లండన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ తుది అంకానికి చేరుకుంది. ఆఖరి రోజు విజయం కోసం భారత్‌కు మరో 280 పరుగులు కావాల్సి ఉండగా, ఆసీస్‌కు 7 వికెట్లు అవసరం.
కాగా 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లి (44), రహానే(20) పరుగులతో ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్లకు 270 పరుగులవద్ద డిక్లేర్ చేసింది.
ఇక ఇది ఇలా ఉండగా.. రెండో ఇన్నింగ్స్‌లో గిల్ ఔటైన తీరు వివాదస్పదమైంది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ 8వ ఓవర్ తొలి బంతిని శుభ్‍మన్ గిల్ ఎదుర్కొన్నాడు. ఆసీస్ పేసర్ స్కాట్ బోలండ్ బౌలింగ్ చేయగా.. శుభ్‍మన్ గిల్ బ్యాట్ ఎడ్జ్‌కు బంతి తగిలి గల్లీలో ఉన్న కామెరూన్ గ్రీన్‍కు క్యాచ్ వెళ్లింది.
క్యాచ్ తీసుకునే క్రమంలో డైవ్ చేసిన గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి.. ఫోర్స్‌కు బంతిని నేలకు తాకించినట్లు కనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్స్.. థర్డ్ అంపైర్‌కు రెఫర్ చేశారు. అల్ట్రాఎడ్జ్‌లో కెమెరా యాంగిల్ పరిశీలించగా గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి నేలకు తాకించినట్లు కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ చివరికి గిల్ ఔటయినట్టు ప్రకటించాడు.
రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్
ఇక గిల్‌ను థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించగానే నాన్ స్ట్రైక్‌లో ఉన్న రోహిత్ ఒక్కసారిగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. గట్టిగా అరుస్తూ హిట్‌మ్యాన్ పక్కకు వెళ్లిపోయాడు. ఇక 444 పరుగుల భారీ లక్క్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు వీరిద్దరూ మంచి ఆరంభం ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో గిల్ వికెట్ కోల్పోవడం రోహిత్‌ను తీవ్ర నిరాశపరిచింది. కాగా వీరిద్దరూ తొలి వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో గిల్ 18 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 43 పరుగులు చేశాడు.
చదవండి: WTC Final: గెలవకపోయినా పర్లేదు డ్రా చేసుకుంటే అదే గొప్ప!
Rohit Sharma reaction #WTCFinal #WTC23Final pic.twitter.com/GwckvmX4KW
— आदित्य पंडीत (@AdityaP23166892) June 10, 2023
Comments
Please login to add a commentAdd a comment