కొలంబో: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ శ్రీలంక జట్టు చీఫ్ కోచ్‌గా నియమితులయ్యే అవకాశముంది. చాపెల్ కోసం లంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) కోచ్ నియామక ప్రక్రియ గడువును ఈ నెలాఖరు వరకు పెంచింది. 1970 దశకంలో మేటి బ్యాట్స్‌మన్‌గా కితాబందుకున్న ఈ ఆసీస్ క్రికెటర్ గతంలో టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించారు.
2007 వన్డే ప్రపంచకప్‌లో భారత్ వైఫల్యం, గంగూలీ తదితర సీనియర్లతో పొసగకపోవడంతో ఆయన అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది. ప్రస్తుతం లంక చీఫ్ కోచ్ పదవి కోసం భారత మాజీ కోచ్‌లు వెంకటేశ్ ప్రసాద్, లాల్‌చంద్ రాజ్‌పుత్, మోహిత్ సోనిలతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన చాపెల్, షేన్ డఫ్, మైకేల్ ఓ సలైవాన్ పోటీపడుతున్నారు. ఈ ఆరుగురితో కూడిన తుది జాబితాను ఎస్‌ఎల్‌సీ పరిశీలిస్తున్నప్పటికీ చాపెల్‌వైపే మొగ్గుచూపినట్లు సమాచారం.
శ్రీలంక కోచ్‌గా చాపెల్?
Published Sun, Oct 20 2013 1:39 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
Advertisement