ఏజీఎమ్ తేదీని ఖరారు చేసే అవకాశం
న్యూఢిల్లీ: బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం ఈనెల 8న చెన్నైలో జరగనుంది. ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ భవితవ్యంతో పాటు వార్షిక సర్వసభ్య సమావేశం తేదీని ఇందులో ఖరారు చేయనున్నారు. అయితే వర్కింగ్ కమిటీలో ఎక్కువ మంది సభ్యులు 7వ తేదీనే అనధికారికంగా శ్రీనివాసన్‌తో సమావేశం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ‘8న వర్కింగ్ కమిటీ సమావేశం ఉందని మాకు సర్క్యులర్ అందింది.
కాబట్టి శ్రీని మద్దతుదారుల సమావేశం 5న జరిగే అవకాశాల్లేవు. 7వ తేదీన తనకు మద్దతిచ్చే కొన్ని రాష్ట్రాల సంఘాలతో ఆయన భేటి కానున్నారు. శ్రీని వ్యతిరేక వర్గం సభ్యులు కూడా వర్కింగ్ కమిటీకి హాజరవుతారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తన భవిష్యత్‌పై చైర్మన్ ఇంత వరకు ఏమీ చెప్పలేదు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
8న బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం
Published Wed, Feb 4 2015 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement
Advertisement