ఢాకా: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు (బీసీబీ) మూడు మ్యాచ్‌ల నిషేధం విధించింది. శ్రీలంకతో మిర్‌పూర్‌లో జరిగిన రెండో వన్డే సందర్భంగా టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారంలో షకీబ్ అసభ్యకరమైన సంజ్ఞ చేశాడు.
దీంతో ఆగ్రహించిన బీసీబీ విచారణకు ఆదేశించగా, శుక్రవారం క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన షకీబ్.. తప్పు చేసినట్లు అంగీకరించాడు. ఈ మేరకు బీసీబీ అతనిపై మూడు మ్యాచ్‌ల నిషేధంతోపాటు 3 లక్షల టాకాలు (రూ. 2.40 లక్షలు) జరిమానా విధించింది. నిషేధం కారణంగా శ్రీలంకతో మూడో వన్డేతోపాటు ఆసియా కప్‌లో భారత్, అఫ్ఘానిస్థాన్‌లతో జరిగే తొలి రెండు మ్యాచ్‌లకు షకీబ్ దూరం కానున్నాడు.
షకీబ్‌పై మూడు మ్యాచ్‌ల నిషేధం
Published Sat, Feb 22 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM
Advertisement
Advertisement