మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. లీగ్ మ్యాచ్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తద్వారా వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక పరుగుల ఛేజింగ్ చేసిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డులలెక్కింది. మరో వైపు తమ రికార్డునే ఆస్ట్రేలియా ఐదేళ్ల తర్వాత బ్రేక్ చేసింది. 2017 ప్రపంచకప్‌లో శ్రీలంకపై 262 పరుగుల లక్క్క్ష్యాన్ని ఆస్ట్రేలియా చేధించింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో యస్తికా భాటియా (59), కెప్టెన్ మిథాలీ రాజ్(68) హర్మన్ ప్రీత్ కౌర్ (57) పరుగులతో రాణించారు. ఇక 278 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో రేచల్ హేన్స్(43), అలీసా హేలీ(72), కెప్టెన్ లానింగ్(97) పరుగులతో టాప్ స్కోరర్‌లుగా నిలిచారు.
చదవండి: World Cup 2022: మిథాలీ సేనకు షాక్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆసీస్
Comments
Please login to add a commentAdd a comment