ముంబై: ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ. 950 కోట్ల ఆదాయాన్ని మూటగట్టుకుంది. ఇందులో నికర ఆదాయం (లాభం) రూ. 350 కోట్లు అని బోర్డు ఫైనాన్స్ కమిటీ గురువారం ప్రకటించింది.
2011-12 ఆర్థిక సంవత్సరంలో బోర్డు రూ. 382.36 కోట్ల లాభం సంపాదించిందని బోర్డు కోశాధికారి రవి సావంత్ వెల్లడించారు. ఢిల్లీలో సమావేశమైన ఈ కమిటీ... ఖాతాలను ఆమోదించింది. తుది ఆమోదం కోసం కోసం బీసీసీఐ వర్కింగ్ కమిటీకి ఖాతా వివరాలను పంపుతారు. వచ్చే నెల మొదటి వారంలో వర్కింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ మీటింగ్‌లోనే బోర్డు వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) తేదీలను కూడా ఖరారు చేస్తారు.