Greg Chappell
-
Greg Chappell: ఆర్థిక ఇబ్బందుల్లో క్రికెట్ దిగ్గజం
మెల్బోర్న్: క్రికెట్ దిగ్గజం, భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ (75) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో ఆదుకునేందుకు ఆయన స్నేహితులు ముందుకు వచ్చారు. ఆన్లైన్లో విరాళాల సేకరణ చేపట్టారు. ఈ విషయాన్ని ఛాపెల్ స్వయంగా ధృవీకరించారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో సమావేశమైన ఛాపెల్ స్నేహితులు.. ‘గో ఫండ్ మీ’ ద్వారా విరాళల సేకరణకు నడుం బిగించారు. ఛాపెల్ ఇందుకు అయిష్టంగానే అంగీకరించినట్లు సమాచారం. అయితే.. తాను ఆర్థికంగా అంత దారుణంగా ఏమీ దెబ్బతినలేదని, సాధారణ జీవితమే గడుపుతున్నట్లు పేర్కొన్నారాయన. ‘‘మేం తీవ్ర కష్టాల్లో ఉన్నామని నేను చెప్పడం లేదు. అలాగని విలాసవంతమైన జీవితమూ గడపడం లేదు. మేం క్రికెటర్లం కాబట్టి లగ్జరీ లైఫ్ గడుపుతున్నామని చాలామంది అనుకుంటారు. అయితే, నేను పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నానని చెప్పడం లేదు. ఈ తరం క్రికెటర్లు పొందుతున్న విలాసవంతమైన ప్రయోజనాలను మేం పొందలేకపోతున్నాం. నా తరం క్రికెటర్లలో రిటైర్ అయిన తర్వాత కూడా ప్రొఫెషనల్ క్రికెట్లో నేను భాగంగానే ఉన్నా. కానీ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది మాత్రం నేనొక్కడినే’’ అని అన్నారాయన. ఆస్ట్రేలియా టీం ప్లేయర్‌గా 1970-84 మధ్యకాలంలో రాణించారాయన. 1975 నుంచి రెండేళ్లపాటు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ ఆస్ట్రేలియా జట్టు మాజీ సారథి.. 2005 నుంచి 2007 మధ్య కాలంలో భారత జట్టుకు కోచ్‌గా పని చేశారు. ఆ సమయంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారాయన. -
ప్రపంచకప్‌లో గిల్ తప్పక రాణిస్తాడు.. ఎందుకంటే: ఆసీస్ మాజీ ప్లేయర్
World Cup 2023 - Shubman Gill: వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ తప్పక రాణిస్తాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ విశ్వాసం వ్యక్తం చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ రైట్ హ్యాండర్‌కు మెరుగైన రికార్డు ఉందన్న విషయాన్ని గుర్తు చేశాడు. సొంతగడ్డపై గిల్ తప్పక బ్యాట్ ఝులిపిస్తాడని జోస్యం చెప్పాడు. విండీస్ పర్యటనలో విఫలం కాగా వెస్టిండీస్ పర్యటనలో శుబ్‌మన్ గిల్ స్థాయికి తగ్గట్లు రాణించలేక విఫలమైన విషయం తెలిసిందే. టెస్టుల్లో ఓపెనర్‌గా యశస్వి జైశ్వాల్ రాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఈ పంజాబీ బ్యాటర్ తేలిపోయాడు. ఆ తర్వాత వన్డే సిరీస్‌లోనూ ఉసూరుమనిపించాడు. అయితే, మూడో వన్డేలో 85 పరుగులతో రాణించినప్పటికీ.. టీ20 సిరీస్‌లో మళ్లీ పాత కథే పునరావృతమైంది. నాలుగో టీ20లో 77 పరుగులు మినహా మిగతా నాలుగు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. దీంతో అహ్మదాబాద్ పిచ్‌పై మాత్రమే గిల్ ఆడతాడంటూ అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక ఆసియా వన్డే కప్, వన్డే ప్రపంచకప్ రూపంలో కీలక టోర్నీలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో శుబ్‌మన్ గిల్ నిలకడలేని ఫామ్ ఆందోళనకరంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో గ్రెగ్ చాపెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తప్పక రాణిస్తాడు.. ఎందుకంటే ‘‘ఈ ఫార్మాట్లో(వన్డే) అతడికి మంచి రికార్డు ఉంది. కాబట్టి మెగా ఈవెంట్లో అతడు తప్పక రాణిస్తాడని నమ్ముతున్నా. గతంలో తన రికార్డులను పరిశీలిస్తే అతడి ఆట తీరు ఎలా ఉందో మనకు తెలుస్తుంది. తనకు కేవలం టెస్టు క్రికెట్లోనే సమస్యలు ఎదురవుతున్నాయి. వన్డేల్లో మాత్రం అతడి ప్రదర్శనలు మెరుగ్గానే ఉన్నాయి’’ అని పేర్కొన్నాడు. ఇక బౌలర్లు కొత్త బంతితో బరిలోకి దిగినపుడు గిల్ ఆరంభంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్.. ఈ యువ బ్యాటర్‌కు సూచించాడు. కాగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 27 వన్డేలు ఆడిన శుబ్‌మన్ గిల్.. 1437 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా నాలుగు సెంచరీలు, ఒక ద్విశతకం ఉన్నాయి. ఇదిలా ఉంటే.. అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. అతడే ధోని! కానీ రోహిత్ మాత్రం: పాక్ దిగ్గజం -
అలా చేస్తే గిల్‌ను ఈజీగా ఔట్ చేయవచ్చు.. లేదంటే కష్టమే: చాపెల్
ఐపీఎల్లో దుమ్మురేపిన టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో గిల్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ నేపధ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు గిల్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొనేందుకు గిల్ కచ్చితంగా ఇబ్బంది పడతాడని చాపెల్ అభిప్రాయపడ్డాడు. కాగా లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి 11వరకు ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. "గిల్ బ్యాటింగ్ టెక్నిక్‌లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. శుబ్‌మన్ తన ఇన్నింగ్స్ ప్రారంభంలో లైన్ అండ్ లెంగ్త్ బంతులకు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాడు. ముఖ్యంగా ఆఫ్‌స్టంప్ వెలుపుల వేసిన బంతులకు చాలా సార్లు ఔటయ్యాడు. గిల్‌కు గతంలో ఇంగ్లండ్ పరిస్ధితుల్లో ఆడిన అనుభవం ఉంది. కానీ అతడు అంతగా రాణించలేకపోయాడు. అదే విధంగా బంతి కొంచెం ఎక్కువగా బౌన్స్ అయితే గిల్ వికెట్ కీపర్ లేదా స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కెప్టెన్ కమ్మిన్స్, హేజిల్ వుడ్ మంచి లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తే గిల్‌ను తొందరగా పెవిలియన్‌కు పంపవచ్చు. అయితే గిల్ అద్బుతమైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆసీస్ బౌలర్లు సరైన లైన్లో బౌలింగ్ చేయకపోతే అతడిని అపడంచాలా కష్టం మని బ్యాక్ స్టేజ్ విత్ బోరియా షోలో చాపెల్ పేర్కొన్నాడు. చదవండి: ENG vs IRE: బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలోనే తొలి కెప్టెన్‌గా! -
BGT 2023: సొంతగడ్డపై భారత్ బలహీనం.. ఆసీస్‌దే ట్రోఫీ: టీమిండియా మాజీ కోచ్
India Vs Australia BGT 2023 Test Series: ఈసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియానే గెలుస్తుందని ఆ జట్టు మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ అంచనా వేశాడు. స్వదేశంలో టీమిండియాకు కంగారు జట్టు రూపంలో కఠిన సవాల్ ఎదురు కానుందని పేర్కొన్నాడు. కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరం కావడం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందన్న చాపెల్.. దీంతో సొంతగడ్డపై టీమిండియా మరింత బలహీనం కానుందని చెప్పుకొచ్చాడు. కాగా 2020లో ఆసీస్ గడ్డపై టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫిబ్రవరి 9 నుంచి ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో ఇరు జట్లు మరోసారి పోటీ పడనున్నాయి. అయితే, ఆసీస్ సూపర్ ఫామ్‌లో ఉన్నప్పటికీ.. సొంత దేశంలో రోహిత్ సేననే ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. స్పిన్ పిచ్‌లపై ఆడేందుకు ఇబ్బందిపడే ఆసీస్ బ్యాటర్లను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టడం ఖాయమని గత ఫలితాలను బట్టి చెప్పవచ్చు. వాళ్లు లేరు.. టీమిండియా బలహీనం ఈ నేపథ్యంలో గతంలో భారత జట్టుకు మార్గదర్శనం చేసిన గ్రెగ్ చాపెల్ మాత్రం భిన్నంగా స్పందించాడు. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడిన కారణంగా సొంతగడ్డపై కూడా టీమిండియా బలహీనంగానే కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే వాళ్లు పూర్తిగా విరాట్ కోహ్లిపైనే పూర్తిగా ఆధారపడతారు. ఆసీస్‌దే ట్రోఫీ భారం మొత్తం అతడిదే. ఈసారి ఆస్ట్రేలియానే సిరీస్ గెలుస్తుంది’’ అని జోస్యం చెప్పాడు. ఇక ఆస్ట్రేలియా స్పిన్ విభాగం గురించి మాట్లాడుతూ.. ‘‘అక్కడి పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈసారి అష్టన్ అగర్‌కు ఎక్కువ అవకాశాలు లభిస్తాయనుకుంటున్నా. నాథన్ లియోన్‌తో కలిసి ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ రాణించగలడు’’ అని గ్రెగ్ చాపెల్ అన్నాడు. కాగా భారత జట్టుకు 2005-2007 మధ్యకాలంలో చాపెల్ హెడ్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. చదవండి: T20 WC: వచ్చే వరల్డ్‌కప్‌లో కోహ్లి ఆడతాడు.. కానీ రోహిత్ ఉండడు.. అవసరం కూడా లేదు! Gill-Kohli: 'నీకు పదేళ్లు ఇస్తా.. సగం అయినా పట్టగలవేమో చూస్తా' -
కోహ్లి బ్యాటింగ్.. 'దేవుడే పాట పాడినంత మధురంగా'
టి20 వరల్డ్ కప్ లో టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రదర్శన మాజీ క్రికెటర్లను కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం గ్రెగ్ చాపెల్ (74) కూడా కోహ్లీ ఆటకు ఫిదా అయ్యాడు. పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ బ్యాటింగ్ చూస్తే దేవుడు పాట పాడినంత మధురంగా అనిపించిందని చాపెల్ కొనియాడాడు. సిడ్నీ హెరాల్డ్ పత్రిక కాలమ్‌లో చాపెల్ కోహ్లి గురించి ఆసక్తికరంగా రాసుకొచ్చాడు. ''ఎంతో నైపుణ్యం ఉన్న పాక్ బౌలింగ్ లైనప్ ను కవ్విస్తూ సాగిన కోహ్లీ బ్యాటింగ్ మెల్బోర్న్ మైదానంలో అందంగా ఆవిష్కృతమైంది. ప్రత్యర్థి బౌలింగ్ దాడులను ఇంత నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసిన ఆటగాడు మునుపటి తరంలోనూ ఎవరూ లేరు. నాకు తెలిసినంత వరకు కోహ్లీ భారత క్రికెట్లో అత్యంత పరిపూర్ణమైన ఆటగాడు. గొప్ప చాంపియన్లు అనదగ్గ ఆటగాళ్లు మాత్రమే కోహ్లీలాగా తెగువను, యుక్తిని కలగలిపి ఆడగలరు. పాతతరం ఆటగాడైన టైగర్ పటౌడీ ఈ విషయంలో కోహ్లీకి దరిదాపుల్లోకి వస్తాడంటూ'' పేర్కొన్నాడు. చదవండి: 'బుమ్రాకు ఇది ఆలోచించుకోవాల్సిన సమయం' -
తననెంతో ఇబ్బంది పెట్టిన కోచ్‌కు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన గంగూలీ
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ.. టీచర్స్ డే (సెప్టెంబర్ 5) సందర్భంగా తన క్రికెట్ గురువులకు శుభాకాంక్షలు తెలిపాడు. దాదా ట్విటర్ వేదికగా తన ఇష్ట గురువులను (కోచ్‌లు) గుర్తు చేసుకుంటూ 'దాదా ఫేవరెట్ టీచర్' అనే ఓ వీడియోను షేర్ చేశాడు. టీచర్స్ డే సందర్భంగా దాదా స్మరించుకున్న వారిలో అతని చిన్ననాటి కోచ్ దివంగత దెబో మిత్రా, తన ఇష్టమైన కోచ్ జాన్ రైట్, టీమిండియా అత్యంత విజయవంతమైన కోచ్ గ్యారీ కిర్‌స్టన్ అలాగే టీమిండియా వివాదాస్పద కోచ్ గ్రెగ్ చాపెల్ ఉన్నారు. వీరందరికీ దాదా టీచర్స్ డేను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపాడు. Major missing Debo Mitra, John Wright, my favourite one ,Gary Kirsten and Greg. Happy Teachers' Day! There are few moments in life that make you relive your past, here's to my failures & bouncing back. Watch here: https://t.co/xNIlW4EdZa#TeachersDay — Sourav Ganguly (@SGanguly99) September 5, 2022 కాగా, గంగూలీ గుర్తు చేసుకున్న నలుగరు కోచ్‌ల్లో గ్రెగ్ చాపెల్ పేరును ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. చాపెల్ టీమిండియా కోచ్‌గా పని చేస్తున్న కాలంలో (2003 ప్రపంచకప్ తర్వాత) దాదాను ఎంతో ఇబ్బందిపెట్టాడు. ఓ దశలో కోచ్ మాటలు విని దాదాను జట్టు నుంచి కూడా తప్పించారు. చాపెల్ కారణంగా టీమిండియాలో విభేదాలు రచ్చకెక్కాయి. ఆటగాళ్లు రెండు గ్రూపులుగా (గంగూలీ, చాపెల్) విడిపోయి ఆటను గాలికొదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంగూలీ చాపెల్ పేరును ప్రస్తావిస్తూ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: లంకతో సమరం.. పంత్, చహల్‌లను పక్కకు పెట్టడమే ఉత్తమం..! -
కొందరు పగబట్టారు.. అందుకే టీమిండియా కెప్టెన్ కాలేకపోయా!
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ డాషింగ్ ఆల్‌రౌండర్‌గా అందరికి సుపరిచితమే. టీమిండియా సాధించిన రెండు మేజర్ వరల్డ్‌కప్స్(2007 టి20, 2011 వన్డే) జట్టులో యువీ సభ్యుడిగా ఉన్నాడు. దీంతోపాటు మరెన్నో ఘనతలు సాధించిన యువరాజ్ టీమిండియాకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా పనిచేయలేదు. మధ్యలో కొన్నిరోజులు జట్టుకు వైస్‌కెప్టెన్‌గా మాత్రమే ఉన్నాడు. తాజాగా కెప్టెన్‌గా అవకాశం రాకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొందరు తనపై పగబట్టారని.. అందుకే టీమిండియాకు కెప్టెన్ కాలేకపోయానని యువీ పేర్కొన్నాడు. మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో యువరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ''గ్రెగ్ చాపెల్ ఉదంతం నన్ను టీమిండియా కెప్టెన్సీ నుంచి దూరం చేసింది. చాపెల్ 2005 నుంచి 2007 మధ్య కాలంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్నాడు. ఈ సమయంలో అతను తీసుకున్న కొన్న నిర్ణయాలపై జట్టులో అప్పటికే సీనియర్లు అయిన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు తప్పుబట్టారు. ముఖ్యంగా 2007 వరల్డ్‌కప్‌కు ముందు బ్యాటింగ్ ఆర్డ్ర్ను మార్చేయడం జట్టు సమతుల్యాన్ని దెబ్బతీసింది. ఓపెనర్‌గా సూపర్ సక్సెస్ అయిన సచిన్‌ను మిడిలార్డర్లో ఆడించడం.. గంగూలీతో చాపెల్‌కు పొసగకపోవడం.. దాదా రిటైర్ అవ్వడానికి.. 2007 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఘోర వైఫల్యం వెనుక చాపెల్ పాత్ర చాలా ఉందని సచిన్: బిలియన్ డ్రీమ్స పుస్తకంలో రాసి ఉంటుంది. ఇదే చాపెల్ ఉదంతం నన్ను కెప్టెన్సీకి దూరం చేసింది. 2007లో ఇంగ్లండ్ టూర్‌కు సెహ్వాగ్ అందుబాటులో లేడు. దీంతో ద్రవిడ్ కెప్టెన్‌గా.. నేను వైస్ కెప్టెన్‌గా ఉన్నాం. ఆ తర్వాత జట్టులోని సీనియర్లకు, చాపెల్‌కు విబేధాలు రావడం.. నేను మా టీమ్‌ను సపోర్ట్ చేయడం కొంతమంది బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు. ఒక దశలో నేను తప్ప ఎవరు కెప్టెన్‌గా ఉన్నా మాకు అభ్యంతరం లేదని కొందరు అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికి పరోక్షంగా కొందరు నాపై పగబట్టారు.. అందుకే కెప్టెన్ కాలేకపోయా. వాస్తవానికి 2007 టి20 ప్రపంచకప్‌కు నేను కెప్టెన్ అవ్వాల్సింది. అయితే మేనేజ్మెంట్ నుంచి సపోర్ట్ లేకపోవడం వల్ల మహీ భాయ్ కెప్టెన్ కావడం.. తొలిసారే టైటిల్ గెలవడం జరిగిపోయాయి. ఇందులో ధోని భయ్యాను నేను తప్పుబట్టలేను. మేనేజ్మెంట్ నిర్ణయం ప్రకారం ధోని కెప్టెన్ అయ్యాడు.. మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు.. టీమిండియాకు మూడు మేజర్ ట్రోపీలను అందించాడు. అతని కెప్టెన్సీలో ఆడడం నేను చేసుకున్న అదృష్టం'' అని చెప్పుకొచ్చాడు. ఇక యువరాజ్ తన 17 ఏళ్ల కెరీర్లో 40 టెస్టుల్లో 1900 పరుగులు, 304 వన్డేల్లో 8,701 పరుగులు, 58 టి20ల్లో 1177 పరుగులు సాధించాడు. వన్డేల్లో 14 సెంచరీలు అందుకున్న యువరాజ్ టెస్టుల్లో మూడు సెంచరీలు సాధించాడు. చదవండి: Chris Gayle: 'సరైన గౌరవం దక్కలేదు'.. యునివర్సల్ బాస్ సంచలన వ్యాఖ్యలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WI Vs Eng 2nd Test: జో రూట్ అరుదైన సెంచరీ.. దిగ్గజాలను వెనక్కి నెట్టి..
WI Vs Eng 2nd Test- Joe Root: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ తన కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. 25వ టెస్టు సెంచరీ నమోదు చేశాడు. వెస్టిండీస్‌తో బార్బడోస్‌లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఈ ఫీట్ అందుకున్నాడు. తద్వారా టెస్టుల్లో 24 సెంచరీలు నమోదు చేసిన గ్రెగ్ చాపెల్, వివియన్ రిచర్డ్స్ వంటి దిగ్గజాలు, మహ్మద్ యూసఫ్, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ వంటి క్రికెటర్లను వెనక్కి నెట్టాడు. వీరి కంటే రూట్ ఒక అడుగు ముందు వరుసలో నిలిచాడు. ఈ క్రమంలో బ్యాట్‌తో అభివాదం చేస్తూ మైదానంలోని అభిమానులతో రూట్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇందుకు స్పందనగా అతడి పేరును పాటగా ఆలపిస్తూ ఫ్యాన్స్ అభినందనలు తెలిపారు. కాగా విండీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జాక్ క్రాలే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో వనౌడౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ రూట్ 246 బంతుల్లో 119 పరుగులు(నాటౌట్) సాధించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. మరో ఓపెనర్ అలెక్స్ లీస్ 30 పరుగులు చేసి నిష్క్రమించగా.. క్రీజులోకి వచ్చిన డానియెల్ లారెన్స్ 91 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. చదవండి: MS Dhoni: నెంబర్-7 మిస్టరీ వెనుక మనం ఊహించని ట్విస్ట్ IPL 2022- Suresh Raina: రైనా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఎట్టకేలకు ఐపీఎల్లో ఎంట్రీ! అయితే.. An incredible reception 👏 For our incredible leader 🙌 Scorecard: https://t.co/d2gy5BUkWH 🏝 #WIvENG 🏴 | @Root66 pic.twitter.com/eCLdTVXba2 — England Cricket (@englandcricket) March 16, 2022 View this post on Instagram A post shared by ICC (@icc) An incredible reception 👏 For our incredible leader 🙌 Scorecard: https://t.co/d2gy5BUkWH 🏝 #WIvENG 🏴 | @Root66 pic.twitter.com/eCLdTVXba2 — England Cricket (@englandcricket) March 16, 2022 -
నాడు క్రికెట్‌కు పనికిరాడన్నారు.. రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు
న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో సెన్సేషనల్ బ్యాటింగ్‌తో (69 నాటౌట్) టీమిండియాకు అద్భుత విజయాన్నందించిన దీపక్ చాహర్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్న వేళ భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. చాహర్.. తన 16వ ఏట (2008) రాజస్థాన్ క్రికెట్ అకాడమీలో చోటు దక్కించుకున్న సమయంలో అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న గ్రెగ్ చాపెల్.. అతని బౌలింగ్ సామర్థ్యాన్ని శంకిస్తూ, క్రికెట్‌కు పనికిరాడని రిజెక్ట్ చేశాడని పేర్కొన్నాడు. గ్రెగ్ చాపెల్ స్థాయి వ్యక్తి బౌలింగ్‌లో పసలేదని, క్రికెట్లో భవిష్యత్తు లేదని చెప్పడంతో చాహర్ నైరాశ్యంలోకి కూరుకుపోయాడని, అయితే తండ్రి లోకేంద్ర సింగ్ చాహర్ సహకారంతో తిరిగి గాడిలో పడ్డాడని వివరించాడు. కాగా, నాడు చాపెల్.. దీపక్ చాహర్‌పై చేసిన వ్యాఖ్యలపై వెంకటేశ్ ప్రసాద్ స్పందిస్తూ.. విదేశీ కోచ్‌లు చెప్పినవన్నీ గుడ్డిగా నమ్మకూడదని, వాళ్లు చెప్పిన విషయాలన్నీ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు. ఎత్తు కారణంగా నాడు క్రికెట్‌కు పనికిరాడన్న వ్యక్తి.. రాత్రికి రాత్రి హీరో అయిపోయాడని, అదే చాపెల్ మాటలు నమ్మి సెలెక్టర్లు చాహర్‌కు అవకాశం ఇచ్చుండకపోయుంటే టీమిండియా ఓ గొప్ప ఆల్‌రౌండర్ సేవలను కోల్పోయేదని తెలిపాడు. ఇకనైనా బీసీసీఐ.. విదేశీ కోచ్‌లపై మోజును తగ్గించుకోవాలని, వాళ్ల మాటలపైనే పూర్తిగా ఆధారపడకుండా ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను పోత్సహించాలని సూచించాడు. విదేశీ కోచ్‌లతో పోలిస్తే, స్వదేశీ కోచ్‌లకు భారత యువ క్రికెటర్లపై మంచి అవగాహన ఉంటుందని, అందుకే బీసీసీఐతో పాటు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు స్వదేశీ కోచ్‌లకు తగినన్ని అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. ఇదిలా ఉంటే, లంకతో జరిగిన రెండో వన్డేలో చాహర్ తన ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించిన విషయం తెలిసిందే. -
ద్రవిడ్ కెప్టెన్ కావడం వారికి ఇష్టం లేదు.. అందుకే అలా చేశారు
సిడ్నీ: టీమిండియా కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్ ఎంపికైనప్పుడు.. అతనికి జట్టు సభ్యులెవ్వరూ సహకరించలేదని, ముఖ్యంగా సీనియర్లకు ద్రవిడ్ కెప్టెన్ కావడం అస్సలు ఇష్టం లేదని భారత జట్టుకు 2005-2007 మధ్యకాలంలో కోచ్‌గా వ్యవహరించిన గ్రెగ్ చాపెల్ సంచలన ఆరోపణలు చేశాడు. ద్రవిడ్ తన సారథ్యంలో భారత్‌ను నెంబరవన్ జట్టుగా తీర్చిదిద్దాలనుకున్నాడని, కానీ సహచర ఆటగాళ్ల మద్దతు అతని లభించలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా 2007 వన్డే ప్రపంచకప్‌లో ద్రవిడ్ సారథ్యంలో భారత జట్టు దారుణంగా విఫలమైన విషయాన్ని ప్రస్తావించాడు. వెస్టిండీస్ వేదికగా జరిగిన ఆ మెగా టోర్నీలో భారత్ కనీసం సూపర్-8కు కూడా అర్హత సాధించకుండా నిష్క్రమించింది. తన హయాంలో కెరీర్ చివరి దశకు చేరిన సీనియర్లు జట్టులో స్థానం కాపాడుకోవడంపైనే దృష్టి సారించే వారని, వారికి జట్టు ప్రయోజనాలు అస్సలు పట్టేవి కావని ఆయన ఆరోపించాడు. అయితే గంగూలీపై వేటు పడటంతో ఆటగాళ్ల వైఖరిలో మార్పు వచ్చిందన్నాడు. గంగూలీకి జట్టు ప్రయోజనాల కంటే తన కెప్టెన్సీపైనే ఎక్కువ మక్కువ ఉండేదని సంచలన ఆరోపణలు చేశాడు. గంగూలీ వల్లే తనకు టీమిండియా కోచ్‌గా పనిచేసే అవకాశం దక్కిందని వెల్లడించాడు. రెండేళ్ల పదవీ కాలం ముగిశాక కూడా తననే కోచ్‌గా కొనసాగమని బీసీసీఐ కోరిందని, కానీ ఆ ఒత్తిడి అవసరం లేదని స్వచ్చందంగా తప్పుకున్నాని చెప్పుకొచ్చాడు. కాగా, ద్రవిడ్ నేతృత్వంలో భారత జట్టు 25 టెస్ట్‌లు, 79 వన్డేలు ఆడి 50 విజయాలందుకుంది. ఇదిలా ఉంటే, గ్రెగ్ చాపెల్ పర్యవేక్షణలోని టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అతను చేసిన ప్రయోగాలన్నీ బెడిసి కొట్టాయి. అప్పటికే బౌలింగ్‌లో మెరుగ్గా రాణిస్తున్న ఇర్ఫాన్ పఠాన్‌ను ఓపెనర్‌గా పంపి.. అతడి కెరీర్ నాశనానికి కారకుడయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఎన్నో మార్పులు చేశాడు. ఇక గంగూలీ కెప్టెన్సీ చేజారడం, తుది జట్టులో స్థానం కోల్పోవడం వంటి సంఘటనలు అతని హయాంలోనే చోటు చేసుకున్నాయి. దీంతో 2007 ప్రపంచకప్‌లో భారత్.. పసికూన బంగ్లాదేశ్‌తో పాటు శ్రీలంక చేతిలో కూడా ఓడి అత్యంత అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక చాపెల్‌ను టీమిండియా కోచ్‌గా తీసుకురావడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పని గంగూలీ తన ఆత్మ కథ ‘ఏ సెంచరీ నాట్ ఏ ఎనఫ్'లో రాసుకొచ్చాడు. చదవండి: కుంబ్లే కారణంగా అనేక నిద్రలేని రాత్రులు గడిపాను.. -
గంగూలీది కష్టపడే తత్వం కాదు.. కానీ: చాపెల్
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ మరోసారి సౌరవ్ గంగూలీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గంగూలీది కష్టపడే తత్వం కాదని, కెప్టెన్‌గా ఎప్పుడూ పెత్తనం చెలాయించడమే తనకు ఇష్టమని వ్యాఖ్యానించాడు. కాగా 2005- 2007 మధ్య కాలంలో గ్రెగ్ చాపెల్ భారత క్రికెట్ జట్టు కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ రెండేళ్లలోనే, అప్పటి టీమిండియా సారథి గంగూలీ, చాపెల్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా, చాపెల్ హయాంలోనే గంగూలీ కెప్టెన్సీ చేజారడం, ఆటగాడిగా తుదిజట్టులో కూడా చోటు దక్కకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. దీంతో వీరిద్దరు ఇప్పటికే ఎన్నోసార్లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో, తన ఆత్మకథ ఏ సెంచరీ 'ఈజ్ నాట్ ఎనఫ్'లో తన క్రికెట్ కెరీర్లో చేసిన అతి పెద్ద పొరపాటు ఏదైనా ఉందంటే అది ఆసీస్ మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్‌ను కావాలని కోచ్‌గా నియమించుకోవడమేనని పేర్కొన్నాడు. అదే విధంగా, తన మానసిక స్థితి బాలేదంటూ బీసీసీఐకి చాపెల్ రాసిన లేఖ వల్ల తన కెరీర్ నాశనమైందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక చాపెల్ సైతం వీలు చిక్కినప్పుడల్లా గంగూలీని విమర్శిస్తూనే ఉన్నాడు. తాజాగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఆ రెండేళ్ల పాటు ఎటువైపు చూసినా కఠిన సవాళ్లే. అంచనాలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు సౌరవ్ కెప్టెన్సీ గురించి చర్చ. నిజానికి తనది కఠినంగా శ్రమించే తత్వం కాదు. అయితే, కెప్టెన్‌గా మాత్రం తానే ఉండాలనుకునేవాడు. అలా అయితే, పరిస్థితులన్నీ తన అదుపులోనే ఉంటాయన్న భావన తనది’’ అని వ్యాఖ్యానించాడు. అయితే, మొదట్లో గంగూలీతో తనకు సఖ్యత ఉందన్న చాపెల్.. ‘‘టీమిండియా కోచ్‌గా రమ్మని మొదట గంగూలీయే నన్ను సంప్రదించాడు. నాకు కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రపంచంలోని పటిష్టమైన దేశపు జట్టుతో పనిచేయాలని ఉండేది. గంగూలీ వల్లే నాకు ఆ అవకాశం దక్కిందని కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నాడు. చదవండి: T20 World Cup: భారత్‌లో వద్దు.. వేదిక మార్చండి: హస్సీ -
మమ్మల్ని చూసే ద్రవిడ్ అలా...
సిడ్నీ: గత కొన్నేళ్లలో భారత క్రికెట్ జట్టు విదేశాల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా వరుసగా రెండుసార్లు ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి బోర్డర్–గావస్కర్ ట్రోఫీని గెలుచుకోవడం పెద్ద విశేషం. ఈ విజయాల వెనక భారత ‘ఎ’ జట్టు కోచ్‌గా యువ ఆటగాళ్లను తీర్చి దిద్దిన రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉంది. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా దిగ్గజం గ్రెగ్ చాపెల్ గుర్తు చేస్తున్నాడు. గతంలో తమ దేశంలో ఇలాంటి పటిష్టమైన వ్యవస్థ ఉండేదని... దానిని స్ఫూర్తిగా తీసుకొని ద్రవిడ్ భారత్‌లో ఫలితాలు సాధిస్తే తమ టీమ్ మాత్రం వెనుకబడిపోయిందని అతను అభిప్రాయపడ్డాడు. ‘చరిత్రను చూస్తే యువ ఆటగాళ్లను తీర్చిదిద్ది సీనియర్ టీమ్‌లోకి వచ్చేసరికి రాటుదేల్చే గొప్ప వ్యవస్థ ఆస్ట్రేలియా క్రికెట్లో ఉంది. కానీ గత రెండేళ్లుగా పరిస్థితి మారింది. ఎంతో మంది ప్రతిభావంతులైన కుర్రాళ్లను నేను చూశాను. కానీ వారు దారితెన్నూ లేనట్లు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే విషయంలో ఆస్ట్రేలియా ఇప్పటికే వెనుకబడిపోయింది. ఇంగ్లండ్ ఇందులో బాగా పని చేస్తుండగా భారత్ కూడా ఆసీస్‌ను వెనక్కి నెట్టేసింది. భారత్‌లో దీనిని రాహుల్ ద్రవిడ్ సమర్థంగా అమలు చేస్తున్నాడు. నిజానికి అతను ఆస్ట్రేలియాలో ఉన్న వ్యవస్థను చూసి నేర్చుకొని భారత్‌లో దానిని తీర్చిదిద్దాడు’ అని చాపెల్ వ్యాఖ్యానించాడు. -
'ఆ ఆలోచన సచిన్‌దే.. చాపెల్‌ది కాదు'
ముంబై : తనను బ్యాట్స్‌మన్‌గా ప్రమోట్ చేసింది సచినే తప్ప గ్రెగ్ చాపెల్ కాదని టీమిండియా మాజీ స్వింగ్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. 2005లో శ్రీలంకలో నాగ్‌పూర్‌తో జరిగిన తొలి వన్డేలో ఇర్ఫాన్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగి చెలరేగిపోయాడు. 70 బంతుల్లో 83 పరుగుతో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 152 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఆ తర్వాత పలుమార్లు పఠాన్ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగాడు. తాజాగా ఒక ఇంటర్య్వూలో పాల్గొన్న పఠాన్ మరోసారి ఆ విషయాలను గుర్తు చేసుకున్నాడు.('అలా అనుకుంటే కోహ్లి స్థానంలో రోహిత్ ఉంటాడు') 'నేను నా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఇదే విషయాన్ని చెప్పాను. నన్ను ఆల్‌రౌండర్‌గా మూడో స్థానంలో పంపి గ్రేగ్ చాపెల్ నా కెరియర్ను నాశనం చేశాడని చాలా మంది భావిస్తారు. అయితే, నిజానికి నన్ను మూడో నంబరులో పంపాలన్నది సచిన్ ఆలోచన. నన్ను ఆ స్థానంలో పంపాలని ద్రవిడ్‌కు సచిన్ సూచించాడు. అతడికి సిక్సర్లు కొట్టే సత్తా ఉంది. కొత్త బంతిని ఎదుర్కోగలడు. ఫాస్ట్ బౌలర్లను చక్కగా ఆడగలడు అని కూడా చెప్పాడు.' అంటూ పఠాన్ పేర్కొన్నాడు.(‘మనకోసం మరో వైరస్‌ను సిద్ధం చేశారు’) గ్రెగ్ చాపెల్ టీమిండియా కోచ్‌గా 2005లో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇర్ఫాన్ పఠాన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. చాపెల్ అతడిని ఉత్తమమైన ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాడు. అయితే చాపెల్ సూచనలతో ఇర్ఫాన్ పూర్తిగా తన అసలు ఆట స్వభావాన్ని పూర్తిగా మర్చిపోయాడు. కెరీర్ ఆరంభంలో అతడిలో ఎలాంటి బౌలింగ్ చూశామో ఆ వేడి క్రమక్రమేనా తగ్గుతూ వచ్చింది. బౌలింగ్ కంటే బ్యాటింగ్‌పై పఠాన్ దృష్టి పెట్టేలా చేశాడు చాపెల్. దీంతో ఓ సమయంలో పఠాన్ బౌలర్ కంటే బ్యాట్స్‌మన్‌గా మారిపోయాడు. ఓ దశలో పఠాన్ బ్యాట్స్‌మనా లేక బౌలరా అనే సందిగ్దత నెలకొంది. అయితే చాపెల్ కోచ్‌గా తప్పుకున్న తర్వాత తిరిగి బౌలింగ్‌పై దృష్టి పెట్టిన ఈ బరోడా క్రికెటర్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. పఠాన్ టీమిండియా తరఫున 29 టెస్టుల్లో 100 వికెట్లు, 120 వన్డేల్లో 173వికెట్లు, 24 టీ20ల్లో 28వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ ఏడాది జనవరిలోనే క్రికెట్‌కు ఇర్ఫాన్ పఠాన్ వీడ్కోలు పలికాడు. -
ధోనిని కొట్టమని.. మమ్మల్ని అవతలికి కొట్టావా!
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్‌తో మన క్రికెటర్ల విభేదాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ దగ్గర్నుంచీ ఇర్ఫాన్ పఠాన్ వరకూ అందర్నీ శాసించాలని ఉద్దేశంతో ఉండేవాడు చాపెల్. గంగూలీ గొడవ, ఆటగాళ్ల మధ్య విభేదాలు, జట్టులో గ్రూపులు ఏర్పాటుకు చాపెల్ కారణమయ్యాడనే అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 2005, మే నెల నుంచి 2007 వరకూ టీమిండియా ప్రధాన కోచ్‌గా పని చేసిన చాపెల్ ఒక నియంత ధోరణిలో వ్యవహరించేవాడు. తన మాటే నెగ్గాలనే పట్టుదలతో మొండిగా నిర్ణయాలు తీసుకునేవాడు. అయితే చాపెల్ తాజాగా చేసిన ఒక కామెంట్ ఇప్పుడు టీమిండియా వెటరన్లకు కోపం తెప్పించింది. (‘క్రికెట్ చరిత్రలో ధోనినే పవర్ఫుల్’) ధోని గొప్ప ఫినిషర్‌గా ఎదగడానికి తానే కారణమని చెప్పుకున్న చాపెల్‌పై యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2005లో జైపూర్ వేదికగా ధోని సాధించిన 183 పరుగులకు తానే కారణమని చాపెల్ చెప్పుకురావడం యువీ, భజ్జీల కోపానికి కారణమైంది. గ్రౌండ్లో ప్రతీ బంతిని హిట్ చేయమని చెప్పడానికి బదులు గ్రౌండ్ నాలుగు వైపులా ఆడమని తాను ఇచ్చిన ధోనిని గొప్ప ఫినిషర్‌ను చేసిందని చాపెల్ పేర్కొనడాన్ని వీరు తప్పుబడుతున్నారు. ‘ ధోనిని గ్రౌండ్ షాట్లు ఆడమని చాపెల్ చెప్పాడట. అది మమ్మల్ని మమ్మల్ని గ్రౌండ్ అవతలికి విసిరేయడానికేనా. చాపెల్ చాలా రకాల గేమ్స్ ఆడాడు’ అని భజ్జీ విమర్శించాడు. తన క్రికెట్ కెరీర్‌ను ఓవరాల్‌గా చూస్తే చాపెల్‌తో భాగమైన రోజులే అత్యంత చెత్త అని హర్భజన్ పేర్కొన్నాడు. ఇక యువరాజ్ సింగ్ సైతం చాపెల్ చేసిన కామెంట్‌పై విరుచుకుపడ్డాడు. ‘నువ్వు ఏ రోజు బంతిని హిట్ చేయమని చెప్పిన దాఖలాలు లేవు. చివరి పది ఓవర్లలో కూడా హిట్టింగ్ చేయవద్దనే అన్నావ్. ధోనితో పాటు నన్ను కూడా ఆఖరి పది ఓవర్లలో కేవలం గ్రౌండ్ షాట్లకే పరిమితం చేశావ్’ అని చాపెల్ కోచింగ్ తీరును ప్రశ్నించాడు. (కరోనా సంక్షోభం తర్వాత తొలి క్రికెట్ లీగ్) ధోని అంతర్జాతీయ కెరీర్ ఆరంభించిన తొలి నాళ్లలో భారత్ కోచ్‌గా చాపెల్ వ్యవహరించాడు. ఆనాటి విశేషాలను ‘ప్లేరైట్ ఫౌండేషన్’ నిర్వహించిన ఆన్లైన్ చాట్‌లో పంచుకున్న చాపెల్..ధోనిని ఆకాశానికెత్తేశాడు. క్రికెట్ చరిత్రలో ధోనినే పవర్ఫుల్ బ్యాట్స్‌మన్ అంటూ కీర్తించాడు. ఈ మేరకు 2005లో శ్రీలంకపై ధోని సాధించిన 183 పరుగుల్ని నెమరవేసుకున్నాడు. ఈనాటికి ధోని అత్యధిక వన్దే స్కోరుగా ఉన్న అది ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అని పేర్కొన్నాడు. ఆ తర్వాత పుణెలో మ్యాచ్ జరగ్గా, ధోనిని హిట్టింగ్ చేయొద్దని చెప్పినట్లు పేర్కొన్నాడు. కేవలం గ్రౌండ్ షాట్లు కొట్టమని చెప్పానని, అదే ధోనిని గొప్ప ఫినిషర్‌గా చేసిందన్నాడు. He asked Dhoni to play along the ground coz coach was hitting everyone out the park.. He was playing different games 😜#worstdaysofindiancricketundergreg 😡😡😡 https://t.co/WcnnZbHqSx — Harbhajan Turbanator (@harbhajan_singh) May 13, 2020 🤣 Msd and Yuvi no sixes in the last 10 play down the ground — yuvraj singh (@YUVSTRONG12) May 13, 2020 -
‘క్రికెట్ చరిత్రలో ధోనినే పవర్ఫుల్’
సిడ్నీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ప్రశంసలు కురిపించాడు. తాను చూసినంత వరకూ క్రికెట్ చరిత్రలో ధోనినే పవర్ఫుల్ బ్యాట్స్‌మన్ అంటూ కొనియాడాడు. దీనిలో భాగంగా ధోని ఆడిన కొన్ని అరుదైన ఇన్నింగ్స్‌లను చాపెల్ గుర్తు చేసుకున్నాడు. ధోని అంతర్జాతీయ కెరీర్ ఆరంభించిన తొలి నాళ్లలో భారత్ కోచ్‌గా చాపెల్ వ్యవహరించాడు. ఆనాటి విశేషాలను ‘ప్లేరైట్ ఫౌండేషన్’ నిర్వహించిన ఆన్లైన్ చాట్‌లో పంచుకున్న చాపెల్..ధోనిని ఆకాశానికెత్తేశాడు. క్రికెట్ చరిత్రలో ధోనినే పవర్ఫుల్ బ్యాట్స్‌మన్ అంటూ కీర్తించాడు. ఈ మేరకు 2005లో శ్రీలంకపై ధోని సాధించిన 183 పరుగుల్ని నెమరవేసుకున్నాడు. ఈనాటికి ధోని అత్యధిక వన్దే స్కోరుగా ఉన్న అది ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అని పేర్కొన్నాడు. (కోహ్లి సాధిస్తాడా!.. అనుమానమే?) ‘క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోని మించి బంతిని బలంగా బాదే ఆటగాడు మరొకరు లేరు. అతడు జట్టులోకి వచ్చిన కొత్తలోనే ఓ మంచి ఆటగాడిని ప్రపంచం చూడబోతుందని భావించా. అందుకు తగ్గట్లే అతడు కెరీర్ తొలినాళ్లలోనే శ్రీలంకపై 183 పరుగులు చేసి సత్తాచాటుకున్నాడు. ఆ మ్యాచ్‌లో అతడాడిన షాట్లకు నేను ఫిదా అయ్యాను. అది జైపూర్‌లో జరిగిన మ్యాచ్. ఆ తర్వాత పుణెలో మ్యాచ్ జరిగింది. అందులో భారీ షాట్లు ఆడాల్సి అవసరం లేదు. సాధారణ స్కోరు మాత్రమే మన ముందుంది. ధోని క్రీజ్‌లోకి వెళ్లే సమయానికి మాకు 80 నుంచి 100 పరుగులు మాత్రమే చేయాలి అనుకుంటా. అప్పుడు ధోనితో చెప్పా. గ్రౌండ్ నలుమూలలకు ఆడుతూ స్టైక్ రొటేట్ చేయమన్నా. (‘కెప్టెన్సీ పంచుకోవడం కోహ్లికి నచ్చదు’) అప్పుడు ధోని తన హిట్టింగ్‌ను వదిలేసి సింగిల్స్, డబుల్స్‌తో స్కోరు బోర్డును నడిపించాడు. భారత విజయానికి 17 పరుగులు కావాల్సిన తరుణంలో ధోని బ్యాట్ ఝుళిపించాడు. వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను 26 బంతులు ఉండగానే ముగించాడు. ధోని కెరీర్ ఆద్యంతం హిట్టింగ్‌పైనే ఆధారపడి ఉంటే చాలా కోల్పోయేవాడు. పరిస్థితులు తగ్గట్టు ఆడటం అలవాటు చేసుకున్నాడు కాబట్టే ధోని గ్రేట్ బ్యాట్స్‌మన్ అయ్యాడు.. అదే సమయంలో బెస్ట్ ఫినిషర్ అయ్యాడు. ధోని బంతిని బలంగా కొట్టేంతగా మరే క్రికెటర్ కొట్టడం నేను ఇంతవరకూ చూడలేదు. ఆనాటి నా సలహా ధోనిని గ్రేట్ ఫినిషర్‌గా మార్చేందనే అనుకుంటున్నా’ అని చాపెల్ పేర్కొన్నాడు. లంకేయులతో పుణె మ్యాచ్‌లో ధోని 43 బంతుల్లో 45 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో ఒక ఫోర్, రెండు సిక్స్‌లు మాత్రమే ఉన్నాయి. అది మ్యాచ్ ఫినిష్ చేసే క్రమంలో కొట్టినవే. శ్రీలంక నిర్దేశించిన 262 పరుగుల ఛేదనను భారత్ 45.4 ఓవర్లలో ఛేదించింది. -
‘భారత్ వద్దనుకుంటే టెస్ట్ క్రికెట్ అంతం’
చంఢీఘడ్ : కరోనా మహమ్మారితో టెస్ట్ క్రికెట్ ప్రమాదంలో పడిందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ అన్నాడు. భారత్వద్దనుకుంటే టెస్ట్ ఫార్మాట్అంతరించిపోయే స్థితికి చేరేలా ఉందని ప్లేవ్రైట్ ఫౌండేషన్ నిర్వహించిన ఫేస్బుక్లైవ్లో అన్నాడు. ఈ లైవ్‌లో ప్రముఖ కామెంటేటర్ చారు శర్మతోపాటూ ప్లేవ్రైట్ వ్యవస్థాపకులు వివేక్ ఆత్రేయ్ పాల్గొన్నారు. టెస్ట్ క్రికెట్‌ను పునరుద్ధరించడంలో భారత్కీలకపాత్ర పోషిస్తుందని నమ్ముతున్నానని, భారత్ వద్దనుకుంటే టెస్ట్ క్రికెట్ అంతరించిపోయే ప్రమాదముందని చాపెల్ చెప్పాడు. ‘భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మాత్రమే టెస్ట్ క్రికెట్ ఆడేలా యువకులను ప్రోత్సహిస్తున్నాయి. మిగిలిన దేశాలేవీ అలా చేస్తున్నట్టు కనిపించడం లేదు. టీ20లకు నేను వ్యతిరేకం కాదు. ప్రజలకు ఆ ఫార్మాట్ ద్వారా చేరువవడం సులభం. కాకపోతే టెస్ట్ క్రికెట్‌కు గడ్డు రోజులు వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అయితే టెస్ట్ ఫార్మాటే అత్యుత్తమ క్రికెట్అని టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పడంతో టెస్ట్ క్రికెట్ బతికే ఉంటుందన్న ఆశ కలిగింది’ అని గ్రెగ్ చాపెల్ అన్నాడు. కాగా, భారత క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియన్ గ్రెగ్ చాపెల్ కోచ్‌గా పనిచేసిన రెండేళ్ల కాలం అత్యంత వివాదాస్పదం. జట్టు ప్రదర్శన సంగతి పక్కన పెడితే...ప్రతీ ఆటగాడు ఆ సమయంలో తీవ్ర అభద్రతా భావానికి లోనయ్యాడనేది నిర్వివాదాంశం. చాపెల్ ఎపిసోడ్‌పై మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథలో అనేక అంశాలు వెల్లడించిన విషయం తెలిసిందే. చాపెల్ వ్యవహార శైలిపై ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ పుస్తకంలో ఆయనో రింగ్ మాస్టర్ అని సచిన్ విరుచుకు పడ్డాడు. -
పఠాన్ రిటైర్మెంట్పై గ్రెగ్ చాపెల్ స్పందన
ఇటీవలే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా బౌలర్ ఇర్ఫాన్ పఠాన్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియాలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న చాపెల్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పఠాన్ రిటైర్మెంట్పై స్పందించాడు. జట్టుకు అవసరమైన సమయంలో ఏ పాత్ర పోషించడానికైనా ఈ లెఫ్టార్మ్ బౌలర్ సిద్దంగా ఉండేవాడని కితాబిచ్చాడు. అంతేకాకుండా పఠాన్ అత్యంత ధైర్యవంతుడని అదేవిధంగా నిస్వార్థపరుడని ప్రశంసించాడు. ‘ఇర్ఫాన్ పఠాన్ టెస్టుల్లో సెంచరీ సాధించాడు. అదేవిధంగా వన్డేల్లో శతకానికి దగ్గరగా వచ్చి మంచి ఆల్‌రౌండర్ అని నిరూపించుకున్నాడు. ఇక బౌలింగ్‌లో వన్డేల్లో విశేషంగా రాణించాడు. టెస్టుల్లో కూడా ఆకట్టుకున్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టే విధానం నాకు బాగా నచ్చేది. కరాచీలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ సాధించడం ఇర్ఫాన్ పఠాన్ ఇన్నింగ్స్‌లలో నాకు బాగా నచ్చింది’అని చాపెల్ పేర్కొన్నాడు. ఇక పఠాన్ ఆట గాడితప్పిందని చాపెల్ అడ్డు అదుపు లేని ప్రయోగాలే కారణమని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండర్‌గా తీర్చిద్దిడంలో భాగంగా పఠాన్ చేత ఎక్కువగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేపించడంతో బౌలింగ్ లయ దెబ్బతిన్నదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వీటన్నింటిని పఠాన్ తీవ్రంగా ఖండించాడు. ‘చాపెల్‌పై ఆరోపణలు చేయడమంటే నేను చేసిన తప్పిదాలను కవర్ చేసుకోవడమనే అనుకోవాలి. నేనెప్పుడు స్వింగ్ కోల్పోలేదు. నా కెరీర్ ఆరంభంలో తొలి ఓవరే నాకు బౌలింగ్ ఇచ్చేవారు. కొత్త బంతితో ఎక్కువ స్వింగ్ రాబట్టేవాడిని. ఆ తర్వాత నాకు పది ఓవర్ల తర్వాత బౌలింగ్ ఇచ్చారు. పది ఓవర్ల తర్వాత బంతి చేతికిస్తే స్వింగ్ రాదు కదా. అక్కడే పొరపాటు దొర్లింది. ఆరంభ ఓవర్లలో బంతి ఇవ్వకుండా టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న ఈ మార్పే నా కెరీర్‌ను ఇబ్బందులకు గురిచేసింది’ అంటూ పఠాన్ పేర్కొన్నాడు. ఇక ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా తరుపున 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 306 వికెట్లు తీశాడు. అదే విధంగా 2821 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 11 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. చదవండి: బౌలర్‌గా వచ్చి ఆల్‌రౌండర్‌గా ఎదిగి చివరికి.. ఇర్ఫాన్ పఠాన్ భావోద్వేగ పోస్టు -
బౌలర్‌గా వచ్చి ఆల్‌రౌండర్‌గా ఎదిగి చివరికి..
అతడు జట్టులోకి రావడంతో భారత పేస్ పదును పెరిగిందన్నారు.. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంతో స్వింగ్ సుల్తాన్ అన్నారు.. ఎవరూ ఊహించని విధంగా ఆస్ట్రేలియాను గజగజ వణికించడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు.. పాకిస్తాన్‌ను వారి గడ్డపై గడగడలాడించడంతో ఔరా అన్నారు.. అరవీర భయంకర బ్యాట్‌మెన్ సైతం భయపడే అక్తర్ బౌలింగ్‌లో వీర బాదుడు బాదడంతో సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయారు.. కష్టకాలంలో, అవసరమైన సమయంలో ఓపెనర్‌గా వచ్చి ఆదుకోవడంతో సలాం చేశారు.. కపిల్ దేవ్ తర్వాత టీమిండియాకు దొరికిన ఆల్‌రౌండర్ అన్నారు. బౌలర్‌గా వచ్చి ఆల్‌రౌండర్‌గా ఎదిగి చివరికి టీమిండియాలో కనుమరుగయ్యాడు. అతడే టీమిండియా వెటరన్ క్రికెటర్, స్వింగ్ సుల్తాన్ ఇర్ఫాన్ పఠాన్.. ‘చరిత్రలో నిలిచిపోవాలన్నా, చరిత్ర సృష్టించాలన్నా వందేళ్లు బతకాల్సిన అవసరం లేదు ఒక్క రోజు బతికినా చాలు’ అన్నట్లు ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ సాగింది. అతడు క్రికెట్ ఆడింది కొన్నేళ్లే అయినా ప్రతి నిత్యం వార్తల్లో నిలిచేవాడు. ప్రతి మ్యాచ్‌లో అటు బంతితో.. లేకపోతే బ్యాట్‌తో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్, శ్రీలంక దిగ్గజ బౌలర్ చమింద వాస్ల శైలి పోలి ఉండే అతడి బౌలింగ్ అందరినీ ఆకట్టుకునేది. ఇర్ఫాన్ లాంటి బౌలర్లు తమ గల్లీకొకడు ఉన్నాడన్న పాక్ క్రికెటర్ల వెకిలి చేష్టలకు తన ఆటతో దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు. ఏకంగా టెస్టుల్లో తొలి ఓవర్లోనే హ్యాట్రిక్(సల్మాన్ భట్, యునిస్ ఖాన్, మహ్మద్ యూసఫ్) వికెట్ సాధించిన ఏకైక బౌలర్‌గా పఠాన్ నిలిచాడు. ఇప్పటికీ ఆ ఘనత చెక్కుచెదరకుండా ఉంది. (చదవండి: క్రికెట్‌కు పఠాన్ గుడ్‌బై ) Cricket Fan Never Forget This! 🔥👌 Hat trick Vs Pakistan, 2004 ❤ Happy Retirement @IrfanPathan ❤#irfanpathan pic.twitter.com/8rBECjGmd8 — S O B U J ❤ (@VKSobuj18) January 4, 2020 2004లో లైమ్‌లైట్‌లోకి .. 2003 చివర్లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈలెఫ్టార్మ్ పేసర్ ఆసీస్ బ్యాట్స్‌మన్ మాథ్యూ హెడెన్, రికీ పాంటింగ్‌ల పాలిట విలన్‌గా మారాడు. ముఖ్యంగా రికీ పాంటింగ్‌ను ఇబ్బందులకు గురిచేస్తూ సాగిన అతడి బౌలింగ్ క్రికెట్ అభిమానులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. ఇక ఆతర్వాత ఆసీస్‌తోనే జరిగిన వన్డే సిరీస్‌లో ఓ మోస్తారుగా రాణించాడు. అయితే అనంతరం 2004లో పాకిస్తాన్ పర్యటనతో ఇర్ఫాన్ పఠాన్ పూర్తిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ఈ పర్యటనలో పాక్‌కు కొరకరాని కొయ్యగా మారాడు. ఈ సిరీస్ ఆసాంతం ఇర్ఫాన్‌తో పాటు లక్ష్మీపతి బాలాజీల పేర్లు క్రికెట్ ప్రపంచంలో మారుమోగాయి. అటు బంతితో.. ఇట్టు జట్టుకు అవసరమైనప్పుడల్లా బ్యాట్‌తో రాణించి అప్పట్లో సంచలనం సృష్టించారు. ఇదే జోరును పఠాన్ కొన్నేళ్లపాటు కొనసాగించాడు. అయితే బాలాజీ మాత్రం గాయం కారణంగా జట్టుకు దూరమై తిరిగి పూర్వపు లయను అందుకోవడంలో విఫలమై టీమిండియాలో పూర్తిగా చోటు కోల్పోయాడు. చోటు కోల్పోయిన ప్రతీసారి.. టీమిండియాలో చోటు కోల్పోయిన ప్రతీ సారి గోడకు కొట్టిన బంతి వలే ఘనంగా పునరాగమనం చేసేవాడు. అతడు తిరిగొచ్చిన ప్రతీ మ్యాచ్‌లో అత్యద్భుతంగా రాణించేవాడు. 2005 తర్వాత పఠాన్ గడ్డుకాలాన్ని అనుభవించాడు. వన్డే, టెస్టుల్లో చోటు కోల్పోయాడు. అయితే తిరిగి ఫామ్‌ను అందుకుని జట్టులోకి వెంటనే తిరిగొచ్చేవాడు. ఇక కెరీర్ మొదట్లోనే అడపదడపా బ్యాటింగ్‌లో రాణించడం అలవాటు చేసుకున్న ఈ స్వింగ్ సుల్తాన్ అరంగేట్ర టెస్టు సిరీస్‌లోనే అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం 2007లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సెంచరీతో చెలరేగిపోయాడు. ఇక బంతితో పాటు బ్యాట్‌తో కూడా పఠాన్ ఆకట్టుకోవడంతో అతడిని కొన్ని సిరీస్‌లలో ఓపెనర్‌గా కూడా ప్రయోగించారు. ముఖ్యంగా న్యూజిలాండ్ సిరీస్‌లో సచిన్‌కు గాయం, ఓపెనర్ల సమస్యతో టీమిండియా సతమతమవుతున్న సమయంలో ఇర్ఫాన్ కొన్ని మ్యాచ్‌లు ఓపెనర్‌గా దిగాడు. చాపెల్ ఎంట్రీ.. పఠాన్ భవిత్యం అయోమయం గ్రెగ్ చాపెల్ టీమిండియా కోచ్‌గా 2005లో బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియాలో విపత్కరమైన పరిణామాలు ఏర్పడ్డాయి. క్రికెటర్లకు మిలటరీ ట్రైనింగ్ క్యాంప్ పెట్టి రచ్చరచ్చ చేశాడు. ఇక ఇర్ఫాన్ పఠాన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన చాపెల్ అతడిని ఉత్తమమైన ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాడు. అయితే చాపెల్ సూచనలతో ఇర్ఫాన్ పూర్తిగా తన అసలు ఆట స్వభావాన్ని పూర్తిగా మర్చిపోయాడు. కెరీర్ ఆరంభంలో అతడిలో ఎలాంటి బౌలింగ్ చూశామో ఆ వేడి క్రమక్రమేనా తగ్గుతూ వచ్చింది. బౌలింగ్ కంటే బ్యాటింగ్‌పై పఠాన్ దృష్టి పెట్టేలా చేశాడు చాపెల్. దీంతో ఓ సమయంలో పఠాన్ బౌలర్ కంటే బ్యాట్స్‌మన్‌గా మారిపోయాడు. ఓ దశలో పఠాన్ బ్యాట్స్‌మనా లేక బౌలరా అనే సందిగ్దత నెలకొంది. అయితే చాపెల్ కోచ్‌గా తప్పుకున్న తర్వాత తిరిగి బౌలింగ్‌పై దృష్టి పెట్టిన ఈ బరోడా క్రికెటర్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది.. అయితే అడపదడపా రాణిస్తూ జట్టులో కొనసాగినప్పటికీ ఎలాంటి మెరుపులు మెరిపించలేకపోయాడు. దీంతో కపిల్ దేవ్లా అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా, చరిత్రలో నిలిచిపోయే ప్రపంచస్థాయి దిగ్గజ బౌలర్‌గా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని అందరూ భావించారు. కానీ యువ క్రికెటర్లతో పోటీ పడలేక, మునపటి ఫామ్‌ను అందుకోక జట్టులో చోటు కోల్పోయి, కనీసం వీడ్కోలు మ్యాచ్ కూడా అవకాశం లేక సింపుల్‌గా రిటైర్మైంట్ ప్రకటించాడు. ఏది ఏమైన కొందరి సూచనలతో తన సహజసిద్దమైన ఆటను కోల్పోయి ప్రపంచం మర్చిపోయిన ఓ సాదాసీదా బౌలర్‌గా క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. -
అతడిని ఎప్పటికీ క్షమించను: యువీ తండ్రి
చండీగఢ్: యువరాజ్ సింగ్‌కు చిన్నతనంలో క్రికెట్ అంటే ఇష్టముండేది కాదని అతడి తండ్రి యోగ్రాజ్ సింగ్ తెలిపారు. క్రికెట్ మీద తనకు ఉన్న ఇష్టంతోనే కొడుకుతో బ్యాట్ పట్టించానని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. (చదవండి: యువరాజ్ గుడ్‌బై) ‘ఏడాదిన్నర వయసు ఉన్నప్పుడే యువీకి క్రికెట్ బ్యాట్ కొనిచ్చాను. వాడికి ఫస్ట్ బౌలర్ మా అమ్మ గుర్నమ్ కౌర్. మెల్లగా బంతి విసిరి వాడికి ఆట నేర్పేది. ఇప్పటికీ ఈ ఫొటో మా దగ్గర ఉంది. వయసు పెరిగేకొద్ది స్కేటింగ్, టెన్నిస్ ఆడటం మొదలుపెట్టాడు. క్రికెట్‌కు దూరమైపోతాడన్న భయంతో స్కేటింగ్ కిట్‌ను బయటకు విసిరేసి, టెన్నిస్ రాకెట్‌ను విరగొట్టేశాడు. అప్పుడు యువీ బాగా ఏడ్చాడు. నా మీద కోపంతో సెక్టార్ 11లో ఉన్న మా ఇంటిని జైలు అని, నన్ను డ్రాగన్ సింగ్ అంటూ పిలిచేవాడు. తర్వాత మెల్లగా వాడి దృష్టిని క్రికెట్‌వైపు మళ్లించాను. ఆరేళ్ల ప్రాయంలో యూవీని సెక్టార్ 16లోని స్టేడియంలోని పేస్ బౌలింగ్ అకాడమీకి తీసుకెళ్లాను. హెల్మెట్ లేకుండా ప్రాక్టీస్ చేయమని వాడికి చెప్పాను. శిక్షణలో భాగంగా రోజూ గంటన్నరపాటు స్టేడియంలో పరుగెత్తేవాడు. నాకు బాగా గుర్తుంది. యువీకి కఠిన శిక్షణ ఇప్పించడం చూసి మరణశయ్యపై ఉన్న మా అమ్మ ఒకసారి నన్ను మందలించింది. వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నానని మండిపడింది. ఈ ఒక్క విషయంలోనే నా కుమారుడి పట్ల కఠినంగా ఉన్నందుకు బాధ పడ్డాను. మొదట్లో క్రికెట్‌ను యువీ ద్వేషించాడు. కానీ క్రికెట్‌ను అతడు ప్రేమించేలా చేశాను. క్రికెట్లో అతడు ఏం సాధించాడో ఇప్పుడు ప్రపంచానికి మొత్తానికి తెలుసున’ని యోగ్రాజ్ ఒకింత గర్వంగా అన్నారు. ఒంటరిగా కూర్చుని ఏడ్చాను తన కుమారుడికి క్యాన్సర్ సోకిందని తెలియగానే అంతులేని బాధ కలిగిందని యోగ్రాజ్ సింగ్ తెలిపారు. క్యాన్సర్‌తో యువీ కథ ముగియకూడదని దేవుడిని ప్రార్థించాను. తానేప్పుడు యువీ ఎదుట బాధ పడలేదని, గదిలో ఒంటరిగా ఏడ్చేవాడినని వెల్లడించారు. క్యాన్సర్‌తో తాను చనిపోతే.. తన చేతిలో వరల్డ్‌కప్ ట్రోఫినీ ప్రపంచమంతా చూడాలని తనతో యువీ చెప్పినట్టు గుర్తుచేసుకున్నారు. రిటైర్మెంట్ ప్రకటనకు ముందు చండీగఢ్‌లో రెండు రోజుల పాటు యువీ సంతోషంగా గడిపాడని చెప్పారు. (చదవండి: మైదానంలో ‘మహరాజు’) చాపెల్‌ను క్షమించను యువీ కెరీర్‌ను భారత క్రికెట్ మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ నాశనం చేశాడని యోగ్రాజ్ సింగ్ మండిపడ్డారు.‘చాపెల్ కోచ్‌గా ఉన్నప్పుడు ఖోఖో ఆడుతుండగా యువీ మోకాలికి గాయమైంది. ఇది అతడి క్రీడాజీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. గాయపడకుంటే వన్డే, టీ20ల్లో అంతర్జాయతీయ రికార్డులన్నిటినీ యువీ బద్దలుకొట్టేవాడు. కోచ్‌గా ఉన్నప్పుడు నెట్ ప్రాస్టీస్‌కు ముందు ఖోఖో లాంటి దేశీయ ఆటలను చాపెల్ ఆడించేవాడు. ఇలా ఆడుతున్నపుడే యువీ గాయపడ్డాడు. నా కుమారుడి క్రీడా జీవితాన్ని నాశనం చేసినందుకు చాపెల్‌ను ఎన్నటికీ క్షమించలేన’ని యోగ్రాజ్ అన్నారు. -
చాపెల్‌కు చేత కాలేదు!
న్యూఢిల్లీ: గ్రెగ్ చాపెల్ భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉన్న కాలంలో సీనియర్ ఆటగాళ్లతో ఏర్పడిన విభేదాల గురించి క్రికెట్ ప్రపంచం మొత్తానికి తెలుసు. సచిన్, గంగూలీ తదితరులు తాము ఆ సమయంలో ఎలా ఇబ్బంది పడ్డామో గతంలోనే చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. తన ఆటోబయోగ్రఫీ ‘281 అండ్ బియాండ్’లో అతను ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఒక అగ్రశ్రేణి జట్టుకు కోచ్‌గా ఎలా వ్యవహరించాలో చాపెల్‌కు తెలీదని లక్ష్మణ్ విమర్శించాడు. ‘అతని పదవీకాలం మొత్తం ఒక చేదు జ్ఞాపకం. ఒక అంతర్జాతీయ క్రికెట్ జట్టును ఎలా నడిపించాలో అతనికి తెలియదు. మైదానంలో ఆడాల్సింది క్రికెటర్లు మాత్రమేనని కోచ్ కాదనే విషయాన్ని అతను మరచిపోయినట్లు అనిపించేది. చాలా మంది మద్దతుతో భారత జట్టుకు కోచ్‌గా వచ్చిన అతను జట్టును ఇబ్బందుల్లో నెట్టేసి వెళ్లిపోయాడు. నా కెరీర్లో ఘోరంగా విఫలమైన దశలో అతని పాత్ర కూడా ఉంది. అతని ఆలోచనలు సఫలమయ్యానని ఆ సమయంలో వచ్చిన కొన్ని ఫలితాలు చూస్తే అనిపిస్తుంది కానీ నిజానికి వాటికి అతనికి ఎలాంటి సంబంధం లేదు. ముందే ఒక అభిప్రాయం ఏర్పరుచుకొని దాని ప్రకారమే పని చేసేవాడు తప్ప పరిస్థితికి తగినట్లుగా మారలేదు. అప్పటికే సమస్యల్లో ఉన్న జట్టులో అతను మరిన్ని విషబీజాలు నాటాడు. కోచ్ కొంత మందినే ఇష్టపడుతూ వారి గురించే పట్టించుకునేవాడు. మిగతావారంతా ఎవరి బాధలు వారు పడాల్సిందే. మా కళ్ల ముందే జట్టు ముక్కలైంది’ అని వీవీఎస్ తన పుస్తకంలో వివరించాడు. -
ఆ మెయిల్ గురించి చెప్పింది నేనే : సెహ్వాగ్
కోల్‌కతా : టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి వ్యతిరేకంగా అప్పటి కోచ్ గ్రేగ్ చాపెల్ బీసీసీఐకి మెయిల్ రాయడాన్ని దాదాకు చెప్పింది తానేనని డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. శుక్రవారం కోల్‌కతాలో జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన వీరు ఆనాటి రోజులను నెమరువేసుకున్నారు. ‘కడుపు నొప్పిగా ఉందని అంపైర్స్‌కు చెప్పి నేను ఫీల్డీంగ్ చేయకుండా మైదానం వీడాను. ఐదు ఓవర్లు విశ్రాంతి కావాలని కోరాను. నేను వెళ్లి గ్రేగ్‌చాపెల్ (అప్పటి టీమిండియా హెడ్ కోచ్) వెనుకాల కూర్చున్నాను. ఆ సమయంలో గ్రేగ్.. గంగూలీకి వ్యతిరేకంగా బీసీసీఐకి ఓ మెయిల్ రాయడం చూశాను. వెంటనే ఈ విషయాన్ని దాదాకు తెలియజేశానని’ సెహ్వాగ్ 2005 జింబాంబ్వే పర్యటనలోని ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఇక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అయిన గ్రేగ్చాపెల్ను బీసీసీఐ 2005లో భారత క్రికెట్ జట్టుకు హెడ్‌కోచ్‌గా నియమించింది. ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్నా గంగూలీకి, కోచ్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరి.. వివాదస్పదమైన విషయం తెలిసిందే. చివరకు గంగూలీ జట్టు నుంచి స్థానం కూడా కోల్పోయాడు. క్రికెటర్‌గా అవి మధుర క్షణాలు.. ఆ రోజుల్లో తాను టెస్టులు ఆడలేనని, కేవలం తెల్లబంతితోనే రాణించగలనని అందరూ అంటుండేవారని సెహ్వాగ్ గుర్తుచేసుకున్నాడు. ‘టెస్టుల్లో తొలి సెంచరీ సాధించినప్పుడు గంగూలీ కౌగిలించుకొని.. టెస్టుల్లో ఆడే అవకాశం కల్పించాడు. దీంతో నేనేంటో నిరూపించాలనుకున్నాను’.అని టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికాపై 2001లో అరంగేట్ర మ్యాచ్‌లోనే సెహ్వాగ్(105) తొలి సెంచరీ నమోదు చేశాడు. ఓపెనింగ్ అవకాశం ఇచ్చింది గంగూలే సచిన్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగాలని గంగూలీ, అప్పటి కోచ్ జాన్రైట్లు తనకు సూచించారని సెహ్వాగ్ తెలిపాడు. ‘సచిన్, గంగూలీలు ఉన్న తర్వాత నేనేందుకు అని వారిని ప్రశ్నించా. మిడిలార్డర్లో ఆడనివ్వండని కోరా. కానీ సౌరవ్, జాన్రైట్లు ఆ ఓపెనింగ్ స్థానం నీకోసమేనని పట్టుబట్టి ఆడించారు.’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఈ సీజన్ ఐపీఎల్లో సెహ్వాగ్ కింగ్స్ పంజాబ్ మెంటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో కొత్తగా సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న దినేశ్ కార్తీక్, అశ్విన్‌లను ఈ డాషింగ్ ఓపెనర్ కొనియాడాడు. దినేశ్ కార్తీక్ అన్ని ఫార్మాట్లలో తమిళనాడు కెప్టెన్‌గా వ్యవహరించాడని, అశ్విన్ చాలా స్మార్ట్ అని, బౌలర్‌గా మైదానంలోని పరిస్థితులను అర్థచేసుకోగలడని అభిప్రాయపడ్డాడు. ఇక ఈ ఇరు జట్ల మధ్య కోల్‌కతాలో ఈ రోజు మ్యాచ్ జరగనుంది. -
సోదరుడే చాపెల్‌ను నమ్మలేదు
న్యూఢిల్లీ: కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ, కోచ్‌గా గ్రెగ్ చాపెల్ మధ్య విభేదాలు, అవి భారత క్రికెట్‌పై చూపిన ప్రభావం మీద ఇప్పటికే ఎన్నో కథనాలు వచ్చాయి. కెప్టెన్సీతో పాటు, జట్టు నుంచి కూడా తప్పించడంపై గంగూలీ పలుసార్లు గ్రెగ్పై విమర్శలు చేశాడు. తాజాగా ఆత్మకథ ‘ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్’లోనూ గంగూలీ ఆ సంగతులను ప్రస్తావించాడు. భారత కోచ్‌గా గ్రెగ్ చాపెల్ నియామకంపై అతడి సోదరుడైన ఇయాన్ చాపెల్ కూడా నాడు ఏమంత సానుకూలంగా లేడని చెప్పుకొచ్చాడు. ఆత్మకథలో ఇంకా ఏమన్నాడంటే... ‘2005లో ఈ ఉదంతంపై ఇయాన్‌తో పాటు సునీల్ గావస్కర్ కూడా నన్ను హెచ్చరించారు. అయినా వాటిని విస్మరించాను. అంతకుముందు తనతో జరిగిన భేటీల్లో విస్తృత క్రికెట్ పరిజ్ఞానంతో గ్రెగ్ నన్ను ఆశ్చర్యపరిచాడు. మన జట్టును నంబర్ వన్‌గా నిలిపేందుకు అతడు సరైనవాడని భావించాను. నా అభిప్రాయాన్ని దాల్మియాకు వివరించాను. కానీ గ్రెగ్‌తో మున్ముందు ఇబ్బందులు తప్పవని, అతడి కోచింగ్ రికార్డు గొప్పగా ఏమీ లేదని గావస్కర్ హెచ్చరించారు. అయినప్పటికీ నేను ముందుకెళ్లా. విజయవంతమైన కెప్టెన్‌ను, అంతకుముందు టెస్టు సిరీస్‌లో సెంచరీ చేసిన నన్ను అకారణంగా తొలగించారు. చరిత్రలో ఇలా ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు. భారత క్రికెట్లో దీంతో పోల్చదగిన ఘటనలు గతంలోను, ఇకపైనా జరగకపోవచ్చు’ అని పేర్కొన్నాడు. -
నా కెరీర్లో అదే పెద్ద తప్పిదం: గంగూలీ
న్యూఢిల్లీ:తన క్రికెట్ కెరీర్లో చేసిన అతి పెద్ద పొరపాటు ఏదైనా ఉందంటే అది ఆసీస్ మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపల్‌ను కావాలని కోచ్‌గా నియమించుకోవడమేనని అంటున్నాడు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. తనను కెరీర్ పరంగా చాలా ఎక్కువ కష్టాలు గురి చేశాడని గంగూలీ తెలిపాడు. ఎటువంటి ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకుని నియంతలా వ్యవహరించేవాడన్నాడు. ఎవరి మాట వినిపించుకోకుండా అతన్ని కోచ్‌గా చేసినందుకు తనకు తగిన శాస్తి జరిగిందని గంగూలీ తెలిపాడు. తన ఆత్మకథ ఏ సెంచరీ 'ఈజ్ నాట్ ఎనఫ్' అనే పుస్తకంలో చాపెల్ గురించి ఆసక్తికర విషయాలను గంగూలీ పంచుకున్నాడు. దాదాపు రెండేళ్లు(2005 మే నుంచి 2007 ఏప్రిల్) పాటు భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా పని చేసిన చాపెల్‌తో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గంగూలీ తెలిపాడు. చాపెల్ కోచ్‌గా పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే తన కెప్టెన్సీ పోయిన విషయాన్ని దాదా ప్రస్తావించాడు. అదే ఏడాది ఎటువంటి కారణం లేకుండా తనను ఆటగాడిగా కూడా తప్పించారని గంగూలీ తెలిపాడు. ఇందుకు కారణం.. తన మానసిక స్థితి బాలేదంటూ బీసీసీఐకి చాపెల్ రాసిన లేఖ కారణమన్నాడు. -
నాశనం చేసింది గ్రెగ్ చాపెల్ కాదు..
బరోడా:ఇర్ఫాన్ పఠాన్.. భారత క్రికెట్ జట్టులో ఒక వెలుగు వెలిగిన క్రికెటర్. ఇప్పటివరకూ భారత క్రికెట్ జట్టుకు సేవలందించిన ఆల్ రౌండర్లను లెక్కిస్తే అందులో ఇర్ఫాన్ కచ్చితంగా ముందువరుసలోనే ఉంటాడు. అటు బంతితోనూ, ఇటు బ్యాట్ తోనూ భారత జట్టు విజయాల్లో పాలు పంచుకున్న క్రికెటర్ ఇర్ఫాన్. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని భారత జట్టులో ఇర్ఫాన్ కీలక సభ్యుడిగా ఎదుగుతూ వచ్చాడు. ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ ఒక్కసారిగా అథమస్థాయి పడిపోవడం, ఆ తరువాత అతనికి అవకాశాలు కనుచూపుమేరలో లేకపోవడం జరిగిపోయాయి. అయితే ఇర్ఫాన్ కెరీర్ నాశనం కావడానికి ఒకనాటి భారత జట్టు కోచ్ గ్రెగ్ చాపెల్ అనే అపవాదు కూడా ఉంది. ఇర్ఫాన్ ను ఇష్టానుసారం ఉపయోగించుకుని అతని కెరీర్ ను చాపెల్ నాశనం చేశాడంటూ అప్పట్లో రూమర్లు కూడా వెలుగుచూశాయి. దాన్ని తాజాగా ఖండించాడు ఇర్ఫాన్. ' నా కెరీర్ ఒక్కసారిగా నాశనం కావడం ఊహించింది కాదు. అది అలా జరిగిపోయింది. నా కెరీర్ నాశనం కావడానికి గ్రెగ్ చాపెల్ అని చాలా మంది అనుకుంటారు. అది నిజం కాదు. ఏ ఒక్కరు ప్రమేయంతో మన కెరీర్ నాశనం కాదు. . నీ జీవితంలో ఏమి జరిగినా దానికి నీవే బాధ్యుడివి. అంతేకానీ వేరే వారు ఎప్పుడు కారణం కాదు. మనం చేయాల్సింది ఏదైతే ఉందో అది సక్రమంగా చేయడమే మన కర్తవ్యం. అలాగే నా కెరీర్ పతనం విషయంలో కూడా చాపెల్ కారణం కాదు. నేను ఎప్పుడైతే జట్టులో స్థానం కోల్పోయానో, అప్పుడు గాయాలు కూడా బాధించాయి. దాంతో తిరిగి జట్టులోకి పునరాగమనం చేయడం కష్టమైంది. నా కెరీర్ నాశనం కావడానికి కారణం గాయాలే'అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ లయన్స్ తరపున ఇర్ఫాన్ పఠాన్ బరిలోకి దిగనున్నాడు. గాయం కారణంగా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో దూరం కావడంతో అతని స్థానంలో ఇర్ఫాన్ కు అనూహ్యంగా చోటు దక్కింది. ఫిబ్రవరిలో నిర్వహించిన 2017 సీజన్ వేలంలో ఇర్ఫాన్ పఠాన్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. వేలంలో అతడి కనీస ధర రూ. 50 లక్షలుగా నిర్ణయించినా ఎవరూ కొనుగోలు చేయలేదు. -
అది విరాట్ కోహ్లి అదృష్టం: గ్రెగ్ చాపెల్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లేను ఎంపిక చేయడంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్ చాపెల్ హర్షం వ్యక్తం చేశాడు. ప్రస్తుత టీమిండియా జట్టుకు అనిల్ కుంబ్లేను కోచ్ గా చేయడమే సరైనదిగా చాపెల్ అభిప్రాయపడ్డాడు. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి-కోచ్ అనిల్ కుంబ్లేల కలయికలో టీమిండియా మరింత శక్తిమంతంగా రూపుదిద్దుకోవడం ఖాయమని చాపెల్ పేర్కొన్నాడు. 'టీమిండియా కోచ్‌గా కుంబ్లే నియామకం సరైనదే. కుంబ్లేతో కలిసి పని చేయడం విరాట్‌కు దక్కిన అదృష్టం. కుంబ్లేతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం పంచుకోవడం విరాట్ కు దక్కిన ఒక మంచి అవకాశం కూడా. విరాట్ దూకుడుకు అపారమైన కుంబ్లే అనుభవం సహాయ పడుతుంది. వీరిద్దరి భాగస్వామ్యం కచ్చితంగా భారత జట్టును ముందుకు తీసుకెళుతుంది. కుంబ్లే-విరాట్ల కాంబినేషన్ విజయవంతమవడం ఖాయం. కుంబ్లే నుంచి విరాట్ కు చక్కటి సహకారం దక్కుతుంది. ప్రతీ విషయంలోనూ విరాట్ ను కుంబ్లే వెనుకే ఉండి ప్రోత్సహిస్తాడు ' అని ఓ జాతీయ పత్రికకు రాసిన కాలమ్‌లో గ్రెగ్ చాపెల్ పేర్కొన్నాడు. గతంలో తాను టీమిండియా కోచ్ గా పని చేసినప్పుడు కుంబ్లే పోరాటపటిమను అత్యంత దగ్గరగా చూశానని చాపెల్ తెలిపాడు. ఎంతో అంకితభావం గల కుంబ్లే భారత కోచ్ గా రాణిస్తాడని పేర్కొన్నాడు.