![India Women Gear Up For The ODI Series Against England Women - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/28/MITHALI-RAJ-72A.jpg.webp?itok=SQ-e7oHZ)
బ్రిస్టల్: ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టులో స్ఫూర్తిదాయక ఆటతీరుతో ‘డ్రా’గా ముగించిన భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే సిరీస్‌ను మాత్రం పరాజయంతో ప్రారంభించింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టును ఓడించింది. 202 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బీమోంట్ (87 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్), సీవర్ (74 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్) అజేయ అర్ధ సెంచరీలు చేశారు. అబేధ్యమైన మూడో వికెట్‌కు 119 పరుగులు జోడించారు. మొదట భారత జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (108 బంతుల్లో 72; 7 ఫోర్లు) అర్థసెంచరీతో ఆకట్టుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన (10; 1 ఫోర్), షఫాలీ వర్మ (15; 3 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరగ్గా... పూనమ్ రౌత్ (32; 4 ఫోర్లు), దీప్తి శర్మ (30; 3 ఫోర్లు) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఎకిల్‌స్టోన్ 3, కేథరిన్ బ్రంట్, ష్రబ్‌సోల్ చెరో 2 వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment