
న్యూఢిల్లీ: త్వరలో ఆ్రస్టేలియా పర్యటనకు వెళ్లే మహిళల జట్లను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. మూడు ఫార్మాట్‌లకు మీడియం పేసర్ మేఘనా సింగ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ యస్తిక భాటియా ఎంపిక కాగా...టి20ల్లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రేణుకా సింగ్‌కు తొలి అవకాశం దక్కింది. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన అరుంధతీ రెడ్డిని టెస్టు, వన్డే జట్టునుంచి తప్పించి టి20ల్లో మాత్రం కొనసాగించారు. మిథాలీరాజ్ సారథ్యంలో 18 మంది సభ్యులతో కూడిన జట్టు ఏకైక (డే అండ్ నైట్) టెస్టు, 3 వన్డేలు, 3 టి20లు ఆడుతుంది.
చదవండి: Finn Allen: వ్యాక్సిన్ రెండు డోసుల తర్వాత క్రికెటర్‌కు కరోనా పాజిటివ్
Comments
Please login to add a commentAdd a comment