WTC Final 2023: Shubman Gill Will Struggle In English Conditions If The Australians Bowl Well: Greg Chappell - Sakshi
Sakshi News home page

WTC Final 2023: అలా చేస్తే గిల్‌ను ఈజీగా ఔట్‌ చేయవచ్చు.. లేదంటే కష్టమే: చాపెల్‌

Published Sun, Jun 4 2023 1:41 PM | Last Updated on Sun, Jun 4 2023 2:56 PM

Shubman Gill will struggle in English conditions if the Australians bowl well: Greg Chappel - Sakshi

ఐపీఎల్‌లో దుమ్మురేపిన టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌.. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. ప్రాక్టీస్‌ సెషన్స్‌లో గిల్‌ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ నేపధ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు గిల్‌పై  ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు.

ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొనేందుకు గిల్‌ కచ్చితంగా ఇబ్బంది పడతాడని చాపెల్‌ అభిప్రాయపడ్డాడు. కాగా లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో జూన్‌ 7 నుంచి 11వరకు ఈ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. 

"గిల్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. శుబ్‌మన్‌ తన ఇన్నింగ్స్‌ ప్రారంభంలో లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులకు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాడు. ముఖ్యంగా ఆఫ్‌స్టంప్‌ వెలుపుల వేసిన బంతులకు చాలా సార్లు ఔటయ్యాడు. గిల్‌కు గతంలో ఇంగ్లండ్‌ పరిస్ధితుల్లో ఆడిన అనుభవం ఉంది. కానీ అతడు అంతగా రాణించలేకపోయాడు.

అదే విధంగా బంతి కొంచెం ఎక్కువగా బౌన్స్‌ అయితే గిల్‌ వికెట్‌ కీపర్‌ లేదా స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యే ఛాన్స్‌ ఉంది. కాబట్టి కెప్టెన్‌ కమ్మిన్స్‌, హేజిల్‌ వుడ్‌ మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బౌలింగ్‌ చేస్తే గిల్‌ను తొందరగా పెవిలియన్‌కు పంపవచ్చు. అయితే గిల్‌ అద్బుతమైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆసీస్‌ బౌలర్లు సరైన లైన్లో బౌలింగ్‌ చేయకపోతే అతడిని అపడం​చాలా కష్టం మని బ్యాక్‌ స్టేజ్‌ విత్‌ బోరియా షోలో చాపెల్‌ పేర్కొన్నాడు.
చదవండి: ENG vs IRE: బెన్‌ స్టోక్స్‌ అరుదైన రికార్డు.. క్రికెట్‌ చరిత్రలోనే తొలి కెప్టెన్‌గా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement