![Taapsee Pannu To Play Mithali Raj In Biopic Shabaash Mithu - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/3/Taapsee-Pannu-Mithali-Raj-%20fina.jpg.webp?itok=dOA1SuaJ)
సాక్షి, హైదరాబాద్ : భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్‌లో టైటిల్ పాత్ర పోషిస్తున‍్నట్టు హీరోయిన తాప్సీ నిర్ధారించారు. మిథాలీ బర్త్‌డే సందర్భంగా తాప్సీ ఈ విషయం వెల్లడించారు. శభాష్ మితు పేరిట తెరకెక్కనున్న ఈ బయోపిక్‌లో దిగ్గజ మహిళా క్రికెటర్ పాత్రలో తాప్సీ ఒదిగిపోనున్నారు. హ్యాపీ బర్త్‌డే కెప్టెప్ మిథాలీరాజ్ అంటూ సోషల్ మీడియాలో తాప్సీ ఈ వివరాలు పోస్ట్ చేశారు.మహిళా క్రికెటర్‌గా మిథాలీ ప్రస్ధానాన్ని తాను స్క్రీన్‌పై ప్రెజెంట్ చేసే అవకాశం రావడం గర్వకారణమని, శభాష్‌మిథులో మిథాలీ తనను తాను సరైన రీతిలో చూసుకునేలా నటిస్తానని తాప్సీ చెప్పుకొచ్చారు. చివరిగా తాను కవర్‌డ్రైవ్ ఎలా ఆడాలో నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తాప్సీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment