ICC Women ODI World Cup 2022 Ind Vs WI Live Updates And Highlights In Telugu - Sakshi
Sakshi News home page

World Cup 2022- Ind W Vs WIW: అదరగొట్టిన మిథాలీ సేన.. విండీస్‌పై భారీ విజయం.. ఏకంగా

Published Sat, Mar 12 2022 7:53 AM | Last Updated on Sat, Mar 12 2022 1:44 PM

ICC Women ODI World Cup 2022: India Vs West Indies Women Highlights - Sakshi

ICC Women ODI World Cup 2022: Updates: 
1: 23 PM
ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్‌-2022లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. న్యూజిలాండ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 155 పరుగుల భారీ తేడాతో విండీస్‌పై గెలుపొందింది.

1: 10 PM
తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన వెస్టిండీస్‌.. విజయానికి అడుగుదూరంలో భారత మహిళా జట్టు. స్కోరు: 158/9 (37) 

1: 05 PM:
ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన వెస్టిండీస్‌

12: 58 PM
34 ఓవర్లు ముగిసే సరికి వెస్టిండీస్‌ స్కోరు: 155/7.

12: 34 PM
వెస్టిండీస్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత బౌలర్ల ధాటికి విండీస్‌ మిడిలార్డర్‌ కుప్పకూలింది. ఈ క్రమంలో 28 ఓవర్లకే టేలర్‌ బృందం 7 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుత స్కోరు: 145/7 (28). ఇక భారత్‌పై విజయం సాధించాలంటే 173 పరుగులు అవసరం.

12: 21 PM:
వెస్టిండీస్‌ మహిళా జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఓపెనర్లు మెరుపులు మెరిపించినా.. మిడిలార్డర్‌ విఫలం కావడంతో 24 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌ బౌలింగ్‌లో చినెలె హెన్రీ ఆరో వికెట్‌గా వెనుదిరిగింది.

12: 15:
వెస్టిండీస్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ దెబ్బ కొడుతున్నారు. ఇప్పటికే స్నేహ్‌ రాణా, మేఘన రెండేసి వికెట్లు తీయగా... కాంప్‌బెల్‌ను ఐదో వికెట్‌గా పూజా వస్త్రాకర్‌ పెవిలియన్‌కు పంపింది.

11: 55 AM:
ఆరంభంలో ధాటిగా ఆడిన విండీస్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతోంది. హేలీ మాథ్యూస్‌ రూపంలో నాలుగో వికెట్‌ డౌన్‌ అయింది. స్నేహ్‌ రాణా అద్భుత బౌలింగ్‌లో హేలీ 43 పరుగుల వద్ద నిష్క్రమించింది. విండీస్‌ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసిన ఇద్దరు ఓపెనర్లు డాటిన్‌, హేలీని స్నేహ్‌ పెవిలియన్‌ను పంపి భారత్‌కు బ్రేక్‌ ఇచ్చింది.

11: 52 AM:
కెప్టెన్‌ టేలర్‌ రూపంలో విండీస్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. మేఘనా సింగ్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది.

11: 49 AM: 17 ఓవర్లలో విండీస్‌ స్కోరు: 112/2
స్కోరు బోర్డును పరిగెత్తిస్తున్న విండీస్‌ బ్యాటర్లకు భారత బౌలర్లు మేఘనా సింగ్‌, స్నేహ్‌ రాణా బ్రేకులు వేశారు. డాటిన్‌(62 పరుగులు)ను స్నేహ్‌ పెవిలియన్‌కు చేర్చగా.. వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన నైట్ను మేఘన అవుట్‌ చేసింది. 

11: 07 AM: దీటుగా బదులిస్తున్న వెస్టిండీస్‌ మహిళా జట్టు
ఆతిథ్య న్యూజిలాండ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌లపై సంచలన విజయాలు సాధించిన విండీస్‌ భారత్‌తో మ్యాచ్‌లోనూ సత్తా చాటుతోంది. 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌.. 10 ఓవర్లలో 81 పరుగులు చేసింది.

భారత్‌ విసిరిన సవాల్‌కు దీటుగా బదులిస్తోంది. ఓపెనర్‌ డియాండ్ర డాటిన్‌ 36బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకుంది. మరో ఓపెనర్‌ హేలీ 32 పరుగులు చేసింది. పది ఓవర్లలో వెస్టిండీస్‌ స్కోరు: 81-0

స్మృతి, హర్మన్‌ మెరుపులు.. భారత్‌ భారీ స్కోరు
10: 08 AM

న్యూజిలాండ్‌ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారత మహిళా జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న మిథాలీ సేన.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది.

