గంగూలీ, గ్రెగ్ చాపెల్
న్యూఢిల్లీ: కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ, కోచ్‌గా గ్రెగ్ చాపెల్ మధ్య విభేదాలు, అవి భారత క్రికెట్‌పై చూపిన ప్రభావం మీద ఇప్పటికే ఎన్నో కథనాలు వచ్చాయి. కెప్టెన్సీతో పాటు, జట్టు నుంచి కూడా తప్పించడంపై గంగూలీ పలుసార్లు గ్రెగ్‌పై విమర్శలు చేశాడు. తాజాగా ఆత్మకథ ‘ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్’లోనూ గంగూలీ ఆ సంగతులను ప్రస్తావించాడు. భారత కోచ్‌గా గ్రెగ్ చాపెల్ నియామకంపై అతడి సోదరుడైన ఇయాన్ చాపెల్ కూడా నాడు ఏమంత సానుకూలంగా లేడని చెప్పుకొచ్చాడు. ఆత్మకథలో ఇంకా ఏమన్నాడంటే... ‘2005లో ఈ ఉదంతంపై ఇయాన్‌తో పాటు సునీల్ గావస్కర్ కూడా నన్ను హెచ్చరించారు. అయినా వాటిని విస్మరించాను. అంతకుముందు తనతో జరిగిన భేటీల్లో విస్తృత క్రికెట్ పరిజ్ఞానంతో గ్రెగ్ నన్ను ఆశ్చర్యపరిచాడు.
మన జట్టును నంబర్ వన్‌గా నిలిపేందుకు అతడు సరైనవాడని భావించాను. నా అభిప్రాయాన్ని దాల్మియాకు వివరించాను. కానీ గ్రెగ్‌తో మున్ముందు ఇబ్బందులు తప్పవని, అతడి కోచింగ్ రికార్డు గొప్పగా ఏమీ లేదని గావస్కర్ హెచ్చరించారు. అయినప్పటికీ నేను ముందుకెళ్లా. విజయవంతమైన కెప్టెన్‌ను, అంతకుముందు టెస్టు సిరీస్‌లో సెంచరీ చేసిన నన్ను అకారణంగా తొలగించారు. చరిత్రలో ఇలా ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు. భారత క్రికెట్‌లో దీంతో పోల్చదగిన ఘటనలు గతంలోను, ఇకపైనా జరగకపోవచ్చు’ అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment