ICC Women ODI World Cup 2022, Ind W Vs Ban W: Updates And Highlights In Telugu - Sakshi
Sakshi News home page

World Cup 2022: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్‌.. సెమీస్‌ ఆశలు సజీవం

Published Tue, Mar 22 2022 7:20 AM | Last Updated on Tue, Mar 22 2022 1:19 PM

ICC Women ODI World Cup 2022 Ind W Vs Ban W: Updates And Highlights - Sakshi

ICC Women ODI World Cup 2022 Ind W Vs Ban W : మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బం‍గ్లాదేశ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో 110 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో ప్రపంచకప్‌లో  సెమీస్‌ ఆశలు సజీవంగా భారత్‌ నిలుపుకుంది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. భారత బౌలర్ల ధాటికి 119 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్నేహ్‌ రానా నాలుగు వికెట్లు పడగొట్టి బం‍గ్లాదేశ్‌ పతనాన్ని శాసించింది.

అదే విధంగా గోస్వామి, పూజా వస్త్రాకర్‌ చెరో రెండు వి​కెట్లు సాధించి తమ వంతు పాత్ర పోషించారు. బం‍గ్లాదేశ్‌ బ్యాటర్లలో సల్మా ఖతూన్‌(32) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. అంతకుముందు భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42) రాణించగా.. యస్తికా భాటియా అర్ధ శతకంతో జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది.

12: 53 PM
బంగ్లాదేశ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. భారత్‌ విజయానికి ఒక వికెట్‌ దూరంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మిథాలీ సేన సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి.

12: 42 AM  బంగ్లాదేశ్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. భారత్‌ విజయానికి ఇంకా రెండు వి​కెట్ల దూరంలో నిలిచింది.

12: 37 AM 
ఏడో వికెట్‌ డౌన్‌
బంగ్లాదేశ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 98 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది.

12: 12 AM ఆరో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
ఝులన్‌ గోస్వామి బౌలింగ్‌లో సల్మా ఖతూన్‌ వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. దీంతో బంగ్లాదేశ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. లతా మొండాల్‌, రీతూ మోనీ క్రీజులో ఉన్నారు.
28 ఓవర్లలో బంగ్లాదేశ్‌ స్కోరు: 76-6

11: 59 AM
25 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్‌ స్కోరు:  69-5

11: 31 AM:
భారత బౌలర్లు జోరు మీదున్నారు. వరుస విరామాల్లో వికెట్లు కూలుస్తూ బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపిస్తున్నారు. స్నేహ్‌ రాణా బౌలింగ్లో రుమానా ఐదో వికెట్‌గా వెనుదిరిగింది. దీంతో 40 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్‌ కష్టాల్లో పడింది.

11: 25 AM
బంగ్లాదేశ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. పూనమ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ముర్షీదా ఖతూన్‌ అవుట్‌ అయింది. రుమానా అహ్మద్‌, లతా మొండాల్‌ క్రీజులో ఉన్నారు. స్కోరు- 35-4(17 ఓవర్లు)

11: 14 AM: మూడో వికెట్‌ డౌన్‌
ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. స్నేహ్‌ రాణా బౌలింగ్‌లో నిగర్‌ సుల్తానా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరింది. అంతకుముందు గైక్వాడ్‌ షర్మిన్‌ అక్తర్‌ను, పూజా వస్త్రాకర్‌ ఫర్గాగాను అవుట్‌ చేశారు. 14 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్‌ స్కోరు: 28/3 

10: 52 AM: 15 పరుగుల వద్ద బంగ్లాదేశ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. పూజా వస్త్రాకర్‌ బౌలింగ్‌లో ఫర్గానా హోక్ ఎల్బీగా వెనుదిరిగింది. 9 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్‌  రెండు వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది.

10: 40 AM: 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ షర్మిన్ అక్తర్ రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. 5 పరుగులు చేసిన అక్తర్‌..గైక్వాడ్‌ బౌలింగ్‌లో స్నేహ్‌ రానాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. ‍6 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్‌  వికెట్‌ నష్టానికి 12 పరుగులు చేసింది.

10: 30 AM:  230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ నాలుగు ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. 

09: 51 AM: ప్రపంచకప్‌-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42) రాణించగా.. యస్తికా భాటియా అర్ధ శతకంతో జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇక  బంగ్లా బౌలర్లలో రీతూ మోని 3, నహీదా అక్తర్‌ 2, జహనారా ఆలం ఒక వికెట్‌ పడగొట్టారు. 
  09: 17 AM:అయ్యో.. యస్తికా

హాఫ్‌ సెంచరీ సాధించిన మరుసటి బంతికే భారత బ్యాటర్‌ యస్తికా భాటియా అవుట్‌ అయింది. రీతూ మోని బౌలింగ్‌లో నహీదా అక్తర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరింది. యస్తికా రూపంలో మిథాలీ సేన ఆరో వికెట్‌ కోల్పోయింది. పూజా వస్త్రాకర్‌, స్నేహ్‌ రాణా క్రీజులో ఉన్నారు. స్కోరు 180-6(44 ఓవర్లలో).

09: 16 AM:  అర్ధ శతకం పూర్తి చేసుకున్న యస్తికా
ఓవైపు వికెట్లు పడుతున్నా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేస్తూ భారత బ్యాటర్‌ యస్తికా భాటియా హాఫ్‌ సెంచరీ చేసింది. 79 బంతులు ఎదుర్కొన్న ఆమె 50 పరుగులు పూర్తి చేసుకుంది. సల్మా బౌలింగ్‌లో సింగిల్‌ తీసి అర్ధ శతకం సాధించింది.   
భారత్‌ స్కోరు:176-5(43)

09: 00 AM: ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌
రిచా ఘోష్‌ రూపంలో మిథాలీ సేన ఐదో వికెట్‌ కోల్పోయింది. నహీదా అక్తర్‌ బౌలింగ్‌లో నిగర్‌ సుల్తానాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరింది. ప్రస్తుతం పూజా వస్త్రాకర్‌, యస్తికా భాటియా(44) క్రీజులో ఉన్నారు. భారత్‌ స్కోరు: 163-5(39 ఓవర్లలో)

08: 43 AM:
35 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోరు: 147/4
యస్తికా భాటియా 37 పరుగులు, రిచా ఘోష్‌ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.

08: 20 AM:
30 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోరు: 121/4. యస్తికా భాటియా(20), రిచా ఘోష్‌(9) బ్యాటింగ్‌ చేస్తున్నారు.

08: 11 AM: హర్మన్‌ అవుట్‌
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత మహిళా జట్టు నాలుగో వికెట్‌ కోల్పోయింది. లతా మొండాల్‌ బౌలింగ్‌లో వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ రనౌట్‌(14)గా వెనుదిరిగింది. యస్తికా భాటియా, రిచా ఘోష్‌ క్రీజులో ఉన్నారు.

08: 04 AM: ఆచితూచి ఆడుతున్న యస్తికా, హర్మన్‌
భారత బ్యాటర్లు యస్తికా భాటియా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆచితూచి ఆడుతున్నారు. వికెట్‌ పడకుండా జాగ్రత్తపడుతూ సింగిల్స్‌ తీస్తున్నారు. ఈ క్రమంలో 25 ఓవర్లు ముగిసే సరికి మిథాలీ సేన 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. 

7: 45 AM: కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్న బంగ్లాదేశ్‌
వరుసగా రెండు వికెట్లు కూల్చి జోరు మీదున్న బంగ్లా బౌలర్‌ రీతూ మోని, నహీదా అక్తర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నారు. వీరి బౌలింగ్‌లో సింగిల్స్‌ కూడా తీయలేక యస్తికా, హర్మన్‌ డిఫెన్స్‌ ఆడుతున్నారు. 20 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోరు: 80/3

7: 40 AM: 18 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోరు:  79-3. యస్తికా భాటియా, హర్మన్‌ ‍ప్రీత్‌ కౌర్‌ క్రీజులో ఉన్నారు.

7: 33 AM: వరుసగా వికెట్లు పడగొడుతున్న బంగ్లా బౌలర్లు
ఆరంభంలో తడబడ్డా బంగ్లా బౌలర్లు వరుసగా వికెట్లు కూలుస్తూ ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంటున్నారు. రీతూ మోని మరోసారి భారత్‌ను దెబ్బకొట్టింది. క్రీజులోకి వచ్చీ రాగానే భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ను అవుట్‌ చేసింది. 16 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోరు: 74-3

7: 30 AM:
మిథాలీ సేనకు మరో షాక్‌ తగిలింది. అర్ధ శతకానికి చేరువవుతున్న షఫాలీ వర్మ(42)ను రీతూ మోని పెవిలియన్‌కు పంపింది. షఫాలీ రూపంలో భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. యస్తికా భాటియా, మిథాలీ రాజ్‌ క్రీజులో ఉన్నారు.

7: 28 AM:
జోరు మీదున్న భారత జట్టుకు బంగ్లా బౌలర్‌ నహీదా అక్తర్‌ షాకిచ్చింది. 30 పరుగులతో క్రీజులో ఉన్న మంధానను అవుట్‌ చేసింది. దీంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది.

7: 22 AM:
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మిథాలీ సేనకు శుభారంభం లభించింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ అదరగొడుతున్నారు. ఈ క్రమంలో 14 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోరు: 72-0

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. హామిల్టన్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌ అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement