టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ డాషింగ్ ఆల్‌రౌండర్‌గా అందరికి సుపరిచితమే. టీమిండియా సాధించిన రెండు మేజర్ వరల్డ్‌కప్స్(2007 టి20, 2011 వన్డే) జట్టులో యువీ సభ్యుడిగా ఉన్నాడు. దీంతోపాటు మరెన్నో ఘనతలు సాధించిన యువరాజ్ టీమిండియాకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా పనిచేయలేదు. మధ్యలో కొన్నిరోజులు జట్టుకు వైస్‌కెప్టెన్‌గా మాత్రమే ఉన్నాడు. తాజాగా కెప్టెన్‌గా అవకాశం రాకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొందరు తనపై పగబట్టారని.. అందుకే టీమిండియాకు కెప్టెన్ కాలేకపోయానని యువీ పేర్కొన్నాడు. మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో యువరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
''గ్రెగ్ చాపెల్ ఉదంతం నన్ను టీమిండియా కెప్టెన్సీ నుంచి దూరం చేసింది. చాపెల్ 2005 నుంచి 2007 మధ్య కాలంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్నాడు. ఈ సమయంలో అతను తీసుకున్న కొన్న నిర్ణయాలపై జట్టులో అప్పటికే సీనియర్లు అయిన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు తప్పుబట్టారు. ముఖ్యంగా 2007 వరల్డ్‌కప్‌కు ముందు బ్యాటింగ్ ఆర్డ్‌ర్‌ను మార్చేయడం జట్టు సమతుల్యాన్ని దెబ్బతీసింది. ఓపెనర్‌గా సూపర్ సక్సెస్ అయిన సచిన్‌ను మిడిలార్డర్‌లో ఆడించడం.. గంగూలీతో చాపెల్‌కు పొసగకపోవడం.. దాదా రిటైర్ అవ్వడానికి.. 2007 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఘోర వైఫల్యం వెనుక చాపెల్ పాత్ర చాలా ఉందని సచిన్: బిలియన్ డ్రీమ్స పుస్తకంలో రాసి ఉంటుంది. ఇదే చాపెల్ ఉదంతం నన్ను కెప్టెన్సీకి దూరం చేసింది.
2007లో ఇంగ్లండ్ టూర్‌కు సెహ్వాగ్ అందుబాటులో లేడు. దీంతో ద్రవిడ్ కెప్టెన్‌గా.. నేను వైస్ కెప్టెన్‌గా ఉన్నాం. ఆ తర్వాత జట్టులోని సీనియర్లకు, చాపెల్‌కు విబేధాలు రావడం.. నేను మా టీమ్‌ను సపోర్ట్ చేయడం కొంతమంది బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు. ఒక దశలో నేను తప్ప ఎవరు కెప్టెన్‌గా ఉన్నా మాకు అభ్యంతరం లేదని కొందరు అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికి పరోక్షంగా కొందరు నాపై పగబట్టారు.. అందుకే కెప్టెన్ కాలేకపోయా.
వాస్తవానికి 2007 టి20 ప్రపంచకప్‌కు నేను కెప్టెన్ అవ్వాల్సింది. అయితే మేనేజ్‌మెంట్ నుంచి సపోర్ట్ లేకపోవడం వల్ల మహీ భాయ్ కెప్టెన్ కావడం.. తొలిసారే టైటిల్ గెలవడం జరిగిపోయాయి. ఇందులో ధోని భయ్యాను నేను తప్పుబట్టలేను. మేనేజ్‌మెంట్ నిర్ణయం ప్రకారం ధోని కెప్టెన్ అయ్యాడు.. మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు.. టీమిండియాకు మూడు మేజర్ ట్రోపీలను అందించాడు. అతని కెప్టెన్సీలో ఆడడం నేను చేసుకున్న అదృష్టం'' అని చెప్పుకొచ్చాడు.
ఇక యువరాజ్ తన 17 ఏళ్ల కెరీర్‌లో 40 టెస్టుల్లో 1900 పరుగులు, 304 వన్డేల్లో 8,701 పరుగులు, 58 టి20ల్లో 1177 పరుగులు సాధించాడు. వన్డేల్లో 14 సెంచరీలు అందుకున్న యువరాజ్ టెస్టుల్లో మూడు సెంచరీలు సాధించాడు.
చదవండి: Chris Gayle: 'సరైన గౌరవం దక్కలేదు'.. యునివర్సల్ బాస్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment