శ్రీనివాసన్ అభ్యర్థన తిరస్కరణ
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా ఐపీఎల్ యేతర వ్యవహారాలు చేపట్టడానికి వీలుగా ఆదేశాల్లో మార్పులు చేయాలన్న శ్రీనివాసన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ పట్నాయక్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను తాము మార్చలేమని జస్టిస్ బీఎస్ చౌహన్, సిక్రిలతో కూడిన ద్విసభ్య బెంచ్ వెల్లడించింది. దీంతో శ్రీని పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు న్యాయమూర్తులు అంగీకరించలేదు.
మార్పులు కావాలనుకుంటే గతంలో తీర్చు ఇచ్చిన బెంచ్‌నే సంప్రదించాలని సూచించారు. ‘ఈ కేసులో మీరు ప్రతివాదులుగా ఉన్నారు. విచారణ మొత్తం మీ ముందే జరిగింది. మీకు తెలియకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. మీ సమక్షంలోనే తీర్పు వెల్లడించారు. కాబట్టి వేరే బెంచ్ ఇచ్చిన ఆదేశాల్లో మేం మార్పు చేయలేం’ అని బెంచ్ స్పష్టం చేసింది.
ఆదేశాలను మార్చలేం!
Published Fri, May 23 2014 12:54 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement