శ్రీనివాసన్‌కు క్లీన్‌చిట్!
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌పై ఇంకా విచారణ కొనసాగుతున్నా... ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్‌కు మాత్రం ఊరట దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన విచారణలో శ్రీని ప్రమేయం లేదని ఓ నిర్ధారణకు వచ్చిన ముద్గల్ కమిటీ ఆయనకు క్లీన్‌చిట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఫిక్సింగ్ కేసులో శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్నీ సేకరించలేకపోయిన కమిటీ సీబీసీఐడీ దర్యాప్తులో కూడా ఆయన జోక్యం లేదని తేల్చింది. కేవలం ఇద్దరు అధికారులు కావాలని ఆరోపణలు చేసినట్లు గుర్తించింది.
మ్యాచ్‌లు ఫిక్స్ చేయాలని అటు కెప్టెన్ ధోనితోపాటు సూపర్‌కింగ్స్ ఆటగాళ్లకు కూడా శ్రీనివాసన్ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని కమిటీ దృష్టికి వచ్చింది. ఇటీవల సుప్రీంకోర్టుకు సమర్పించిన మధ్యంతర నివేదికలో కమిటీ ఈ అంశాలను పొందుపర్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే గురునాథ్ మెయ్యప్పన్‌పై కొన్ని ఆరోపణలు చేసిన కమిటీ... విక్రమ్ అగర్వాల్, ధోని, మెయ్యప్పన్‌ల మధ్య జరిగిన సమావేశంలో ఫిక్సింగ్ అంశాలు చోటు చేసుకోలేదని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.