India Take On Pakistan In Womens ODI World Cup 2022: గతేడాది పురుషుల టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి భారత మహిళల జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రేపు (మార్చి 6) పాక్‌తో జరగబోయే మ్యాచ్‌లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. న్యూజిలాండ్‌లోని మౌంట్ మౌంగనూయి ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.
Pakistan and India captains exchanging greetings on the eve of their match. How excited are you? #CWC22 #BackOurGirls pic.twitter.com/fTEawDeiUI
— Pakistan Cricket (@TheRealPCB) March 5, 2022
వార్మప్ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, విండీస్‌లపై విజయాలు సాధించి ఫుల్ జోష్‌లో ఉన్న మిథాలీ సేన.. పాక్‌తో రేపు జరగబోయే మ్యాచ్‌లోనూ పైచేయి సాధించాలని ఆశిస్తుంది. మరోవైపు భారత్‌ను ఓడించేందుకు బిస్మా మహరూఫ్ నేతృత్వంలోని పాక్ సైతం ఉవ్విళ్లూరుతుంది. భారత్‌కు కలిసొచ్చే విషయం ఏంటంటే పాక్‌తో మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉండటమే కాకుండా మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ కౌర్ వార్మప్ మ్యాచ్‌లో సెంచరీ సాధించి సూపర్ ఫామ్‌లో ఉంది.
గత రికార్డులను పరిశీలిస్తే.. మహిళల వన్డే క్రికెట్‌లో భారత్-పాక్‌లు ఇప్పటి వరకు 10 సందర్భాల్లో ఎదురెదురుపడగా, అన్ని సార్లు టీమిండియానే విజయం వరించింది. ఇందులో 3 విజయాలు ప్రపంచకప్ టోర్నీల్లో దక్కినవే కావడం విశేషం. ఇక పొట్టి క్రికెట్‌లో ఇరు జట్లు తలపడిన 11 మ్యాచ్‌ల్లో టీమిండియా ఒకేసారి ఓడిపోయింది.
చదవండి: బంగ్లాకు షాకిచ్చిన అఫ్ఘానిస్థాన్.. టీ20 సిరీస్ సమం
Comments
Please login to add a commentAdd a comment