ముంబై: టీమిండియా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు స్థాయిలో 16 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించి సత్తా చాటింది. టీమిండియా మెన్స్‌తో పాటు ఉమెన్స్ క్రికెట్ కలిపి ఈ ఫాలోవర్స్‌ను సాధించడం విశేషం. ఈ స్థాయిలో ఫాలోవర్స్ పెరగడానికి ప్రధాన కారణం ఆసీస్ పర్యటనే అని చెప్పొచ్చు. ఆసీస్ గడ్డపై టీమిండియా వీరోచిత ప్రదర్శన చేసి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవడంతో టీమిండియాకు ఎనలేని క్రేజ్ వచ్చింది. చదవండి: ఒక్క టెస్ట్.. 3 రికార్డులు.. కోహ్లికి మాత్రమే
డిసెంబర్ నుంచి టీమిండియాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరాధించేవాళ్లు బాగా పెరిగారు. టీమిండియా యువ ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్ హీరోలుగా మారిపోవడం.. సీనియర్లు పుజారా, రహానే, రోహిత్‌లకు విపరీతమైన ఫాలోయింగ్ పెరగడమే దీనికి కారణం. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ టీమిండియా అఫీషియల్ పేజీలో పోస్టును రాసుకొచ్చింది.
'ఇన్‌స్టాలో మాకు పెద్ద ఫ్యామిలీ లభించింది. దాదాపు 16 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.. ఇట్స్ ఏ బిగ్ ఫ్యామిలీ.. మీ ప్రేమకు, అభిమానానికి, మద్దతుకు మనస్సూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం' అంటూ క్యాప్షన్ జత చేశారు. ఇండియన్ క్రికెట్ టీమ్ రిలీజ్ చేసిన ఫోటోలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు టీమిండియా ఉమెన్స్ కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, పుజారా, రహానే, అశ్విన్‌తో పాటు పలువురి ఫోటోలు ఉన్నాయి. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. కాగా టీమిండియా ఫిబ్రవరి 5వ తేదీ నుంచి చెన్నై వేదికగా తొలి టెస్టు ఆడనున్న సంగతి తెలిసిందే.చదవండి: షమీకి భార్య హసీన్ జహాన్ మరో షాక్
Comments
Please login to add a commentAdd a comment