ICC Women ODI World Cup 2022 Ind W Vs WIW: ఐసీసీ మహిళా వన్డే కప్-2022లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మిథాలీ సేన అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, యస్తికా భాటియా శుభారంభం అందించారు. మంధాన 119 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 123 పరుగులు చేయగా.. యస్తికా 31 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ 5 పరుగులకే పెవిలియన్ చేరగా, దీప్తి శర్మ 15 పరుగులకే అవుట్ అయింది.
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, మంధానతో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించింది. 107 బంతుల్లో 109 పరుగులు సాధించింది. ఇందులో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక మంధాన, హర్మన్ అద్భుత సెంచరీలతో ఆకట్టుకోవడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. కాగా ఈ వరల్డ్‌కప్ టోర్నీలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక చివర్లో 53 పరుగులకే విండీస్ ఐదు వికెట్లు తీసినప్పటికీ అప్పటికే భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది.
వెస్టిండీస్‌తో మ్యాచ్: భారత మహిళా జట్టు స్కోరు: 317-8 (50 ఓవర్లలో)
మంధాన, హర్మన్ సెంచరీలు
స్మృతి మంధాన- 119 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 123 పరుగులు
హర్మన్‌ప్రీత్ కౌర్- 107 బంతుల్లో 109 పరుగులు
చదవండి: Aaron Finch: లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆసీస్ కెప్టెన్.. ఐపీఎల్లోకి రీఎంట్రీ
The HIGHEST total of #CWC22
— ESPNcricinfo (@ESPNcricinfo) March 12, 2022
India put on a fabulous show with the bat 🙌
West Indies picked up 5 wickets for 53 runs near the end, but the damage was already done by then.#WIvIND SCORECARD ⬇️
Comments
Please login to add a commentAdd a comment