భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం శభాష్ మిథు. హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుంచి సోమవారం టీజర్ రిలీజైంది. జనాలతో కిక్కిరిసిపోయిన స్టేడియంలోకి టీమ్‌ను గెలిపించడానికి నేనున్నానంటూ భరోసానిస్తూ బ్యాట్‌ను పైకెత్తుతూ అడుగుపెట్టింది తాప్సీ.
ఈ టీజర్ చూసిన క్రికెట్ అభిమానులు సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వయాకామ్ 18 స్టూడియో నిర్మిస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ మహిళా క్రీడాకారిణిపై వస్తున్న బయోపిక్ కావడంతో శభాష్ మిథుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా కోసం మాజీ క్రికెటర్ నూషిన్ అల్ ఖదీర్ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది తాప్సీ. అచ్చంగా మిథాలీ రాజ్‌లా ఆడటం, ప్రవర్తించడం మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. కాగా తాప్సీ గతంలోనూ క్రీడానేపథ్యం ఉన్న చిత్రాలు చేసింది. సూర్మ, సాండ్ కీ ఆంఖ్, రష్మీ రాకెట్ వంటి స్పోర్ట్స్ రిలేటెడ్ మూవీస్‌లో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment