
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఔటైన తీరు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించాడని థర్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరోను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించాడు.
థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని సెహ్వాగ్ తప్పుబట్టాడు. కళ్లకు గంతలు కట్టుకొని అంపైరింగ్ చేశాడని సెహ్వాగ్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కళ్లకు గంతలు కట్టుకున్న ఫొటోతో సెహ్వాగ్ ఫన్నీ మీమ్ సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. "శుబ్‌మన్ గిల్ ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు కట్టుకొని నిర్ణయం తీసుకున్నాడు. సరైన ఆధారాలు లేకపోతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నాటౌటగా ప్రకటించాలి. గిల్‌ది క్లియర్‌గా నాటౌట్" అని ట్విటర్‌లో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
అసలేం జరిగిందంటే..?
టీమిండియా రెండో ఇన్నింగ్స్ 8వ వేసిన స్కాట్ బోలాండ్‌లో బౌలింగ్‌లో తొలి బంతిని గిల్ ఎదుర్కొన్నాడు. బోలాండ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. గిల్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి గల్లీ స్లిప్ ఫీల్డర్ వైపు దూసుకెళ్లింది. గల్లీలో ఉన్న కామెరూన్ గ్రీన్ అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడు.
అయితే క్యాచ్ పట్టే క్రమంలో బంతి నేలకు తాకినట్లు అనిపించింది.. దీంతో ఫీల్డ్ అంపైర్స్.. థర్డ్ అంపైర్‌కు రెఫర్ చేశారు. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్‌కు క్యాచ్ ఔట్ విషయంలో క్లారిటీ లభించలేదు. ఆఖరికి గ్రీన్ చేతి వేళ్లు బంతి కింద ఉన్నాయని చెబుతూ థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు.
చదవండి: WTC FINAL: రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. మూడో భారత ఓపెనర్‌గా
Third umpire while making that decision of Shubman Gill.
— Virender Sehwag (@virendersehwag) June 10, 2023
Inconclusive evidence. When in doubt, it’s Not Out #WTC23Final pic.twitter.com/t567cvGjub