![Tapsee Pannu Movie Shabhaash Mithu Shooting Completed - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/10/tapse.jpg.webp?itok=7gIRN0iE)
ఓ ప్రత్యేకమైన శైలీలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో ఉంది తాప్సీ పన్ను. తప్పడ్, హసీనా దిల్‌రూబా, రష్మీ రాకెట్ చిత్రాలతో అలరించింది ఈ పంజాబీ భామ. ఇప్పుడు శభాష్ మిథూ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలిపింది. శ్రీజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌గా తెరకెక్కిస్తున్నారు.
'ఉదయయం 8 గంటలకు ఒక కల వచ్చింది. క్రికెట్ కేవలం జెంటిల్‌మెన్ గేమ్ అవ్వని రోజు ఒకటి వస్తుంది. నీలి రంగులో మహిళలు త‍్వరలో వచ్చేస్తారు అని తన అభిమానులకు తాప్సీ చెప్పింది. మాది ఒక టీమ్ అవుతుంది. దానికి ఒక గుర్తింపు వస్తుంది. నీలి రంగులో మహిళలు త్వరలో రాబోతున్నారు. వరల్డ్ కప్ 2022కి సిద్ధంగా ఉండండి' అని తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది తాప్సీ.
తాప్సీ పన్ను రష్మీ రాకెట్‌లో జెండర్ సమస్యలు ఎదుర్కొనే అథ్లెట్‌గా నటించింది. ఇప్పుడు మరో స‍్పోర్ట్స్‌కు సంబంధించిన చిత్రం శభాష్ మిథూలో లీడ్ రోల్ ప్లే చేయనుంది. మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపకిక్‌గా రూపొందిస్తున్నారు. 2005, 2007లో ప్రపంచ వరల్డ్ కప్ మహిళల క్రికెట్ జట్టుకు మిథాలీ నాయకత్వం వహించింది. 20 ఏళ్ల ఆటను పూర్తి చేసిన తర్వాత 2019లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment