లాహోర్: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఆరు పూర్థిస్థాయి క్రికెట్ సిరీస్‌లు జరుగుతాయని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్‌టీపీ)లో భాగంగా 2015 నుంచి 2023 మధ్య కాలంలో ఈ సిరీస్‌లు జరగనున్నాయి.
ఇందులో నాలుగు సిరీస్‌లకు పాక్ ఆతిథ్యమివ్వనుందని పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబాన్ అహ్మద్ తెలిపారు. 2008లో ముంబైలో పాక్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్‌లు జరగడం లేదు. అయితే బీసీసీఐ అనుకూల ఐసీసీ పునర్‌వ్యవస్థీకరణకు పీసీబీ మద్దతు ఇవ్వడంతో మళ్లీ ముఖాముఖీ సిరీస్‌లకు మార్గం సుగమమైంది.
భారత్‌తో ఆరు సిరీస్‌లు: పాక్
Published Thu, May 15 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 AM
Advertisement
Advertisement