టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ.. టీచర్స్ డే (సెప్టెంబర్ 5) సందర్భంగా తన క్రికెట్ గురువులకు శుభాకాంక్షలు తెలిపాడు. దాదా ట్విటర్ వేదికగా తన ఇష్ట గురువులను (కోచ్‌లు) గుర్తు చేసుకుంటూ 'దాదా ఫేవరెట్ టీచర్' అనే ఓ వీడియోను షేర్ చేశాడు. టీచర్స్ డే సందర్భంగా దాదా స్మరించుకున్న వారిలో అతని చిన్ననాటి కోచ్ దివంగత దెబో మిత్రా, తన ఇష్టమైన కోచ్ జాన్ రైట్, టీమిండియా అత్యంత విజయవంతమైన కోచ్ గ్యారీ కిర్‌స్టన్ అలాగే టీమిండియా వివాదాస్పద కోచ్ గ్రెగ్ చాపెల్ ఉన్నారు. వీరందరికీ దాదా టీచర్స్ డేను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపాడు.
Major missing Debo Mitra, John Wright, my favourite one ,Gary Kirsten and Greg. Happy Teachers' Day!
— Sourav Ganguly (@SGanguly99) September 5, 2022
There are few moments in life that make you relive your past, here's to my failures & bouncing back.
Watch here: https://t.co/xNIlW4EdZa#TeachersDay
కాగా, గంగూలీ గుర్తు చేసుకున్న నలుగరు కోచ్‌ల్లో గ్రెగ్ చాపెల్ పేరును ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. చాపెల్ టీమిండియా కోచ్‌గా పని చేస్తున్న కాలంలో (2003 ప్రపంచకప్ తర్వాత) దాదాను ఎంతో ఇబ్బందిపెట్టాడు. ఓ దశలో కోచ్ మాటలు విని దాదాను జట్టు నుంచి కూడా తప్పించారు. చాపెల్ కారణంగా టీమిండియాలో విభేదాలు రచ్చకెక్కాయి. ఆటగాళ్లు రెండు గ్రూపులుగా (గంగూలీ, చాపెల్) విడిపోయి ఆటను గాలికొదిలేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంగూలీ చాపెల్ పేరును ప్రస్తావిస్తూ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
చదవండి: లంకతో సమరం.. పంత్, చహల్‌లను పక్కకు పెట్టడమే ఉత్తమం..!
Comments
Please login to add a commentAdd a comment