లక్నో: భారత్ మహిళల వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ మరో అరుదైన ఘనతను సాధించింది. ఇటీవల పదివేల అంతర్జాతీయ పరుగులు చేసిన రెండో మహిళా క్రికెటర్‌గా నిలిచిన మిథాలీ.. ఇప్పుడు వన్డేల్లో 7వేల పరుగులు చేసిన తొలి బ్యాట్‌వుమెన్‌గా నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని అటల్ బిహారి వాజ్‌పేయి స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో 26వ పరుగుల వద్ద మిథాలీ ఈ మైలురాయిని అందుకుంది.తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్‌కు చెందిన చార్లెట్ ఎడ్వర్డ్స్(5992), ఆస్ట్రేలియాకు చెందిన బెలిందా క్లార్క్ (4844) ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ సెంచరీతో(104 పరుగులు నాటౌట్) మెరవగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ 55 పరుగులు చేసింది. 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 22వ ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 110 పరుగులు చేసింది. 38 ఏళ్ల మిథాలీ ఇటీవల ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్రలో 10వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా, తొలి భారతీయ వుమెన్ క్రికెటర్‌గా నిలిచింది. 1999లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన మిథాలీరాజ్.. ఇప్పటి వరకు 213 వన్డే మ్యాచుల్లో.. 50.7 సగటుతో 7008 పరుగులు చేయగా.. ఇందులో ఏడు సెంచరీలు, 54 అర్ధసెంచరీలు సాధించింది.
చదవండి:
జెర్సీ 18.. జెర్సీ 22.. నిజంగా అద్బుతం
Comments
Please login to add a commentAdd a comment