ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మిథాలీ సేన 134 పరుగులకు ఆలౌట్(PC: BCCI)
ICC Women World Cup 2022 Ind W Vs Eng W: న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2022లో భాగంగా భారత మహిళా జట్టు బుధవారం ఇంగ్లండ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మిథాలీ సేన 134 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ యస్తికా భాటికా 11 బంతుల్లో 8 పరుగులు చేసి పెవిలియన్ చేరింది.
ఆమె స్థానంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్ 5 బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు సాధించింది. దీప్తి శర్మ పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్‌గా వెనుదిరిగింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ఓపెనర్ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసింది. కానీ ఇంగ్లండ్ బౌలర్ చార్లెట్ డీన్ భారత్‌ను దెబ్బకొట్టింది. ఒకే ఓవర్ హర్మన్‌తో పాటు ఆమె స్థానంలో క్రీజులోకి వచ్చిన స్నేహ్ రాణాను పెవిలియన్‌కు పంపింది.
ఆ తర్వాత సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో మంధాన ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించింది. ఇక నిలకడగా ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్(33 పరుగులు) రనౌట్ కావడంతో భారత్ మరింతగా కష్టాల్లో కూరుకుపోయింది. ఝులన్ గోస్వామి కాసేపు బ్యాట్ ఝులిపించినా ఆమెకు సహకారం అందించేవాళ్లు కరువయ్యారు.
పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రాజేశ్వరీ గైక్వాడ్ ముగ్గురూ కలిసి కేవలం 10 పరుగులు మాత్రమే సాధించారు. ఈ క్రమంలో భారత్ 36.2 ఓవర్లలో 134 చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో చార్లెట్ డీన్‌కు నాలుగు, శ్రుబ్సోలేకు రెండు, సోఫీకి ఒకటి, కేట్ క్రాస్‌కు ఒక వికెట్ దక్కాయి.
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత్ స్కోరు: 134-10 (36.2 ఓవర్లు).
Comments
Please login to add a commentAdd a comment