Virat Kohli Shares Cryptic Instagram Story Leaves Fans Wondering - Sakshi
Sakshi News home page

Virat Kohli: అభిమానులను ఆశ్చర్యపరిచిన 'కింగ్‌' కోహ్లి పోస్ట్‌

Published Thu, Feb 2 2023 11:34 AM | Last Updated on Thu, Feb 2 2023 12:04 PM

Virat Kohli Leaves Fans Wondering Cryptic Post In Instagram Viral - Sakshi

టీమిండియా స్టార్‌.. కింగ్‌ కోహ్లి ఖాళీగా ఉంటే చాలు టూర్లు చుట్టేయడం అలవాటుగా చేసుకున్నాడు. కివీస్‌తో టి20 సిరీస్‌ సందర్భంగా విరామం దొరకడంతో భార్య అనుష్క, కూతరు వామికాతో కలిసి రిషికేశ్‌ టూర్‌లో బిజీగా ఉన్నాడు. బుధవారం కోహ్లి రిషికేశ్ టూర్‌కు సంబంధించిన ఫోటోలు విడుదల చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌ ఆలోచింపజేసేలా ఉంది.

ప్రస్తుతం అతని మనసు ఎంత ప్రశాంతతను  కోరుకుంటుందనేది క్యాప్షన్‌గా జత చేశాడు. '' మనసుకు ఏది కరెక్ట్‌​ అనిపిస్తే ఆ డైరక్షన్‌లోనే వెళ్లండి'' అంటూ పేర్కొన్నాడు. కోహ్లి చేసిన పోస్ట్‌పై అభిమానులను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం కోహ్లి ప్రశాంతతో కనిపిస్తున్నాడని.. రాబోయే ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ కోసం మానసికంగా సన్నద్దమవుతున్నాడని కామెంట్‌ చేశారు.

ఇక ఆసియా కప్‌లో సెంచరీ ద్వారా తిరిగి ఫామ్‌ను అందుకున్న కోహ్లి తన జోరును చూపిస్తున్నాడు. టి20 వరల్డ్‌కప్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన కోహ్లి.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌, శ్రీలంకలతో జరిగిన సిరీస్‌ల్లో వరుస శతకాలతో హోరెత్తించాడు. అయితే ఇటీవలే ముగిసిన న్యూజిలాండ్‌ సిరీస్‌లో మాత్రం మూడు మ్యాచ్‌లు కలిపి కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. అంతమాత్రానా కోహ్లి ఫామ్‌ను సందేహించాల్సిన అవసరం లేదు. ఇక విశ్రాంతి మోడ్‌లో ఉన్న కోహ్లి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఆడనున్నాడు. ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌ వేదికగా భారత్‌, ఆసీస్‌ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.

బోర్డర్‌-గావస్కర్‌ టెస్టు సిరీస్‌ టీమిండియాకు కీలకం కానుంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. ఆసీస్‌తో సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే చాన్స్‌ ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 10 టెస్టుల్లో గెలుపు, ఒక ఓటమి, నాలుగు డ్రాలతో కలిపి 75.56 పర్సంటైల్‌ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఐదు టెస్టుల్లో గెలుపు, నాలుగింటిలో ఓటమి, ఒక డ్రాతో కలిపి 58.93 పర్సంటైల్‌ పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది.

చదవండి: తిట్టినోళ్లే మెచ్చుకున్నారు.. శెభాష్‌ జోఫ్రా ఆర్చర్‌

గంటకు 150 కి.మీ. వేగం.. సర్కిల్‌ బయటపడ్డ బెయిల్స్‌! ఉమ్రాన్‌తో అట్లుంటది మరి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement