్దతుగా నిలిచి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు. తాజాగా, తాలిబన్ నాయకుడు అనీస్ హక్కానీ అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది, మాజీ క్రికెట్ బోర్డు అధికారులు అసదుల్లా, నూర్ అలీ జద్రాన్‌లతో సమావేశం సందర్భంగా ఆ దేశ క్రికెటర్లకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. మీ వెంట మేమున్నాం.. చెలరేగి ఆడండి అంటూ క్రికెటర్లను ఉత్సాహపరిచి, మద్దతు ఇచ్చినట్లు సమాచారం. దీంతో యూఏఈ వేదికగా త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు అఫ్గాన్‌కు లైన్ క్లియర్ అయినట్లేనని ఆ దేశ క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు అఫ్గాన్ ఆటగాళ్ల సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని హక్కాని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, 1996-2001 మధ్యలో హక్కాని అధ్యక్షతనే అఫ్గాన్‌లో క్రికెట్ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే, అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులు పాకిస్తాన్ క్రికెట్‌పై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. త్వరలో ఆ దేశంలో పర్యటించాల్సి ఉన్న న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. అఫ్గనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ క్రికెటర్లు పాకిస్తాన్ పర్యటనలో భద్రతా సమస్యను లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు జట్లు పాక్‌లో పర్యటించడం ప్రశ్నార్ధకంగా మారింది. చదవండి: ఇంగ్లండ్ ఆటగాళ్లు అతి చేస్తుంటే కోచ్ ఏం చేస్తున్నాడు..? -
డివిలియర్స్‌పై కీలక ప్రకటన చేసిన దక్షిణాఫ్రికా బోర్డు
జొహన్నెస్‌బర్గ్: విధ్వంసక బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ మళ్లీ దక్షిణాఫ్రికా తరఫున ఆడే అవకాశం ఉందంటూ గత కొంత కాలంగా వినిపిస్తున్న వార్తలకు తెర పడింది. అతను అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయడం లేదని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) అధికారికంగా ప్రకటించింది. రిటైర్మెంట్ను వదిలి మళ్లీ బరిలోకి దిగే విషయంలో అతనితో ఇటీవల బోర్డు అధికారులు చర్చలు జరిపినట్లు సమాచారం. తాజాగా వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు సఫారీ జట్టును ప్రకటించిన నేపథ్యంలో ఏబీ గురించి ప్రకటన వెలువడింది. ‘రిటైర్మెంట్పై తన నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదని, దానికే కట్టుబడి ఉన్నట్లు డివిలియర్స్ చెప్పాడు’ అని సీఎస్ఏ స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న 37 ఏళ్ల డివిలియర్స్ అనూహ్యంగా 2018 మే నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటి నుంచే అతని పునరాగమనంపై పదే పదే వార్తలు వచ్చాయి. నిజానికి 2019 వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలని అతను ఆశించినా... చివరి నిమిషంలో ఈ విషయం చెప్పడంతో బోర్డు ఏబీ విజ్ఞప్తిని తిరస్కరించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్లో డివిలియర్స్ చెలరేగుతుండటంతో జాతీయ జట్టు గురించి మళ్లీ ప్రస్తావన వచ్చింది. అతని మాజీ సహచరులు గ్రేమ్ స్మిత్, మార్క్ బౌచర్‌లు బోర్డులో కీలకపాత్ర పోషిస్తుండటంతో ఈ ఏడాది భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున కచ్చితంగా ఆడతాడనే ప్రచారం జరిగింది. ఫామ్, ఫిట్నెస్ బాగుంటే వస్తానంటూ ఇటీవల ఐపీఎల్లో కూడా అతను తన ఉద్దేశాన్ని బయట పెట్టాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత పునరాగమనం విషయంలో బౌచర్‌తో చర్చించాల్సి ఉందని కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు తాజా ప్రకటనతో అతని దక్షిణాఫ్రికా కెరీర్ ముగిసినట్లు స్పష్టమైపోయింది. -
కోహ్లి లేకుండా ప్రాక్టీసుకు...
కూలిడ్జ్ (ఆంటిగ్వా): స్పెషలిస్ట్ ఆటగాళ్ల చేరికతో కరీబియన్ పర్యటనలో టీమిండియా టెస్టు సమరానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా శనివారం నుంచి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఎలెవెన్‌తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత జట్టులో లేని బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, పేసర్లు ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లు సంప్రదాయ ఫార్మాట్‌కు సమాయత్తం అయ్యే ప్రయత్నం చేయనున్నారు. నెల రోజుల విశ్రాంతి అనంతరం ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తాజాగా మైదానంలో దిగనున్నాడు. బుధవారం జరిగిన మూడో వన్డేలో కుడి చేతి బొటన వేలికి గాయం కావడంతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి బరిలోకి దిగకపోవచ్చని తెలుస్తోంది. ఇది అధికారిక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ కాకపోవడంతో టీమిండియా తరఫున బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరూ మైదానంలో కాసేపు గడిపే వీలుంది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పుజారా ఎనిమిది నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్నాడు. దేశవాళీ జట్టు సౌరాష్ట్ర తరఫున ఫిబ్రవరి మొదటివారంలో రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడిన అనంతరం అతడు మార్చిలో ముస్తాక్ అలీ టి20 టోర్నీలో పాల్గొన్నాడు. టెస్టు జట్టు వైస్ కెప్టెన్ హోదాలో ఉన్నప్పటికీ కొంతకాలంగా తనదైన ఇన్నింగ్స్ ఆడలేకపోతున్న రహానేకు ఇప్పుడు అసలైన పరీక్షా కాలం నడుస్తోంది. ఇంగ్లిష్ కౌంటీల్లోనూ అతడు పెద్దగా రాణించలేకపోయాడు. ఏడు మ్యాచ్‌ల్లో 307 పరుగులే చేశాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌కు రహానేనే సారథ్యం వహించనున్నాడు. సాహా అందుబాటులోకి వచ్చినందున తొలి టెస్టులో చోటు దక్కాలంటే పంత్ మెరుగైన కీపింగ్ లక్షణాలు కనబర్చాల్సి ఉంటుంది. హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ ఆటపైనా ఆసక్తి నెలకొంది. ప్రథమ ప్రాధాన్య ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌లకే అవకాశం ఉన్నా... విహారి నుంచి వీరిద్దరిలో ఒకరికి పోటీ ఉంది. పేస్‌తో ఉమేశ్, ఇషాంత్, స్పిన్‌తో అశ్విన్, జడేజా టీం మేనేజ్మెంట్ను మెప్పించేందుకు ప్రయత్నించవచ్చు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్–వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. -
అఫ్గానిస్తాన్ సంచలన నిర్ణయం
అప్గానిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. యువ సంచలనం, 20 ఏళ్ల రషీద్ ఖాన్‌ను అఫ్గాన్ సారథిగా నియమించింది. ఇప్పటికే అప్గాన్ టీ20 జట్టుకు సారథిగా ఉన్న రషీద్.. ఇక నుంచి మూడు ఫార్మట్లకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రపంచకప్‌లో ఆడిన అన్ని లీగ్ మ్యాచ్‌ల్లోనూ అఫ్గాన్ ఘోర పరాజయాలను ఎదుర్కొంది. దీంతో పేలవ ప్రదర్శనతో నిరాశపర్చిన జట్టులో సమూల మార్పులు చేయాలని అఫ్గాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. దీనిలో భాగంగా ఈ చర్యలను చేపట్టింది. ఇక సీనియర్ ఆటగాడు, మాజీ సారథి అస్గర్ అఫ్గాన్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ప్రపంచకప్ ఆరంభానికి ముందు సారథిగా ఉన్న అస్గర్‌ను తప్పించి గుల్బాదిన్ నైబ్కు బాధ్యతలను అప్పగించింది. అయితే నైబ్ సారథ్యంలోని అప్గాన్ జట్టు టోర్నీలో ఒకటిరెండు మినహా మిగతా మ్యాచ్‌ల్లో తీవ్రంగా నిరాశపరిచింది. సారథిగానే కాకుండా ఆటగాడిగా కూడా విఫలమవ్వడంతో నైబ్‌పై వేటువేసింది. అయితే ప్రపంచకప్‌లో రషీద్ తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ అతడిపై బోర్డు నమ్మకం ఉంచింది. ఇక 20 ఏళ్ల రషీద్ ఐపీఎల్‌తో భారతీయులకు సుపరిచితుడే. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తన సంచలన బౌలింగ్‌తో సన్‌రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. -
సెక్స్ ఫర్ సెలక్షన్.. పెను కలకలం
