ముంబై: ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించి త్రిసభ్య కమిటీని బీసీసీఐ ఏర్పాటు చేసింది. దీనిపై ఆదివారం బీసీసీఐ అత్యవసరంగా సమావేశమైంది. భారత మాజీ ఆల్ రౌండర్ రవిశాస్త్రి, కోల్ కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జేఎన్ పటేల్, మాజీ సీబీఐ డైరెక్టర్ రాఘవన్ లకు ఈ కమిటీలో స్థానం కల్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ త్రిసభ్య కమిటీలోని పేర్లను బీసీసీఐ సుప్రీంకోర్టుకు నివేదించింది. ఐపీఎల్‌లో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లపై విచారణ పారదర్శకంగా జరగాలంటే శ్రీనివాసన్ అధ్యక్ష స్థానం నుంచి తాత్కాలికంగా తప్పుకోవాలని గతంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈనెల 22వ తేదీన ఫిక్సింగ్ కేసు సుప్రీంలో విచారణకు రానున్న సందర్భంలో బీసీసీఐ అత్యవసరంగా సమావేశమైంది. ఈ భేటీకి విదర్భ క్రికెట్ అసోసియేషన్ తరుపున శశాంక మనోహర్ హాజరైయ్యాడు. ముగ్గురు సభ్యుల కమిటీకి రాజ్యసభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ పేరును కూడా వర్కింగ్ కమిటీలో ప్రస్తావించారు.