ఓపెనర్‌ స్మృతి మంధాన(123), వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(109) అద్భుత సెంచరీలతో జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. మిగతా వాళ్లలో యస్తికా భాటియా(31 పరుగులు), పూజా వస్త్రాకర్‌(10) తప్ప మిగతా వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.
10: 03 AM
ఎనిమిదో వికెట్‌డౌన్‌
ఝులన్‌ గోస్వామి రూపంలో భారత్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 
10 AM:
ఆఖర్లో భారత్‌ వరుసగా వికెట్లు కోల్పోతోంది. అనిసా మహ్మద్‌ బౌలింగ్‌లో పూజా వస్త్రాకర్‌ అవుట్‌ కాగా.. అలియా హర్మన్‌ను పెవిలియన్‌కు పంపింది. దీంతో 49 ఓవర్లలో భారత్‌ 7 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది.

9: 52 AM:
భారత్‌ ప్రస్తుత స్కోరు: 296/5 (47)

9: 49 AM:
విండీస్‌ బౌలర్‌ అలియా రిచా ఘోష్‌ను పెవిలియన్‌కు పంపింది. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిచా క్రీజు వీడింది. తద్వారా భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. రిచా స్థానంలో పూజా వస్త్రాకర్‌ మైదానంలో దిగింది.

9: 46 AM: హర్మన్‌ చేసెను అద్భుతం
భారత బ్యాటర్‌, వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అద్భుత సెంచరీ సాధించింది. 100 బంతుల్లో 100 పరుగులు చేసింది.

9: 32 AM:
44 ఓవర్లలో భారత్‌ స్కోరు: 268/4 (44)
హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌-83, రిచా ఘోష్‌ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

9: 25 AM: స్మృతి అవుట్‌:
సెంచరీ సాధించి జోరు మీదున్న స్మృతి అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది. షమీలియా బౌలింగ్‌లో సెల్మాన్‌కు క్యాచ్‌ ఇచ్చి 123 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె నిష్క్రమించింది. రిచా ఘోష్‌ క్రీజులోకి వచ్చింది.
స్కోరు: 264/4 (42.5)

9: 23 AM: దంచి కొడుతున్న స్మృతి, హర్మన్‌
విండీస్‌లో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ దంచి కొడుతున్నారు. 
42 ఓవర్లలో భారత్‌ స్కోరు: 257-3

9: 16 AM: శెభాష్‌ మంధాన
విండీస్‌తో మ్యాచ్‌లో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన శతకం సాధించింది. విండీస్‌ బౌలర్‌ హేలీ బౌలింగ్‌లో ఫోర్‌ బాది సెంచరీ పూర్తి చేసుకుంది. మరోవైపు వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ కూడా అర్ధ శతకం పూర్తి చేసుకుని జోరు మీదుంది.

9: 06 AM
శత​కానికి చేరువవుతున్న స్మృతి మంధాన. 99 బంతుల్లో 94 పరుగులు

9: 00 AM:
35 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోరు: 190-3
మంధాన, హర్మన్‌ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు.

8: 33 AM: 30 ఓవర్లలో భారత్‌ స్కోరు: 160/3
స్మృతి మంధాన 65, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మంధాన హాఫ్‌ సెంచరీ
8: 18 AM: అర్ధ శతకం పూర్తి చేసుకున్న స్మృతి మంధాన
67 బంతుల్లో 53 పరుగులు సాధించిన భారత ఓపెనర్‌

ధాటిగా ఆడుతున్న మంధాన
 8:15 AM:
25 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోరు: 125-3
స్మృతి మంధాన 44, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు.


7: 55 AM: 20 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోరు- 100-3. స్మృతి మంధాన 32 పరుగులు, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఓపెనర్ల శుభారంభం.. కానీ
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. సెడాన్‌ పార్కు వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఓపెనర్లు స్మృతి మంధాన, యస్తికా భాటియా(31 పరుగులు) శుభారంభం అందించారు. అయితే, కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ మరోసారి నిరాశ పరిచింది. కేవలం 5 పరుగులకే పెవిలియన్‌ చేరింది.


తుది జట్లు:
భారత్‌: యస్తికా భాటియా, స్మృతి మంధాన, దీప్తి శర్మ, మిథాలీ రాజ్‌(కెప్టెన్‌), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, రిచా ఘోష్‌(వికెట్‌ కీపర్‌), స్నేహ్‌ రాణా, పూజా వస్త్రాకర్‌, ఝులన్‌ గోస్వామి, మేఘనా సింగ్‌, రాజేశ్వరీ గైక్వాడ్‌

వెస్టిండీస్‌: డియేండ్ర డాటిన్‌, హేలీ మాథ్యూస్‌, కైసియా నైట్‌(వికెట్‌ కీపర్‌), స్టెఫానీ టేలర్‌(కెప్టెన్‌), షిమానె కాంప్‌బెల్‌, చెడాన్‌ నేషన్‌, చినెల్లె హెన్రీ, అలియా అలెన్‌, షమీలియా కానెల్‌, అనిసా మహ్మద్‌, షకేరా సెల్మాన్‌.

చదవండి: Aaron Finch: లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన ఆసీస్‌ కెప్టెన్‌.. ఐపీఎల్లోకి రీఎంట్రీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement