Breadcrumb
Womens WC 2022 Ind W Vs Aus W: ఆస్ట్రేలియా విజయం.. టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టం
Published Sat, Mar 19 2022 7:20 AM | Last Updated on Sat, Mar 19 2022 2:15 PM
Live Updates
Womens WC 2022: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా లైవ్అప్డేట్స్
ఆస్ట్రేలియా విజయం.. టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టం
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 27 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఆసీస్ బ్యాటర్స్‌లో కెప్టెన్ మెగ్ లానింగ్ 97 పరుగుల వీరోచిత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఓపెనర్లు అలీస్సా హేలీ 72, రాచల్ హేన్స్ 43 పరుగులతో పటిష్ట పునాది వేశారు. టీమిండియా బౌలర్లలో పూజా వస్రా్తకర్ 2 వికెట్లు, మేఘనా, స్నేహ రాణా చెరొక వికెట్ తీశారు. ఇది ఆసీస్‌కు వరుసగా ఐదో విజయం కాగా.. టీమిండియాకు వరుసగా రెండో ఓటమి.
సెంచరీ మిస్ చేసుకున్న ఆసీస్ కెప్టెన్
టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకుంది. 97 పరుగుల వద్ద లానింగ్‌ను పూజా వస్త్రాకర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చింది. ఆసీస్ విజయానికి ఆరు బంతుల్లో 8 పరుగులు అవసరం కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది
విజయానికి 31 పరుగుల దూరం.. మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
28 పరుగులు చేసిన పెర్రీ వస్త్రాకర్ బౌలింగ్‌లో మిథాలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా వుమెన్స్ 44 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 85, బెత్ మూనీ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి ఆసీస్ మరో 31 పరుగుల దూరంలో ఉంది.
మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. ఆసీస్ విజయానికి 53 పరుగులు
మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం మొదలవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ప్రస్తుతం 41 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 73, ఎల్లిసె పెర్రీ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ విజయానికి 53 పరుగులు అవసరం ఉంది.
విజయానికి దగ్గరగా ఆస్ట్రేలియా.. 37 ఓవర్లలో 204/2
టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయానికి దగ్గరవుతుంది. ప్రస్తుతం 37 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 64, ఎల్లిసె పెర్రీ 17 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారు. ఆసీస్ విజయానికి మరో 74 పరుగుల దూరంలో ఉంది
పూజా వస్త్రాకర్ దెబ్బ.. ఆసీస్ రెండో వికెట్ డౌన్
ఇన్నింగ్స్ 21వ ఓవర్ ఆఖరి బంతికి పూజా వస్త్రాకర్ 43 పరుగులు చేసిన హేన్స్‌ను ఔట్ చేసి ఆసీస్‌కు షాక్ ఇచ్చింది. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో హేన్స్ రిచా ఘోష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 22 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. మెగ్ లానింగ్(8) , ఎలిసే పెర్రి(0) క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
ఎట్టకేలకు ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ఆరంభం నుంచి ధాటిగా ఆడుతున్న ఓపెనర్ అలిస్సా హేలీ 72 పరుగులు చేసి స్నేహ రాణా బౌలింగ్‌లో మిథాలీ రాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులుగా ఉంది. రాచల్ హేన్స్ 43, మెగ్ లానింగ్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న ఆస్ట్రేలియా.. 17 ఓవర్లలో 112/0
టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దూకుడైన ఆటతీరు కనబరుస్తుంది. టీమిండియా బౌలర్లకు చాన్స్ ఇవ్వకుండా ఓపెనర్లు ఇద్దరు చెలరేగుతున్నారు. వీరి దాటికి ఆసీస్ 17 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 112 పరుగులు చేసింది. అలిసా హేలీ 66, రాచల్ హెన్స్ 39 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా.. 6 ఓవర్లలో 43/0
టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించింది. 6 ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. అలీసా హేలీ 34, రాచెల్ హేన్స్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆస్ట్రేలియా టార్గెట్- 278
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. యస్తికా భాటియా(59 పరుగులు), మిథాలీ రాజ్(68), హర్మన్‌ప్రీత్ కౌర్(57- నాటౌట్) పరుగులతో రాణించారు. ఆఖర్లో పూజా వస్త్రాకర్ మెరుపులు మెరిపించింది. 28 బంతుల్లో 34 పరుగులు చేసింది.
పూజా వస్త్రాకర్ అవుట్.. టీమిండియా స్కోరు 277-7
ఆఖరి బంతికి భారత బ్యాటర్ పూజా వస్త్రాకర్ రనౌట్‌గా వెనుదిరిగింది. దీంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది.
అర్ధ శతకం పూర్తి చేసుకున్న హర్మన్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ధ శతకం బాదింది. జొనాసెన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 50 పరుగులు పూర్తి చేసుకుంది.
48 ఓవర్లలో భారత్ స్కోరు: 257-6
వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. ఆరు వికెట్లు డౌన్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. మొదట 212 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన రిచా ఘోష్ అలానా కింగ్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌గా వెనుదిరిగింది. అనంతరం 42వ ఓవర్లో స్నేహ రాణా డకౌట్ అయింది. కాగా ప్రస్తుతం టీమిండియా 42 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ 30 పరుగులతో క్రీజులో ఉంది.
మిథాలీ రాజ్(68) ఔట్.. నాలుగో వికెట్ డౌన్
కెప్టెన్ మిథాలీ రాజ్(68) రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. అలానా కింగ్ బౌలింగ్‌ళో మిథాలీ పెర్రీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం టీమిండియా 38 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ 17, రిచా ఘోష్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
యస్తికా బాటియా(59) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 33 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. మిథాలీ రాజ 59, హర్మన్‌ప్రీత్ కౌర్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మిథాలీ రాజ్, యస్తికా బాటియా అర్థసెంచరీలు.. టీమిండియా స్కోరెంతంటే
టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్, యస్తికా బాటియా సూపర్ అర్థసెంచరీలతో మెరిశారు. 78 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో మిథాలీ హాఫ్ సెంచరీ మార్క్ అందుకోగా.. యస్తికా 77 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో ఫిప్టీ సాధించింది. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు ఇప్పటివరకు 123 పరుగులు భాగస్వామ్యం నమోదు చేయడంతో టీమిండియా స్కోరు 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
22 ఓవర్లలో టీమిండియా స్కోరు 101/2
ఓపెనర్లు వికెట్లు తొందరగా కోల్పోయిన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ కాస్త కుదురుకున్నట్లు కనిపిస్తుంది. కెప్టెన్ మిథాలీ రాజ్ 27, యస్తికా బాటియా 28 పరుగులతో ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం 22 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది.
రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. మిథాలీ రాజ్ 7, యస్తిక బాటియా 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఓపెనర్లు స్మృతి మంధాన(10), షఫాలీ వర్మ(12) పరుగులు చేసి ఔటయ్యారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా వుమెన్స్
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా వుమెన్స్ బౌలింగ్ ఎంచుకుంది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు గెలుస్తూ, ఓడుతూ సాగిన పయనం ఇప్పుడు గెలవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా నేడు జరిగే లీగ్ మ్యాచ్‌లో మిథాలీ బృందం ఆస్ట్రేలియాతో తలపడుతుంది. నాలుగు మ్యాచ్‌లాడిన భారత్ రెండు గెలిచి మరో రెండు ఓడింది. ఇక మిగిలింది మూడు మ్యాచ్‌లే. ఇప్పుడు సెమీస్ చేరాలంటే ప్రతి మ్యాచ్‌లో గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రతీ పోరు కీలకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడిన నాలుగు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియాతో కఠిన సవాల్‌కు మిథాలీ సేన సిద్ధమైంది.
Related News By Category
Related News By Tags
-
'క్రికెట్లో రాణించేందుకు ఇష్టమైనవి వదులుకున్నా'
మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా శనివారం టీమిండియా మహిళల జట్టు పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కొంటుంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా సెమీస్‌లో అడుగుపెట్టాలంటే టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించాల్సిందే. అంద...
-
భారత క్రికెట్‌కు దుర్దినం.. ఒకే రోజు మూడు పరాభవాలు
భారత క్రికెట్‌కు సంబంధించి ఇవాళ (డిసెంబర్ 8) దుర్దినం అని చెప్పాలి. ఎందుకంటే.. ఈ రోజు భారత క్రికెట్ జట్లకు మూడు పరాభవాలు ఎదురయ్యాయి. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమి...
-
IND VS AUS: నిప్పులు చెరిగిన బౌలర్లు.. తొలి రోజు టీమిండియాదే
IND VS AUS 1st Test Day 1 Live Updates:ముగిసిన తొలి రోజు ఆట..పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆతిథ్య జట్టుపై టీమిండియా పై చేయి సాధించిం...
-
చెలరేగిన మెక్‌గ్రాత్.. టీమిండియాను క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత మహిళల 'ఏ' జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయింది. ఇవాళ (ఆగస్ట్ 11) జరిగిన మూడో టీ20లో ఆసీస్ ఏ టీమ్ భారత ఏ జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధి...
-
రెండేళ్లలో ఆరు టెస్టు సిరీస్‌లు; మూడు స్వదేశం.. మూడు విదేశం
న్యూఢిల్లీ: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో వరుసగా రెండుసార్లు రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు కోసం 2023–25 డబ్ల్యూటీసీ సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనల ప్రకారం రె...
Comments
Please login to add a commentAdd a comment