Bcci working commitee
-
8న బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం
ఏజీఎమ్ తేదీని ఖరారు చేసే అవకాశం న్యూఢిల్లీ: బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం ఈనెల 8న చెన్నైలో జరగనుంది. ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ భవితవ్యంతో పాటు వార్షిక సర్వసభ్య సమావేశం తేదీని ఇందులో ఖరారు చేయనున్నారు. అయితే వర్కింగ్ కమిటీలో ఎక్కువ మంది సభ్యులు 7వ తేదీనే అనధికారికంగా శ్రీనివాసన్‌తో సమావేశం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ‘8న వర్కింగ్ కమిటీ సమావేశం ఉందని మాకు సర్క్యులర్ అందింది. కాబట్టి శ్రీని మద్దతుదారుల సమావేశం 5న జరిగే అవకాశాల్లేవు. 7వ తేదీన తనకు మద్దతిచ్చే కొన్ని రాష్ట్రాల సంఘాలతో ఆయన భేటి కానున్నారు. శ్రీని వ్యతిరేక వర్గం సభ్యులు కూడా వర్కింగ్ కమిటీకి హాజరవుతారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తన భవిష్యత్‌పై చైర్మన్ ఇంత వరకు ఏమీ చెప్పలేదు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఐపీఎల్ వేదికే అజెండా
బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం నేడు భువనేశ్వర్: దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్-7ను ఎక్కడ నిర్వహించాలో నిర్ణయించడమే ప్రధాన అజెండాగా శుక్రవారం బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఎన్నికల కారణంగా ఐపీఎల్‌కు భద్రత కల్పించలేమని హోంశాఖ స్పష్టం చేయడంతో ప్రత్యామ్నాయ వేదికల్ని బోర్డు పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విదేశాల్లో టోర్నీ నిర్వహిస్తే తమకు నష్టం కలుగుతుందన్న ఫ్రాంచైజీల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోనున్నట్లు, అందుకోసం ప్రత్యామ్నాయ వేదికను నిర్ణయించినా ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాతే తుదినిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, విదేశాల్లోనే నిర్వహించాల్సివస్తే దక్షిణాఫ్రికానే తొలి ప్రత్యామ్నాయంగా బీసీసీఐ పరిగణిస్తోంది. ఐపీఎల్-2ను నిర్వహించిన అనుభవం ఉండడం, అక్కడి సమయాలు కూడా భారత్‌లో టెలివిజన్ వీక్షకులకు అనుకూలమైనవి కావడంతో బోర్డు ఆ దిశగా మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అయితే యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బంగ్లాదేశ్‌లను కూడా ప్రత్యామ్నాయ వేదికలుగా భావిస్తున్నా.. యూఏఈలో బుకీలు, ఫిక్సింగ్ బెడద ఎక్కువగా ఉంటుందనే ఆందోళన ఉంది. మరోవైపు బీపీఎల్ సందర్భంగా ఫిక్సింగ్ చోటుచేసుకోవడం బంగ్లాదేశ్‌లోనూ టోర్నీ నిర్వహణ శ్రేయస్కరం కాదన్న అభిప్రాయం కలిగిస్తోంది. సహాయ కోచ్ ఆలోచన లేదు: బీసీసీఐ ముంబై: టీమిండియాకు సహాయ కోచ్‌ను నియమించే ఆలోచనేదీ లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. విదేశీ పర్యటనల్లో భారత బౌలర్ల వరుస వైఫల్యాల నేపథ్యంలో బౌలింగ్ కోచ్ జోయ్ డేవిస్‌ను తప్పించి అతని స్థానంలో స్వదేశీ సహాయ కోచ్‌ను నియమించనున్నట్లు, శుక్రవారం భువనేశ్వర్‌లో జరగనున్న బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ విషయం చర్చకు రానున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అటువంటి అజెండా ఏదీ లేదని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. టి20 ప్రపంచకప్ ముగిశాక కెప్టెన్ ధోని, కోచ్ ఫ్లెచర్లతో సమావేశం జరుగుతుందని చెప్పారు. -
బీసీసీఐ ఏజీఎం 29న
కోల్‌కతా: బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఎన్.శ్రీనివాసన్ అధ్యక్షత వ హిస్తాడా? లేదా? అనే సస్పెన్స్ తొలగింది. న్యాయపరంగా చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఆయన స్వచ ఛందంగా వెనక్కి తగ్గారు. దీంతో తాత్కాలిక అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియానే కమిటీకి నేతృత్వం వహించారు. బోర్డు అధ్యక్షుడిగా ఉన్నా వర్కింగ్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించలేని అరుదైన పరిస్థితి శ్రీనివాసన్ ఎదుర్కొన్నారు. అల్లుడు గురునాథ్ బెట్టింగ్ ఆరోపణల్లో ఇరుక్కోవడంతో ఆయన అధ్యక్షత బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకున్నారు. ఈ సమావేశానికి ఆయన తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్షుడి హోదా లో హాజరయ్యారు. అలాగే బోర్డు వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) ఈనెల 29న చెన్నైలో జరిపేందుకు నిర్ణయించారు. అంతవరకు బోర్డు రోజువారీ వ్యవహారాలు దాల్మియాకే అప్పగించారు. ఏజీఎంకు నేనే అధ్యక్షత వహిస్తా: శ్రీనివాసన్ ఈనెల 29న జరిగే వార్షిక సాధారణ సభ్య సమావేశానికి (ఏజీఎం) తానే అధ్యక్షత వహిస్తానని శ్రీనివాసన్ తేల్చి చెప్పారు. వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో ఈ విషయం తెలిపారు. ‘ఏజీఎంకు నేను అధ్యక్షత వహిస్తాను. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. అసలు సమస్యేమిటో నాకు అర్థం కావడం లేదు. నేనేమైనా తప్పు చే శానా? నాపైన ఏమైనా ఆరోపణలున్నాయా? లేక కేసులున్నాయా?’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. అలాగే దక్షిణాఫ్రికా సిరీస్ రద్దవుతుందని చెప్పలేదని, కమిటీలో చర్చకు రాకపోయినా ఆ సిరీస్ ఉంటుందని తేల్చారు. చట్టబద్ధమైన బాధ్యతలు శ్రీనివాసన్‌కే.. బీసీసీఐ అధ్యక్షుడిగా ఇంకా పూర్తిస్థాయిలో విధులు చేపట్టకపోయినా బోర్డు రాజ్యాంగబద్ధ, న్యాయబద్ధమైన బాధ్యతలను శ్రీనివాసన్‌కు అప్పగిస్తూ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. అలాగే 29న జరిగే ఏజీఎంకు హాజరు కావాలని ఆయన్ని ఆహ్వానించారు. ‘ఏజీఎం వరకు బోర్డు అధ్యక్షుడికి ఉండే రాజ్యాంగబద్ధ, న్యాయబద్ధ బాధ్యతలను శ్రీనివాసన్‌కు అప్పగిస్తున్నట్టు తాత్కాలిక అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా సభ్యులకు తెలిపారు. అలాగే అధ్యక్షుడి హోదాలో బాధ్యతలు నిర్వర్తించేందుకు ఏజీఎంకు హాజరుకావాలనికమిటీ కోరింది’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పారు. వచ్చే జనవరిలో కివీస్ పర్యటనను, జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఇంగ్లండ్ పర్యటనను ఆమోదించారు. స్పాట్ ఫిక్సింగ్పై బీసీసీఐ అవినీతి నిరోధక యూనిట్ చీఫ్ రవి సవానీ ఇచ్చిన నివేదికపై ఈనెల 13న బోర్డు క్రమశిక్షణ కమిటీ చర్చిస్తుంది. -
నేడు బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం
కోల్‌కతా: ఈ నెలాఖరున జరిగే వార్షిక సాధారణ సమావేశానికి (ఏజీఎం) ముందు బీసీసీఐ వర్కింగ్ కమిటీ నేడు (ఆదివారం) చివరిసారి భేటీ కానుంది. అధ్యక్ష పదవికి దూరంగా ఉంటున్న ఎన్.శ్రీనివాసన్ ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. ద్విసభ్య కమిషన్‌పై బాంబే హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసినప్పటికీ అక్కడ శ్రీనివాసన్‌కు ఉపశమనం లభించలేదు. ఈనెల 11న వీరి వాదనలు విననుంది. ఈనేపథ్యంలో తను చైర్మన్ హోదాలో పాల్గొంటారా? లేదా అనేది తేలాల్సి ఉంది. ఈ విషయంలో స్పందించేందుకు ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా నిరాకరించారు. ‘నాకే విషయమూ తెలీదు. వర్కింగ్ కమిటీ మీటింగ్ గురించి నన్నేమీ అడగకండి. సమావేశం ముగిశాక మీకే విషయం తెలుస్తుంది. ఏజీఎంను ఎప్పుడు జరపాలనే అంశం మాత్రం కీలకం కానుంది’ అని దాల్మియా అన్నారు. ఆగస్టు 2న జరగాల్సిన వర్కింగ్ కమిటీలోనే శ్రీనివాసన్ బాధ్యతలు తీసుకోవాల్సి ఉన్నా సాంకేతిక కారణాల వల్ల ఆ మీటింగ్ జరుగలేదు. -
బీసీసీఐ లాభం రూ.350 కోట్లు
ముంబై: ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ. 950 కోట్ల ఆదాయాన్ని మూటగట్టుకుంది. ఇందులో నికర ఆదాయం (లాభం) రూ. 350 కోట్లు అని బోర్డు ఫైనాన్స్ కమిటీ గురువారం ప్రకటించింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో బోర్డు రూ. 382.36 కోట్ల లాభం సంపాదించిందని బోర్డు కోశాధికారి రవి సావంత్ వెల్లడించారు. ఢిల్లీలో సమావేశమైన ఈ కమిటీ... ఖాతాలను ఆమోదించింది. తుది ఆమోదం కోసం కోసం బీసీసీఐ వర్కింగ్ కమిటీకి ఖాతా వివరాలను పంపుతారు. వచ్చే నెల మొదటి వారంలో వర్కింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ మీటింగ్‌లోనే బోర్డు వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) తేదీలను కూడా ఖరారు చేస్తారు.