‘జట్టులో చోటు దక్కాలంటే అమ్మాయిలను ఫైవ్‌స్టార్ హోటళ్లకు పంపాల్సిందే... అలా అయితేనే టీమ్‌లో నువ్వు ఉంటావ్... లేకపోతే ఈ జన్మలో టీమ్ తరపున ఆడలేవ్’.. ఇది సెక్స్ ఫర్ సెలక్షన్ స్టింగ్ ఆపరేషన్‌లో వెలుగు చూసిన విషయం. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ)లో వెలుగు చూసిన ఈ స్కాండల్‌తో క్రీడా రంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మహమ్మద్ అక్రమ్ సైఫీ ఇందులో భాగస్వామి కావటంతో.. ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టులోకి ఎంపిక చేయాలంటే తనకు అందమైన అమ్మాయిలను సరఫరా చేయాలని అక్రమ్ సైఫీ డిమాండ్ చేసినట్లు యూపీ యువ క్రికెటర్ రాహుల్ శర్మ ఆరోపణలు చేశాడు. ఈ మేరకు ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ సాయంతో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి వ్యవహారం మొత్తం వెలుగులోకి తెచ్చాడు. ఈ మేరకు అక్రమ్, శర్మ మధ్య జరిగిన ఫోన్ సంప్రదింపుల ఆడియో టేప్‌ను కూడా ఆ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది. స్టింగ్ ఆపరేషన్... ‘ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ)లో చాలా మంది పెద్దలున్నారు. వాళ్లందరినీ ఒప్పించాలంటే న్యూఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్‌కి అమ్మాయిలను పంపించాలి’ అని శర్మను అక్రమ్ అడిగినట్లు ఆడియో టేప్‌లో తెలుస్తోంది. జట్టులో తనకు కచ్చితంగా స్థానం కల్పిస్తానని శర్మకు అక్రమ్ చెప్పడం మరో ఫోన్ సంభాషణలో స్పష్టమైంది. జట్టులోకి ఎంపిక చేయాలంటే డబ్బుకు బదులు తనకు అమ్మాయిలను సరఫరా చేయాలని అక్రమ్ అడిగినట్లు ఉత్తర ప్రదేశ్ క్రికెటర్ రాహుల్ శర్మ ఆరోపించాడు. అంతేకాకుండా చాలా మంది ఆటగాళ్లకు ఆయన నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి బీసీసీఐ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు సహాయపడుతున్నాడని శర్మ ఆరోపించాడు. శర్మతో పాటు మరికొంత మంది ఆటగాళ్లు అక్రమ్‌పై ఆరోపణలు చేశారు. అయితే వారు తమ పేర్లను బయటపెట్టడానికి ఇష్టపడలేదు. యూపీ క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమ్‌కు ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ.. ఈ వ్యవహారాలను అతనే దగ్గరుండి నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజీనామా.. తొలుత ఆరోపణలుగా ఖండిచిన సైఫీ.. విమర్శలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో గురువారం తన పదవికి రాజీనామా చేశాడు. మరోవైపు అనుచరుడి రాజీనామాను శుక్లా వెంటనే ఆమోదించినట్లు తెలుస్తోంది. అయితే శుక్లా లాంటి పెద్దల అండ ఉన్న తనపై.. కావాలనే కుట్ర పన్నుతున్నారని అక్రమ్ చెబుతున్నారు. బీసీసీఐ దర్యాప్తులో అసలు వాస్తవాలు వెల్లడౌతాయన్న ఆశాభావం సైఫీ వ్యక్తం చేస్తున్నాడు. దిగ్భ్రాంతి... కాగా, ఈ వ్యవహారంపై పలువురు ఆటగాళ్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్పీ సింగ్, మహమ్మద్ కైఫ్ తదితరులు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ విషయంలో శుక్లా పారదర్శకంగా వ్యవహరించి.. యంగ్ టాలెంట్‌కు న్యాయం చేస్తారని భావిస్తున్నట్లు ట్వీట్లు చేశారు. -
బీసీసీఐ ఎస్జీఎం చెల్లదన్న సీఓఏ
ఉప్పు–నిప్పుగా తయారైన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), పరిపాలక కమిటీ (సీఓఏ)ల మధ్య మరో లేఖాస్త్రం వార్తల్లోకెక్కింది. ఈ నెల 22న బీసీసీఐ నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) చెల్లదని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాశారు. అందులో తీసుకున్న విధాన నిర్ణయాలకు విలువలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎస్‌జీఎంలో క్రికెటర్ల కొత్త కాంట్రాక్ట్‌లను ఆమోదించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు బోర్డు ఆఫీస్ బేరర్లు తీసుకున్నారు. -
ఆ ‘నాలుగు’ అమలు కష్టమే
న్యూఢిల్లీ: క్రికెట్ బోర్డులో అమలు చేయాల్సిన లోధా కమిటీ సిఫార్సుల్లో ‘ఆ నాలుగు’ ప్రధాన అడ్డంకి అని 12 రాష్ట్రాల సంఘాలు... కోర్టు సహాయకుడి (అమికస్ క్యూరీ)కి నివేదిక అందజేశాయి. తదుపరి విచారణ (మే 11)కు ముందే తమకు అభ్యంతరకరమైన సిఫార్సులేవో కోర్టు సహాయకుడు గోపాల్ సుబ్రమణియంకు తెలియ జేయాలంటూ సుప్రీం కోర్టు గత విచారణ సందర్భంగా బీసీసీఐ, అనుబంధ రాష్ట్ర సంఘాలకు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి అనుబంధంగా ఉన్న 37 సంఘాల్లో 12 సంఘాలు తమకు ఇబ్బందికరమైన నాలుగు సిఫార్సుల్ని ఆ నివేదికలో వివరించాయి. అందులో 1. ఒక రాష్ట్రానికే ఒకే ఓటు, 2. పదవుల మధ్య మూడేళ్ల విరామం, 3. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు, 4.ఆఫీసు బేరర్లు, ప్రొఫెషనల్స్ (కోర్టు నియమించమన్న సీఈఓ, సీఎఫ్ఓ) మధ్య అధికార పంపకం అమలు చేయడం కష్టమని ఆంధ్ర, అస్సాం, గోవా, జార్ఖండ్, కేరళ, ముంబై, రాజస్తాన్, రైల్వేస్, త్రిపుర, యూనివర్సిటీస్, ఉత్తరప్రదేశ్, విదర్భ సంఘాలు తెలిపినట్లు బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి మీడియాకు వెల్లడించారు. ‘ఒక రాష్ట్రానికి ఒకే ఓటంటే మహారాష్ట్ర (ముంబై, విదర్భ, మహారాష్ట్ర), గుజరాత్ (బరోడా, సౌరాష్ట్ర, గుజరాత్) లాంటి పెద్ద రాష్ట్రాల్లో ఉన్న మూడేసి సంఘాలకు ప్రాతినిధ్యం కరువవుతుంది. పదవికి పదవికి మధ్య కనీసం మూడేళ్ల విరామమంటే ఎన్నికైన ఆఫీస్ బేరర్‌కు కొనసాగే వీలే ఉండదు. ఉన్నతస్థాయి కమిటీ, అధికార పంపకాల వల్ల కొత్త సమస్యలు వస్తాయని క్రికెట్ సంఘాలు వాపోతున్నాయి’ అని అమితాబ్ చెప్పారు. మొత్తం మీద నేడు సుప్రీం కోర్టులో లోధా కమిటీ సిఫార్సులపై విచారణ జరుగనుంది. -
క్రికెట్ బోర్డులో సంచలన నిర్ణయాలు
కెన్యా క్రికెట్ బోర్డులో ముసలం చెలరేగింది. వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ 2లో కెన్యా క్రికెట్ జట్టు ఘోర ప్రదర్శన కనపరిచింది. దీంతో ఓటమికి బాధ్యత వహిస్తూ కెఫ్టెన్ రాకెప్ పటేల్ కెఫ్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. కాగా, అతని అడుగుజాడల్లోనే తాత్కాలిక కోచ్ థామస్ ఓడియో కూడా పదవి నుంచి తప్పుకున్నారు. అంతే కాకుండా కెన్యా క్రికెట్ బోర్డులోప్రెసిడెంట్ జాకీ జాన్ మహ్మద్ బాధ్యతల నుంచి వైదొలిగారు. నమీబియాలో జరిగిన ప్రపంచకప్ లీగ్ డివిజన్-2 టోర్నమెంట్లో కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా కెన్యా విజయం సాధించలేకపోయింది. ఈ టోర్నీలో పాల్గొన్న ఆరు జట్లలో కెన్య చివరి స్థానంలో నిలిచింది. ఈ ఘోర పరాజయానికి నైతిక బాధ్యతగా తొలుత కెప్టెన్ రాకెప్ పటేల్ తన పదవికి రాజీనామా చేశాడు. ఆపై కోచ్ థామస్ ఓడియో కూడా తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రపంచ క్రికెట్లో ఒక క్రికెట్ బోర్డుకు తొలిసారి మహిళా అధ్యక్షురాలిగా సేవలందిస్తున్న కెన్యా బోర్డు ప్రెసిడెంట్ జాకీ జాన్ మహ్మద్ సైతం నైతిక బాధ్యతగా వీడ్కోలు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సరైన గుర్తింపు, ఆదరణ లేకపోవడంతో పాటు ఆర్థికంగానూ కెన్యా క్రికెట్ బోర్డు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితిలో ఈ మూకుమ్మడి రాజీనామాలతో స్థానిక క్రికెట్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. త్వరలోనే అధ్యక్ష పదవి కోసం కెన్యా బోర్డు ఎన్నికలు నిర్వహించనుంది. -
అమ్మకానికి బీసీసీఐ వెబ్సైట్!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుగా పేరున్న బీసీసీఐ వెబ్‌సైట్‌ను అమ్మకానికి పెట్టారు. బీసీసీఐ.టీవీ వెబ్‌సైట్‌కు సంబంధించిన లైసెన్స్‌ను పునరుద్ధరించుకోక పోవడంతో వెబ్‌సైట్స్ రిజిస్ట్రార్స్ సంస్థ ఆ డొమైన్‌ను అమ్మకానికి పెట్టింది. దీనికోసం బిడ్డింగ్‌ను ఆహ్వానించగా ఏడు బిడ్లు వచ్చాయి. బోర్డు డొమైన్ కాలవ్యవధి 2–2–2006 నుంచి 2–2–2019 వరకైతే... ఏడాది ముందే అంటే తేదీ 3–2–2018లోపు రెన్యువల్ (పునరుద్ధరణ) చేసుకోవాలి. కానీ క్రికెట్ బోర్డు ఆ పని చేయకపోవడంతో వెబ్‌సైట్స్ రిజిస్ట్రార్స్ రిజిస్టర్.కామ్ ఆ డొమైన్‌ను అమ్మకానికి పెట్టింది. -
ప్రాక్టీస్ సెషన్‌కు రాలేదని క్రికెటర్‌పై నిషేదం..
కొలంబో : నిబంధనలు ఉల్లంఘించినందుకు శ్రీలంక యువ క్రికెటర్ ధనుష్క గుణతిలకపై ఆ దేశ క్రికెట్ బోర్డు వేటు వేసింది. ప్రాక్టీస్ సెషన్‌ను ఎగ్గొటడమే కాకుండా, బోర్డు క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు 6 అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేదంతో పాటు అతని కాంట్రాక్టులో 20 శాతం కోత విధించింది. మైదానం బయట గుణతిలక ప్రవర్తనను పరిగణలోకి తీసుకొని సస్పెండ్ చేసినట్లు లంక బోర్డు అధికారులు తెలిపారు. ఈ నిషేదం సెప్టెంబర్ 30 నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఇటీవల భారత్‌తో టెస్టు, వన్డే సిరీస్ సమయంలో ఓ మ్యాచ్ ఆడేందుకు మైదానానికి వస్తూ తన బ్యాటింగ్ కిట్‌ను తీసుకురాకుండా వచ్చాడు. ఇవన్నీ గుర్తించిన బోర్డు తాజాగా 6 మ్యాచుల నిషేధాన్ని విధిస్తూ చర్యలు తీసుకుంది. భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనే గుణతిలక టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అనంతరం ఐదు వన్డేలకు ఎంపికైన గుణతిలక రెండు వన్డేల తర్వా గాయంతో దూరమయ్యాడు. ప్రస్తుతం శ్రీలంక జట్టు దుబాయ్‌లో పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది. తొలి టెస్టులో శ్రీలంక విజయం సాధించగా రెండో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ సస్పెన్షన్‌తో టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో గుణతిలకకు చోటు దక్కలేదు. -
షెహజాద్ వ్యాఖ్యలు మతిలేనివి: పీసీబీ
న్యూఢిల్లీ: తమ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అది తెలివితక్కువతనంతో చేసిన పనిగా విమర్శించారు. శ్రీలంక క్రికెటర్ దిల్షాన్‌తో షెహజాద్ చేసిన మతపరమైన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ‘మైదానంలో మతం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అదీ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఇలా ప్రవర్తించడం నిజంగా మూర్ఖత్వం. ఆ వ్యాఖ్యలు స్నేహపూర్వకంగానే చేసినా తప్పే. ఇప్పటికే ఈ ఘటనపై త్రిసభ్య కమిటీని నియమించాం. మా క్రమశిక్షణ కమిటీ మరోసారి ఇలాంటి చర్యలు జరగకుండా చూస్తుంది. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. వారిది నిజంగా సరైన నిర్ణయం’ అని ఖాన్ అన్నారు. మరోవైపు షెహజాద్ విషయాన్ని దిల్షాన్ తేలిగ్గా తీసుకున్నాడు. ఆ సమయంలో తానేం మాట్లాడానో కూడా గుర్తులేదన్నాడు. 26/11 పై తేలాకే సిరీస్‌లు జరగవచ్చు! ముంబైలో 2008లో జరిగిన 26/11 దాడుల కేసు పూర్తిగా ముగిసే వరకు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణ కష్టమేనని పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ అన్నారు. ఈ నెలలో జరిగే చాంపియన్స్ లీగ్‌లో లాహోర్ లయన్స్ పాల్గొనే అంశంపై కూడా ఇంకా స్పష్టత లేదని ఖాన్ అన్నారు. ఒక వేళ లాహోర్ జట్టు భారత్‌లో ఆడకపోతే... వచ్చే ఎనిమిదేళ్లలో ఇరు జట్ల మధ్య నిర్వహించాలని ప్రతిపాదిస్తున్న సిరీస్‌లపై కూడా దీని ప్రభావం పడవచ్చని ఆయన అన్నారు. అక్టోబరులో జరిగే ఐసీసీ సమావేశంలో బీసీసీఐ అధికారులతో తాను మరింత వివరంగా చర్చించాల్సి ఉందని షహర్యార్ వెల్లడించారు. -
విన్సెంట్ సమాచారమిచ్చింది నిజమే!
ఫిక్సింగ్పై ఐసీసీ ముందే చెప్పిందన్న కివీస్ ఆధారాలు కూడా అందించిన మాజీ క్రికెటర్ వెల్లింగ్టన్: క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్పై ఐసీసీకి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ లూ విన్సెంట్ విశ్వసనీయ సమాచారం ఇచ్చాడన్న విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు (ఎన్‌జెడ్‌సీ) ధ్రువీకరించింది. ఈ విషయాన్ని ఐసీసీ తమకు ఎప్పుడో తెలియజేసిందని ఎన్‌జెడ్‌సీ సీఈవో డేవిడ్ వైట్ గురువారం వెల్లడించారు. స్పాట్‌ఫిక్సింగ్ జరిగిన మ్యాచ్‌లు, ఆటగాళ్ల వివరాలను .. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం అధికారులకు విన్సెంట్ తెలిపాడంటూ లండన్ టెలిగ్రాఫ్ పత్రిక ఇటీవల కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో వైట్ స్పందించారు. ‘ఆ పత్రికలో వచ్చిన వివరాలు మాకు తెలిసినవే. ఐసీసీ ఈ విషయాన్ని మాకు ముందే చెప్పింది. కాబట్టి వీటి పట్ల మాకు ఎటువంటి ఆశ్చర్యం కలగలేదు’ అని వైట్ అన్నారు. పైగా ప్రస్తుత న్యూజిలాండ్ ఆటగాళ్లపైగానీ, తమ జట్టు ఆడిన మ్యాచ్లపైగానీ ఎటువంటి విచారణ జరగడం లేదని స్పష్టం చేశారు. అయితే దక్షిణాఫ్రికాలో 2012లో జరిగిన చాంపియన్స్ లీగ్‌లో భాగంగా తమ దేశవాళీ జట్టు ఆక్లాండ్ ఏసెస్ ఆడిన కొన్ని మ్యాచ్‌లకు సంబంధించి విచారణ జరుపుతున్నట్లుగా ఐసీసీ తమకు చెప్పినట్లు వైట్ పేర్కొన్నారు. కాగా, దేశవాళీల్లో ఆక్లాండ్ ఏసెస్ తరపున ఆడిన లూ విన్సెంట్.. తనతోపాటు న్యూజిలాండ్ ఆటగాళ్లు క్రిస్ కెయిన్స్, డారిల్ టఫీలపై కూడా విచారణ జరుగుతోందని గత డిసెంబర్లో తొలిసారిగా వెల్లడించాడు. ఆ తరువాత తనను కొందరు బుకీలు సంప్రదించినట్లు కూడా తెలిపాడు. అయితే టెలిగ్రాఫ్ పత్రిక మాత్రం ఐసీసీకి విన్సెంట్ ఆధారాలు కూడా ఇచ్చినట్లు పేర్కొంది. ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, హాంకాంగ్, దక్షిణాఫ్రికాల్లో నిర్వహించిన మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్ చోటుచేసుకుందని విన్సెంట్ చెప్పినట్లు తెలిపింది. -
భారత్‌తో ఆరు సిరీస్‌లు: పాక్
లాహోర్: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఆరు పూర్థిస్థాయి క్రికెట్ సిరీస్‌లు జరుగుతాయని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ)లో భాగంగా 2015 నుంచి 2023 మధ్య కాలంలో ఈ సిరీస్‌లు జరగనున్నాయి. ఇందులో నాలుగు సిరీస్‌లకు పాక్ ఆతిథ్యమివ్వనుందని పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబాన్ అహ్మద్ తెలిపారు. 2008లో ముంబైలో పాక్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్‌లు జరగడం లేదు. అయితే బీసీసీఐ అనుకూల ఐసీసీ పునర్వ్యవస్థీకరణకు పీసీబీ మద్దతు ఇవ్వడంతో మళ్లీ ముఖాముఖీ సిరీస్‌లకు మార్గం సుగమమైంది. -
గులాబీ రంగు బంతులతో ప్రయోగం
డే-నైట్ టెస్టుల దిశగా ఆసీస్ అడుగులు మెల్బోర్న్: టెస్టు మ్యాచ్‌ల్ని డే-నైట్ మ్యాచ్‌లుగా నిర్వహించాలనే ఆలోచనను అమలుపరిచే దిశగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం తమ దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌ల్లో గులాబీ రంగు బంతుల్ని ఉపయోగించాలని నిర్ణయించింది. ప్లడ్‌లైట్ల వెలుతురులో జరగనున్న ఈ ప్రయోగాత్మక మ్యాచ్‌లు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీలో గులాబీ బంతుల ప్రయోగం విజయవంతమైతే 2015-16లో న్యూజిలాండ్‌తో సిరీస్‌ను డే-నైట్ సిరీస్‌గా నిర్వహించే అవకాశం ఉంటుందని ఆసీస్ భావిస్తోంది. అదే జరిగితే రానున్న కాలంలో అన్ని బోర్డులు డే-నైట్ టెస్టుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. -
ఎనిమిదేళ్లలో రూ. 3700 కోట్లు
భారీగా పెరగనున్న బీసీసీఐ ఆదాయం కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడి ఎన్నికల షెడ్యూల్ తర్వాతే ఐపీఎల్ వేదికపై నిర్ణయం భువనేశ్వర్: ఐసీసీలో సమూల మార్పులకు ప్రణాళికలు సిద్ధం చేసిన భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)... ఆదాయాన్ని కూడా భారీ స్థాయిలో పెంచుకోనుంది. రాబోయే ఎనిమిదేళ్ల (2015-23)లో దాదాపు 600 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 3724 కోట్లు) సంపాదించనుందని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఐసీసీలోని మూడు మేజర్ కమిటీల్లో భారత్ శాశ్వాత సభ్య దేశంగా ఉంటుందని శుక్రవారం ఇక్కడ జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన వెల్లడించారు. ‘చాలా కాలంగా 68 శాతం ఆదాయాన్ని ఐసీసీకి భారత్ సమకూర్చిపెడుతోంది. అందులో నుంచి 4 శాతం మాత్రమే మనం తీసుకుంటున్నాం. కానీ ప్రస్తుత ప్రణాళికలు అమలైతే రాబోయే రోజుల్లో బోర్డు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఇకపై 21 శాతం మేర ఆదాయం మనకే దక్కుతుంది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ఐసీసీ ఆదాయంలో 75 శాతం మాత్రమే పది సభ్య దేశాలకు సమానంగా పంచేవారు. మిగతాది అసోసియేట్ దేశాలకు వెళ్లేది. ఇతర కార్యక్రమాల వల్ల భారత్‌కు అదనంగా మరో 4 శాతం దక్కేది’ అని పటేల్ వివరించారు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పర్యటనల్లో భారత్ ఘోర వైఫల్యంపై పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎంపీ పాండోవ్.. శ్రీనివాసన్‌ను వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రశ్నించారు. దీని గురించి చర్చించకుండా ఐపీఎల్ అంశాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై స్పందించిన శ్రీనివాసన్ మాట్లాడుతూ... దీనిపై విచారణకు ఆదేశించామని, జట్టు సహాయక సిబ్బంది, కోచ్‌తో కూడా మాట్లాడానని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ తర్వాతే... ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే ఐపీఎల్ తుది వేదికను ఖరారు చేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ వెల్లడించారు. ‘అవసరమైతే కొన్ని మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహిస్తాం. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, యూఏఈలు ఆతిథ్యమిచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఐపీఎల్ చైర్మన్ బిస్వాల్ తెలిపారు. ఏదేమైనా దీనిపై త్వరలోనే తుది నిర్ణయానికి వస్తాం’ అని శ్రీని వ్యాఖ్యానించారు. ఒకవేళ మే 15 వరకు ఎన్నికల తంతు పూర్తయితే... మొదటి రౌండ్ మ్యాచ్‌లను యూఏఈ, బంగ్లాలలో నిర్వహించి మిగతా లీగ్‌ను తిరిగి భారత్‌లోనే జరపనున్నట్లు సమాచారం. మే నెల మొత్తం ఎన్నికల ప్రక్రియ కొనసాగితే టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించే అవకాశాలున్నాయి. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్‌లను పారదర్శకంగా నిర్వహిస్తామని బిస్వాల్ తెలిపారు. ఇందుకోసం ఫ్రాంచైజీలు, ఆటగాళ్లకు అవసరమైన శిక్షణ ఇస్తామన్నారు. ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్పై ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను 70 శాతం మేర అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. -
షకీబ్‌పై మూడు మ్యాచ్‌ల నిషేధం
ఢాకా: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు (బీసీబీ) మూడు మ్యాచ్‌ల నిషేధం విధించింది. శ్రీలంకతో మిర్పూర్లో జరిగిన రెండో వన్డే సందర్భంగా టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారంలో షకీబ్ అసభ్యకరమైన సంజ్ఞ చేశాడు. దీంతో ఆగ్రహించిన బీసీబీ విచారణకు ఆదేశించగా, శుక్రవారం క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన షకీబ్.. తప్పు చేసినట్లు అంగీకరించాడు. ఈ మేరకు బీసీబీ అతనిపై మూడు మ్యాచ్‌ల నిషేధంతోపాటు 3 లక్షల టాకాలు (రూ. 2.40 లక్షలు) జరిమానా విధించింది. నిషేధం కారణంగా శ్రీలంకతో మూడో వన్డేతోపాటు ఆసియా కప్‌లో భారత్, అఫ్ఘానిస్థాన్‌లతో జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు షకీబ్ దూరం కానున్నాడు. -
శ్రీలంక కోచ్‌గా చాపెల్?
కొలంబో: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ శ్రీలంక జట్టు చీఫ్ కోచ్‌గా నియమితులయ్యే అవకాశముంది. చాపెల్ కోసం లంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) కోచ్ నియామక ప్రక్రియ గడువును ఈ నెలాఖరు వరకు పెంచింది. 1970 దశకంలో మేటి బ్యాట్స్‌మన్‌గా కితాబందుకున్న ఈ ఆసీస్ క్రికెటర్ గతంలో టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించారు. 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత్ వైఫల్యం, గంగూలీ తదితర సీనియర్లతో పొసగకపోవడంతో ఆయన అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది. ప్రస్తుతం లంక చీఫ్ కోచ్ పదవి కోసం భారత మాజీ కోచ్‌లు వెంకటేశ్ ప్రసాద్, లాల్‌చంద్ రాజ్‌పుత్, మోహిత్ సోనిలతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన చాపెల్, షేన్ డఫ్, మైకేల్ ఓ సలైవాన్ పోటీపడుతున్నారు. ఈ ఆరుగురితో కూడిన తుది జాబితాను ఎస్ఎల్సీ పరిశీలిస్తున్నప్పటికీ చాపెల్వైపే మొగ్గుచూపినట్లు సమాచారం. -
ఎవరిస్తారు స్ఫూర్తి!
న్యూఢిల్లీ: క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. మాజీ ఆటగాళ్లు, కోచ్‌లు, క్రికెట్ బోర్డులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. సచిన్ వీడ్కోలు తర్వాత భావితరాలకు స్ఫూర్తినిచ్చే వారు ఉండరని ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. టీమిండియాలోని యువ క్రికెటర్లకు ఇది పెద్ద లోటని చెప్పాడు. మాస్టర్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే గొప్ప అవకాశాన్ని యువకులతో పాటు భావితరాలు కోల్పోతున్నాయన్నాడు. ‘సచిన్ ఓ లివింగ్ లెజెండ్. అతనిలా స్ఫూర్తినిచ్చే వారు లేరు. యువకులు ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు. నేను అతనికంటే ఏడేళ్లు జూనియర్ని. డ్రెస్సింగ్ రూమ్‌లో కిట్ పడేసి నేరుగా అతని వద్దకు వెళ్లి మాట్లాడేవాణ్ని. ఓ స్థాయి వరకు మాస్టర్ నుంచి చాలా స్ఫూర్తి పొందాను. అతను లేని లోటును పూరించడానికి చాలా సమయం పడుతుంది’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. సచిన్ అందరికీ అందుబాటులో ఉండే గొప్ప వ్యక్తి అని కితాబిచ్చాడు. ఏ విషయాన్నైనా అతనితో చర్చించే అవకాశం ఉంటుందన్నాడు. ‘మాస్టర్ ఓ సూపర్ స్టార్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. భారత క్రికెట్లో అతను ఎదిగిన తీరు, సాధించిన ఘనతలు అద్భుతం. చివరి పదేళ్లలో భారత క్రికెట్‌కు ఎంతో చేశాడు. రిటైర్మెంట్ నిర్ణయం ఎప్పుడైనా తీసుకోవాల్సిందే కాబట్టి సరైన సమయంలోనే తీసుకున్నాడు. సొంత అభిమానుల మధ్య ముంబైలో మ్యాచ్ జరిగితే చాలా బాగుంటుంది’ అని ద్రవిడ్ వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టి20లో అద్భుతంగా ఆడి జట్టును గెలిపించిన యువరాజ్ సింగ్ (77 నాటౌట్).. తన ఇన్నింగ్స్‌ను మాస్టర్‌కు అంకితమిచ్చాడు. ఈ విషయాన్ని ఫోన్లో అతనికి చెబుతానని చెప్పాడు. మాస్టర్ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరాడు. సమకాలిన క్రికెట్లో సచిన్‌ను మించిన ఆటగాడు లేడని ఆసీస్ మీడియా కితాబిచ్చింది. క్రికెట్ చరిత్రలో డాన్ బ్రాడ్‌మన్, మాస్టరే దిగ్గజ బ్యాట్స్‌మెన్ అని ప్రశంసించింది. ‘క్రికెట్ నుంచి సచిన్ అనే దేవుడు నిష్ర్కమిస్తున్నాడు’ అని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వ్యాఖ్యానించగా; ‘క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాట్స్‌మెన్ సచిన్, బ్రాడ్‌మన్ అనే నిజాన్ని ఒప్పుకోవాల్సిందే’నని డైలీ టెలిగ్రాఫ్ పేర్కొంది. ‘సచిన్ ఓ సూపర్ హీరో’ అంటూ ఆకాశానికెత్తేసిన ఇంగ్లిష్ మీడియా... పీలే, ఫెడరర్‌లతో పోలుస్తూ పలు కథనాలు ప్రచురించింది. క్రికెట్లో ఉన్న అన్ని రికార్డులను సొంతం చేసుకున్న ‘సూపర్ హ్యూమన్’ మాస్టర్ అంటూ మిర్రర్ పేర్కొంది. ఎక్కడైనా క్రికెటర్లకు గౌరవం మాత్రమే లభిస్తుంది కానీ భారత్‌లో సచిన్‌ను దేవుడితో సమానంగా కొలుస్తారని వ్యాఖ్యానించింది. సచిన్ ఓ ‘గ్లోబల్ సూపర్ స్టార్’ అని స్కై స్పోర్ట్స్ తెలిపింది. మరికొంత కాలం క్రికెట్ ఆడకుండా సచిన్ సరైన నిర్ణయం తీసుకున్నాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్‌కాట్ విశ్లేషించారు. వీడ్కోలు నిర్ణయం సంతోషాన్ని కలిగించిందన్నారు. కోట్లాది మంది అభిమానుల మధ్య 24 ఏళ్ల కెరీర్‌ను అత్యంత దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడని కితాబిచ్చారు. ‘మా తరంలో అత్యద్భుత క్రికెటర్ సచిన్’ అంటూ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ ప్రశంసించాడు. సచిన్ రిటైర్మెంట్ ఇంకా ముగియలేదు. ఈ అంశంపై నేను ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నా. కృతజ్ఞతలు చెప్పేందుకు మాటలు రావడం లేదు’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న ఆచ్రేకర్ ముంబై: ఆరోగ్య సమస్యల కారణంగా సరిగా నడవలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్నా... తన శిష్యుడు సచిన్ చివరి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని మాస్టర్ చిన్ననాటి కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె కల్పన వెల్లడించారు. ‘ఇది ఓ భావోద్వేగ సమయమని నాన్న చెబుతున్నారు. 200వ టెస్టుకు సాక్షిగా నిలవాలని కోరుకుంటున్నారు. సచిన్ రిటైర్మెంట్ బాధ కలిగిస్తోందని, మరికొంత కాలం ఆడితే బాగుండే దని అనుకుంటున్నారు. మాస్టర్ వీడ్కోలు తర్వాత నాన్న టీవీ చూడటం తగ్గిస్తారు. గురువారం కూడా సచిన్ ఫోన్ చేసి, త్వరలో వచ్చి కలుస్తానని నాన్నతో చెప్పాడు. ఇటీవల వచ్చినప్పుడు రెండు గంటలు కూర్చుని అర్జున్ గురించి మాట్లాడాడు. కానీ రిటైర్మెంట్ విషయం చర్చకు రాలేదు’ అని కల్పన తెలిపారు. వాంఖడేలో ఆడతా : బోర్డును కోరిన సచిన్ ముంబై: బంధువులు, స్నేహితుల సమక్షంలో ప్రతిష్టాత్మక 200వ టెస్టును వాంఖడే స్టేడియంలోనే సచిన్ ఆడాలని కోరుకుంటున్నట్లు బీసీసీఐ కోశాధికారి రవి సావంత్ చెప్పారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని మాస్టర్ బీసీసీఐకి చెప్పాడని ఆయన తెలిపారు. కాబట్టి సచిన్ కోరిక మేరకు బోర్డు వాంఖడేకు ఈ మ్యాచ్‌ను కేటాయించే అవకాశం ఉందని సావంత్ చెప్పారు. శుక్రవారం బోర్డు ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు శ్రీనివాసన్‌తో సమావేశమైన తర్వాత సావంత్ ఈ ప్రకటన చేశారు. రాజీవ్ శుక్లా నేతృత్వంలోని బోర్డు పర్యటనల కమిటీ మంగళవారం సమావేశమై విండీస్‌తో సిరీస్‌కు వేదికలు ఖరారు చేయనుంది. ఆ సమావేశం తర్వాత ఈ టెస్టు వేదికపై అధికారిక ప్రకటన రావచ్చు. సచిన్‌కు ఎవరూ ఊహించని స్థాయిలో ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. -
బీసీసీఐ లాభం రూ.350 కోట్లు
ముంబై: ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ. 950 కోట్ల ఆదాయాన్ని మూటగట్టుకుంది. ఇందులో నికర ఆదాయం (లాభం) రూ. 350 కోట్లు అని బోర్డు ఫైనాన్స్ కమిటీ గురువారం ప్రకటించింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో బోర్డు రూ. 382.36 కోట్ల లాభం సంపాదించిందని బోర్డు కోశాధికారి రవి సావంత్ వెల్లడించారు. ఢిల్లీలో సమావేశమైన ఈ కమిటీ... ఖాతాలను ఆమోదించింది. తుది ఆమోదం కోసం కోసం బీసీసీఐ వర్కింగ్ కమిటీకి ఖాతా వివరాలను పంపుతారు. వచ్చే నెల మొదటి వారంలో వర్కింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ మీటింగ్‌లోనే బోర్డు వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) తేదీలను కూడా ఖరారు చేస్తారు.