న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్‌తో మన క్రికెటర్ల విభేదాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ దగ్గర్నుంచీ ఇర్ఫాన్ పఠాన్ వరకూ అందర్నీ శాసించాలని ఉద్దేశంతో ఉండేవాడు చాపెల్. గంగూలీ గొడవ, ఆటగాళ్ల మధ్య విభేదాలు, జట్టులో గ్రూపులు ఏర్పాటుకు చాపెల్ కారణమయ్యాడనే అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 2005, మే నెల నుంచి 2007 వరకూ టీమిండియా ప్రధాన కోచ్‌గా పని చేసిన చాపెల్ ఒక నియంత ధోరణిలో వ్యవహరించేవాడు. తన మాటే నెగ్గాలనే పట్టుదలతో మొండిగా నిర్ణయాలు తీసుకునేవాడు. అయితే చాపెల్ తాజాగా చేసిన ఒక కామెంట్ ఇప్పుడు టీమిండియా వెటరన్‌లకు కోపం తెప్పించింది. (‘క్రికెట్ చరిత్రలో ధోనినే పవర్‌ఫుల్’)
ధోని గొప్ప ఫినిషర్‌గా ఎదగడానికి తానే కారణమని చెప్పుకున్న చాపెల్‌పై యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2005లో జైపూర్ వేదికగా ధోని సాధించిన 183 పరుగులకు తానే కారణమని చాపెల్ చెప్పుకురావడం యువీ, భజ్జీల కోపానికి కారణమైంది. గ్రౌండ్‌లో ప్రతీ బంతిని హిట్ చేయమని చెప్పడానికి బదులు గ్రౌండ్ నాలుగు వైపులా ఆడమని తాను ఇచ్చిన ధోనిని గొప్ప ఫినిషర్‌ను చేసిందని చాపెల్ పేర్కొనడాన్ని వీరు తప్పుబడుతున్నారు. ‘ ధోనిని గ్రౌండ్ షాట్లు ఆడమని చాపెల్ చెప్పాడట. అది మమ్మల్ని మమ్మల్ని గ్రౌండ్ అవతలికి విసిరేయడానికేనా. చాపెల్ చాలా రకాల గేమ్స్ ఆడాడు’ అని భజ్జీ విమర్శించాడు. తన క్రికెట్ కెరీర్‌ను ఓవరాల్‌గా చూస్తే చాపెల్‌తో భాగమైన రోజులే అత్యంత చెత్త అని హర్భజన్ పేర్కొన్నాడు. ఇక యువరాజ్ సింగ్ సైతం చాపెల్ చేసిన కామెంట్‌పై విరుచుకుపడ్డాడు. ‘నువ్వు ఏ రోజు బంతిని హిట్ చేయమని చెప్పిన దాఖలాలు లేవు. చివరి పది ఓవర్లలో కూడా హిట్టింగ్ చేయవద్దనే అన్నావ్. ధోనితో పాటు నన్ను కూడా ఆఖరి పది ఓవర్లలో కేవలం గ్రౌండ్ షాట్లకే పరిమితం చేశావ్’ అని చాపెల్ కోచింగ్ తీరును ప‍్రశ్నించాడు. (కరోనా సంక్షోభం తర్వాత తొలి క్రికెట్ లీగ్)
ధోని అంతర్జాతీయ కెరీర్ ఆరంభించిన తొలి నాళ్లలో భారత్ కోచ్‌గా చాపెల్ వ్యవహరించాడు. ఆనాటి విశేషాలను ‘ప్లేరైట్ ఫౌండేషన్’ నిర్వహించిన ఆన్‌లైన్ చాట్‌లో పంచుకున్న చాపెల్..ధోనిని ఆకాశానికెత్తేశాడు. క్రికెట్ చరిత్రలో ధోనినే పవర్‌ఫుల్ బ్యాట్స్‌మన్ అంటూ కీర్తించాడు. ఈ మేరకు 2005లో శ్రీలంకపై ధోని సాధించిన 183 పరుగుల్ని నెమరవేసుకున్నాడు. ఈనాటికి ధోని అత్యధిక వన్దే స్కోరుగా ఉన్న అది ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అని పేర్కొన్నాడు. ఆ తర్వాత పుణెలో మ్యాచ్ జరగ్గా, ధోనిని హిట్టింగ్ చేయొద్దని చెప్పినట్లు పేర్కొన్నాడు. కేవలం గ్రౌండ్ షాట్లు కొట్టమని చెప్పానని, అదే ధోనిని గొప్ప ఫినిషర్‌గా చేసిందన్నాడు.
He asked Dhoni to play along the ground coz coach was hitting everyone out the park.. He was playing different games 😜#worstdaysofindiancricketundergreg 😡😡😡 https://t.co/WcnnZbHqSx
— Harbhajan Turbanator (@harbhajan_singh) May 13, 2020
🤣 Msd and Yuvi no sixes in the last 10 play down the ground
— yuvraj singh (@YUVSTRONG12) May 13, 2020
Comments
Please login to add a commentAdd a comment